బిజు పట్నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిజు పట్నాయక్
బిజు పట్నాయక్


పదవీ కాలం
5 మార్చ్ 1990 – 15 మార్చ్ 1995
ముందు హేమానంద్ బిస్వల్
తరువాత జానకి బల్లభ్ పట్నాయక్
పదవీ కాలం
23 జూన్ 1961 – 2 అక్టోబర్ 1963
ముందు హరేకృష్ణ మెహతాబ్
తరువాత బిరేన్ మిత్ర

కేంద్ర మంత్రి (ఉక్కు, గనులు, బొగ్గు శాఖ)
పదవీ కాలం
మార్చ్ 1977 – జనవరి 1980
ప్రధాన మంత్రి మోరార్జి దేశాయ్
నియోజకవర్గం కేంద్రపరా

వ్యక్తిగత వివరాలు

జననం (1916-03-05)1916 మార్చి 5
కటక్, ఒడిషా, భారత దేశము
మరణం 1997 ఏప్రిల్ 17(1997-04-17) (వయసు 81)
కొత్త ఢిల్లీ
రాజకీయ పార్టీ జనతా దళ్ (1989-1997)
ఇతర రాజకీయ పార్టీలు జనతా దళ్ (1977-1989)
ఉత్కళ్ కాంగ్రెస్ (1969-1977)
భారత జాతీయ కాంగ్రెస్ (1946-1969)
జీవిత భాగస్వామి గ్యాన్ పట్నాయక్
సంతానం ప్రేమ్ పట్నాయక్,
నవీన్ పట్నాయక్,
గీతా మెహతా
పూర్వ విద్యార్థి రావెన్‌షా కళాశాల
వృత్తి రాజకీయవేత్త, పైలట్
మతం హిందూమతము

బిజయానంద పట్నాయక్, ("బిజు పట్నాయక్"గా సుపరిచితులు) (ఒరియా: ବିଜୁ ପଟ୍ଟନାୟକ; 5 మార్చి 1916 – 17 ఏప్రిల్ 1997) భారతీయ రాజకీయ నాయకులు, ఒడిషా రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

బిజు పట్నాయక్ మార్చి 5 ,1916 న లక్ష్మీనారాయణ్, ఆషాలత పట్నాయక్ దంపతులకు జన్మించాడు. ఆయన గంజాం జిల్లాలోని బరంపురం పట్టణానికి సుమారు 80 కి.మీ దూరంలో గల భంజానగర్ కు చెందినవారు. ఆయన ఒడిషా లోని రావెన్‌షా కళాశాలలో చదివాడు. కానీ విమాన చోదకునిగా ఉండాలనే కోరికతో పైలట్ గా శిక్షణ కొరకు చేరాడు. ఆయన రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ప్రైవేట్ విమనంలో పైలట్ గా పనిచేసాడు. ఆయన రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరి దానికి ఎయిర్ ట్రాన్స్‌పోర్టు కమాండ్ కు అధికారిగా పనిచేసాడు. కానీ ఆయన ఆక్సిస్ పవర్స్ తో యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఆయన చేసిన అక్రమ కృత్యాలకు గానూ రెండు సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజుల తరువాత గిరిజనులు కాశ్మీరును ముట్టడించారు. జవాహర్ లాల్ నెహ్రూ అభ్యర్థన మేరకