బిజయ రంజన్ సింగ్ బరిహా
| బిజయ రంజన్ సింగ్ బరిహా | |||
| నియోజకవర్గం | పదంపూర్ | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1957 పదంపూర్, ఒడిశా | ||
| మరణం | 2022 అక్టోబర్ 3 భువనేశ్వర్, ఒడిశా | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్ | ||
| జీవిత భాగస్వామి | తిలోత్తమ | ||
| సంతానం | ఇద్దరు కుమార్తెలు బర్షా సింగ్ బరిహా, కాదంబిని, కుమారుడు భోజరాజ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
బిజయ రంజన్ సింగ్ బరిహా (జననం 1957) ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆమె పదంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
రాజకీయ జీవితం
[మార్చు]బిజయ రంజన్ సింగ్ జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990 శాసనసభ ఎన్నికలలో పదంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సత్య భూషణ్ సాహుపై 30,410 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1995 శాసనసభ ఎన్నికలలో జనతాదళ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సత్య భూషణ్ సాహుపై 17,695 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
బిజయ రంజన్ సింగ్ ఆ తరువాత బిజూ జనతా దళ్ పార్టీలో చేరి 2000 శాసనసభ ఎన్నికలలో పదంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేడీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సత్య భూషణ్ సాహుపై 8496 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 శాసనసభ ఎన్నికలలో బీజేడీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సత్య భూషణ్ సాహు చేతిలో 3130 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
బిజయ రంజన్ సింగ్ బిజూ జనతా దళ్ పార్టీలో చేరి 2009 శాసనసభ ఎన్నికలలో పదంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేడీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సత్య భూషణ్ సాహుపై 18,066 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 నుండి 2011 వరకు నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[1] ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో బీజేడీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రదీప్ పురోహిత్ చేతిలో 4513 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
బిజయ రంజన్ సింగ్ బిజూ జనతా దళ్ పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో పదంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేడీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రదీప్ పురోహిత్‌పై 5734 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
మరణం
[మార్చు]బిజయ్ రంజన్ సింగ్ బరిహా 65 సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ భువనేశ్వర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2022 అక్టోబర్ 3న మరణించాడు. ఆయనకు భార్య తిలోతమ, కుమార్తెలు బర్షా సింగ్ బరిహా, కాదంబిని, కుమారుడు భోజరాజ్ ఉన్నారు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "BJD MLA Bijay Ranjan Singh Bariha Passed Away". Sakshi. 4 October 2022. Archived from the original on 11 February 2025. Retrieved 11 February 2025.
- ↑ "Odisha: BJD's Padampur MLA Bijaya Ranjan Singh Bariha passes away". The Times of India. 3 October 2022. Archived from the original on 11 February 2025. Retrieved 11 February 2025.