బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక నిర్దిష్ట వ్యాపార విధులకు (లేదాప్రక్రియలు) సంబంధించిన కార్యకలాపాలను మరియు బాధ్యతలను తృతీయపక్ష సేవల సరఫరాదారుకు కాంట్రాక్టుపై అప్పగించే అవుట్‌సోర్సింగ్ రూపాన్ని బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (BPO ) అంటారు. ప్రారంభంలో, దీనిని కోకాకోలా వంటి ఉత్పాదక రంగ సంస్థలు ఉపయోగించాయి, ఈ సంస్థ తన యొక్క సరఫరా విభాగంలోని పెద్దమొత్తంలో సేవలను కాంట్రాక్టులపై బయటకు ఇచ్చింది.[1] . సమకాలీన పరిస్థితుల్లో, ప్రధానంగా దీనిని సేవల అవుట్‌సోర్సింగ్‌ను సూచించడానికి ఉపయోగిస్తున్నారు.

BPOను కార్యాలయ మద్దతు సేవల (బ్యాక్ ఆఫీస్) అవుట్‌సోర్సింగ్, కార్యాలయ అనుబంధ సేవల (ఫ్రంట్ ఆఫీస్) అవుట్‌సోర్సింగ్‌లుగా వర్గీకరించవచ్చు - మానవ వనరులు లేదా ఆర్థిక మరియు ఖాతా సేవల వంటి అంతర్గత వ్యాపార కార్యాలను తృతీయపక్ష సరఫరాదారుకు అప్పగించడాన్ని కార్యాలయ మద్దతు సేవల అవుట్‌సోర్సింగ్ అంటారు, సంప్రదింపు కేంద్రాల సేవల వంటి వినియోగదారు సంబంధిత సేవలు కార్యాలయ అనుబంధ సేవల అవుట్‌సోర్సింగ్ పరిధిలోకి వస్తాయి.

కంపెనీ ఉన్న దేశం నుంచి వేరొక దేశానికి సేవల కాంట్రాక్టులను అందజేసే BPOను ఆఫ్‌షోర్ అవుట్‌సోర్సింగ్ అని పిలుస్తారు. కంపెనీ ఉన్న దేశానికి పొరుగున ఉన్న (లేదా సమీపంలో ఉన్న) దేశానికి సేవలు అప్పగించే BPOను నియర్‌షోర్ అవుట్‌సోర్సింగ్ అని పిలుస్తారు.

సమాచార సాంకేతికపరిజ్ఞాన పరిశ్రమకు BPO సాన్నిధ్యం కలిగివుండటడంతో, ఇది సమాచార సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత సేవలు లేదా ITES గా కూడా వర్గీకరించబడింది. నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (KPO) మరియు లీగల్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (LPO) అనేవి బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ పరిశ్రమలో కొన్ని ఉప విభాగాలు.

పరిశ్రమ పరిమాణం[మార్చు]

భారతదేశం ఆఫ్‌షోర్ BPO నుంచి USD 10.9 బిలియన్లు[2], IT మరియు మొత్తం BPO పరిశ్రమ నుంచి USD 30 బిలియన్ల ఆదాయం పొందుతుంది (FY 2008 అంచనా). మొత్తం BPO పరిశ్రమలో భారతదేశం 5-6% శాతం వాటా కలిగివుంది, అయితే ఆఫ్‌షోర్ విభాగంలో మాత్రం 63% వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. గత ఏడాది భారతదేశం 70% ఆఫ్‌షోర్ వాటా కలిగివుండగా, భారతదేశంలో గత ఏడాది పరిశ్రమ 38% వృద్ధి చెందినప్పటికీ, ప్రస్తుతం అది 63% శాతానికి తగ్గిపోయింది, తూర్పు యూరప్, ఫిలిప్పీన్స్, మొరాకో, ఈజిప్ట్ మరియు దక్షిణాఫ్రికా వంటి ఇతర దేశాలు మార్కెట్ వాటాను అందుపుచ్చుకునే స్థాయికి పురోగమించాయి[ఉల్లేఖన అవసరం]. ఈ పరిశ్రమను అభివృద్ధి పరిచేందుకు చైనా కూడా ప్రయత్నిస్తోంది. అయితే, భారతదేశంలో మాత్రం BPO పరిశ్రమ వృద్ధిరేటు కొనసాగుతుందని, ఆఫ్‌షోర్ విభాగంలో మాత్రం దీని మార్కెట్ వాటా క్షీణిస్తుందని భావిస్తున్నారు. భారతదేశం‌లో ఈ పరిశ్రమకు బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, పూణే, చెన్నై మరియు న్యూఢిల్లీ ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి.

NASSCOM ప్రకారం మొదటి ఐదు భారత BPO ఎగుమతిదారులు జెన్‌పాక్ట్, WNS గ్లోబల్ సర్వీసెస్, ట్రాన్స్‌వర్క్స్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, IBM దక్ష్ మరియు TCS BPO.[3]

మెక్‌కిన్సే అంచనాల ప్రకారం, అంతర్జాతీయ ఉద్దేశించదగిన BPO మార్కెట్ విలువ $122 – $154 బిలియన్లు ఉంటుంది, దీనిలో: 35-40 రీటైల్ బ్యాంకింగ్, 25-35 భీమా, 10-12 ప్రయాణ/ఆతిథ్య, 10-12 ఆటో, 8-10 టెలికాం, 8 ఫార్మా, 10-15 ఇతరాలు మరియు 20-25 ఆర్థిక, ఖాతా సేవలు మరియు మానవ వనరుల రంగాలు ఉన్నాయి. అంతేకాకుండా 2006 నుంచి ఈ సామర్థ్యంలో 8% ఉపయోగించబడినట్లు వారు అంచనా వేశారు

== BPO ప్రయోజనాలు మరియు పరిమితులు ==

BPO వలన చేకూరే ఒక ప్రయోజనం ఏమిటంటే, కంపెనీ యొక్క వశ్యతను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే, అనేక వర్గాలు[which?] వ్యవస్థాగత వశ్యతను అవగతం చేసుకునేందుకు భిన్న మార్గాలను అనుసరిస్తున్నాయి. అందువలన బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ సంస్థ యొక్క వశ్యతను భిన్నమార్గాల్లో విస్తరిస్తుంది.

సేవలకు- రుసుము ప్రాతిపదికన BPO విక్రేతలు దాదాపుగా అన్ని సేవలను అందిస్తున్నాయి[ఉల్లేఖన అవసరం]. స్థిర వ్యయాలను చర వ్యయాలుగా మారుస్తూ కంపెనీలకు మరింత సౌకర్యాన్ని కలిగించడంలో ఇది ఉపయోగపడుతుంది.[4] అవసరమైన సామర్థ్యంలో మార్పులకు అనుగుణంగా స్పందించేందుకు చర వ్యయ వ్యవస్థ కంపెనీకి ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఆస్తులపై కంపెనీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా చేయడంతో, ఇది సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.[5] కంపెనీకి దానియొక్క వనరుల నిర్వహణలో సౌకర్యాన్ని పెంచడంతోపాటు, ప్రధాన పర్యావరణ మార్పులకు స్పందనా కాలాన్ని అవుట్‌సోర్సింగ్ తగ్గించగలదు[ఉల్లేఖన అవసరం].

mmm manjకాకాబాడ్సె. N. 2002. ట్రెండ్స్ ఇన్ అవుట్‌సోర్సింగ్: కాంట్రాస్టింగ్ USA అండ్ యూరప్. యూరోపియన్ మేనేజ్‌మెంట్ జర్నల్ వాల్యూమ్. 20, నెంబరు. 2: 189–198</ref> అప్రధాన లేదా పరిపాలనా ప్రక్రియలకు సంబంధించిన విధుల నుంచి ప్రధాన ఉద్యోగులు విముక్తులు అవడంతో, వారు కంపెనీ యొక్క ప్రధాన వ్యాపారాల నిర్మాణంపై ఎక్కువ సమయం దృష్టి పెట్టడంతోపాటు, వారి శక్తియుక్తులు దీని కోసం ఉపయోగించుకోవచ్చు. వినియోగదారు సాన్నిహిత్యం, ఉత్పాదన నాయకత్వం లేదా నిర్వహణ సమర్థత- వీటిలో ఏ ప్రధాన విలువైన ప్రేరకాలపై దృష్టిపెట్టాలో తెలుసుకోవడంలోనే విజయ రహస్యం దాగుంది. ఈ ప్రేరకాల్లో ఏదో ఒకదానిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం ద్వారా కంపెనీ పోటీతత్వ వాతావరణం సృష్టించుకోవడానికి సాయపడుతుంది.[6]

BPO వ్యవస్థాగత సౌకర్యాన్ని పెంచే మూడో మార్గం ఏమిటంటే వ్యాపార ప్రక్రియల వేగాన్ని పెంచడం. లీనియర్ ప్రోగ్రామింగ్ (కనిష్ఠ వ్యయం లేదా గరిష్ఠ లాభం వంటి ఉత్తమమైన ఫలితాలను సాధించేందుకు ఉపయోగించే పద్ధతి) వంటి పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఆవర్తన కాలాన్ని మరియు వనరుల సేకరణ స్థాయిలను తగ్గించవచ్చు, ఇది సమర్థతను పెంచడంతోపాటు, వ్యయాలను తగ్గిస్తుంది[ఉల్లేఖన అవసరం]. సరఫరా గొలుసు భాగస్వాములు మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్‌లను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా సరఫరా గొలుసు నిర్వహణ అనేక వ్యాపార ప్రక్రియల వేగాన్ని పెంచుతుంది, ఉదాహరణకు ఉత్పాదక రంగ కంపెనీ విషయంలో ఉత్పాదకత.[7]

చివరగా, వ్యవస్థాగత జీవిత చక్రంలో[ఎవరు?] వశ్యతను ఒక దశగా భావిస్తున్నారు. నోర్టెల్ ఒక అధికారిక సంస్థ స్థితి నుంచి బాగా చురుకైన పోటీదారుగా మారేందుకు BPO సాయపడింది[ఉల్లేఖన అవసరం]. ప్రామాణిక వ్యాపార ప్రతిబంధకాల నుంచి తప్పించుకుంటూ కంపెనీ వృద్ధి లక్ష్యాలను అందుకోగలదు.[8] విస్తరణతోపాటు సమర్థతను కాపాడుకునేందుకు వ్యాపార సామర్థ్య వేగం మరియు చురుకుదనాన్నిత్యాగం చేయాల్సిన అవసరం లేకుండా కంపెనీలకు BPO సాయపడుతుంది. అనధికారిక వ్యవస్థాపక దశ అధికారిక కార్యకలాప క్రమంగా అపరిపక్వ అంతర్గత మార్పు జరగకుండా ఇది అడ్డుకుంటుంది.[9]

మానవ వనరులు లేదా పరికరాలకు పెద్దమొత్తంలో మూలధన వ్యయం చేయకపోవడం వలన కంపెనీ వేగంగా వృద్ధి చెందేందుకు వీలు ఏర్పడుతుంది, పైవాటిపై చేసిన మూలధన వ్యయం తిరిగి చేతిలోకి వచ్చేందుకు కొన్నేళ్లు పట్టవచ్చు, అంతేకాకుండా కొంతకాలం తరువాత అవి కాలంచెల్లినవి లేదా కంపెనీకి సరిపడనవిగా మారేందుకు ఆస్కారం ఉంది.

సంస్థల యొక్క వశ్యతను BPO పెంచుతుందనే అభిప్రాయాన్ని పైన పేర్కొన్న వాదనలను బలపరుస్తున్నప్పటికీ, యాజమాన్యం దీనిని అమలు చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే సమస్యలు కూడా ఉన్నాయి. ఆచరణలో బయటపడే సమస్యలు: సేవల స్థాయిలను అందుకోవడంలో వైఫల్యం, అస్పష్టమైన ఒప్పంద సమస్యలు, మారుతున్న అవసరాలు మరియు ముందుగా ఊహించని రుసుములు, BPOపై పూర్తిగా ఆధారపడటం వలన వశ్యత తగ్గుతుంది. ఈ కారణంగా, ఏదైనా కంపెనీ బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్‌లో పాలుపంచుకోవాలని నిర్ణయించుకుంటే ఈ సవాళ్లను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది[10]

పరిమాణం మినహా అనేక సందర్భాల్లో BPO సంస్థల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుండటం మరో అదనపు సమస్య. అవి తరచుగా ఒకేరకమైన సేవలను, ఒకేరకమైన భౌగోళిక పరిమాణాలు, ఒకేరకమైన సాంకేతిక పరిజ్ఞాన పరపతిని అందజేయడంతోపాటు ఏకరూప నాణ్యతాభివృద్ధి పద్ధతులు కలిగివున్నాయి.[11]

భయాలు[మార్చు]

బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ యొక్క ప్రధాన లోపం నష్ట సంభావ్యత. ఉదాహరణకు, ఒక సమాచార వ్యవస్థను అవుట్‌సోర్స్ చేయడం వలన సమాచార మరియు గోప్యతాపరమైన భద్రతా సమస్యలు ఏర్పడవచ్చు. ఉదాహరణకు, ఉత్తర అమెరికా లేదా ఐరోపాకు చెందిన కంపెనీ యొక్క సమాచారం ఉపఖండంలో ప్రాప్తి చెందినప్పుడు లేదా నియంత్రించబడినప్పుడు దాని యొక్క భద్రతను నిర్వహించడం క్లిష్టమవుతుంది. ప్రావీణ్యతకు సంబంధించి, ఉద్యోగుల్లో వైఖరి మారుతుండటం, నిర్వహణ వ్యయాలను తక్కువగా అంచనా వేయడం, స్వతంత్రత కోల్పోయే ప్రమాదం తదితర కారణాల వలన అవుట్‌సోర్సింగ్ కంపెనీకి మరియు దాని యొక్క గుత్తేదారుకు మధ్య భిన్నమైన సంబంధానికి దారితీస్తుంది.[12][13]

అందువలన ఏవైనా ప్రయోజనాలు సాధించాలంటే అవుట్‌సోర్సింగ్ యొక్క నష్ట సంభావ్యతలు మరియు ముప్పులను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ఒక నిర్మాణాత్మక మార్గంలో అవుట్‌సోర్సింగ్‌ను నిర్వహించేందుకు, సానుకూల ఫలితాన్ని పెంచడం, నష్ట సంభావ్యతలను తగ్గించడం, ముప్పులను నివారించడం కోసం బిజినెస్ కంటిన్యుటీ మేనేజ్‌మెంట్ (BCM) నమూనా ఏర్పాటు చేయబడింది. అవుట్‌సోర్సింగ్‌కు ఉద్దేశించిన లేదా అవుట్‌సోర్స్ చేయదగిన వ్యాపార ప్రక్రియలను విజయవంతంగా గుర్తించేందుకు, నిర్వహించేందుకు మరియు నియంత్రించేందుకు BCM కొన్ని దశలను కలిగివుంది.[14]
అవుట్‌సోర్స్ చేయదగిన సమాచారాన్ని గుర్తించే ప్రక్రియపై మరింత దృష్టిపెట్టిన మరో నమూనాగా AHP గుర్తించబడింది.[15]
అస్పష్టమైన కాంట్రాక్టు అమరిక నుంచి సాంకేతిక IT- ప్రక్రియలపై అవగాహన లేకపోవడం వరకు కంపెనీలు ఎదుర్కొంటున్న అనేక కాంట్రాక్టు సమస్యలను L. విల్‌కాక్స్, M. లాసిటీ మరియు G. పిట్జెరాల్డ్ గుర్తించారు.[16]

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. టాస్, J. & సండర్, S. 2004, ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ , కమ్యూనికేషన్స్ ఆఫ్ ది ACM, వాల్యూమ్ 47, నెంబరు. 5
 2. కవర్ స్టోరీ
 3. FY 06-07కు (ఆర్థిక సంవత్సరానికి) సంబంధించి NASSCOM ప్రకటించిన టాప్-15 ITES-BPO ఎగుమతిదారుల ర్యాంకింగ్స్
 4. విల్‌కాక్స్, L., హిండిల్, J., ఫెనీ, D. & లాసిటీ, M. 2004, IT అండ్ బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్: ది నాలెడ్జ్ పొటెన్షియల్ , ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్, వాల్యూమ్. 21, పేజీలు 7–15
 5. గిలే, K.M., రషీద్, A. 2000. మేకింగ్ మోర్ బై డూయింగ్ లెస్: ఎన్ ఎనాలసిస్ ఆఫ్ అవుట్‌సోర్సింగ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఫైమ్ పెర్ఫామెన్స్. జర్నల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, 26 (4): 763-790.
 6. లేవీ, B. 2004. అవుట్‌సోర్సింగ్ స్ట్రాటజీస్: ఆపొర్చునిటీస్ అండ్ రిస్క్. స్ట్రాటజీ అండ్ లీడర్‌షిప్, 32 (6) : 20-25.
 7. టాస్, జెరోయిన్, సండర్, శ్యామ్. 2004 ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్. కమ్యూనికేషన్స్ ఆఫ్ ది ACM వాల్యూమ్ 47, నెంబరు 5
 8. ఫిషెర్, L.M. 2001. ఫ్రమ్ వర్టికల్ టు వర్చువల్; హౌ నార్టెల్స్ సప్లయర్ అలెయన్సెస్ ఎక్స్‌టెండ్ ది ఎంటర్‌ప్రైజ్ [ఆన్‌లైన్]. స్ట్రాటజీ+బిజినెస్, http://www.strategy-business.com/press/16635507/11153 నుంచి అందుబాటులో ఉంది [[[5 ఫిబ్రవరి]] 2008న సేకరించబడింది]
 9. (లేవీ 2004, 20-25)
 10. మైఖెల్, వాన్, ఫిట్జెరాల్డ్, గై. 1997. ది IT అవుట్‌సోర్సింగ్ మార్కెట్ ప్లేస్: వెండార్స్ అండ్ దెయిర్ సెలెక్షన్. జర్నల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 12: 223-237
 11. యాడ్‌సిట్, D. (2009) విల్ ఎ టయోటా ఎమర్జ్ ఫ్రమ్ ది ప్యాక్ ఆఫ్ మి-టూ BPO's?, ఇన్ క్యూ http://www.nationalcallcenters.org/pubs/In_Queue/vol3no21.html
 12. బున్మీ సింతియా యాడలెయ్, ఫెనియో అనాన్‌సింగ్ మరియు మిగేల్ బాప్టిస్తా నన్స్. "రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్ ఇన్ IS అవుట్‌సోర్సింగ్: ఎన్ ఇన్వెస్టిగేషన్ ఇన్‌టు కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ నైజీరియా", ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ 24 (2004): 167-180.
 13. K. అల్టిన్‌కెమెర్, A. చతుర్వేది మరియు R. గులాటీ. "ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అవుట్‌సోర్సింగ్: ఇష్యూస్ అండ్ ఎవిడెన్స్", ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ 14- 4 (1994): 252- 268.
 14. ఫోర్బ్స్ గిబ్, మరియు స్టీవెన్ బుకానన్. "ఎ ఫ్రేమ్‌వర్క్ ఫర్ బిజినెస్ కంటిన్యుటీ మేనేజ్‌మెంట్", ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ 26- 2 (2006): 128- 141.
 15. చ్యాన్ యంగ్ మరియు జెన్-బోర్ హువాంగ్. "ఎ డెసిషన్ మోడల్ ఫర్ IS అవుట్‌సోర్సింగ్", ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ 20- 3 (2000): 225- 239.
 16. L. విల్‌కాక్స్, M. లాసిటీ మరియు G. ఫిట్జెరాల్డ్. "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుట్‌సోర్సింగ్ ఇన్ యూరప్ అండ్ ది USA: అసెస్‌మెంట్ ఇష్యూస్", ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ 15- 5 (1995): 333- 351.

బాహ్య లింకులు[మార్చు]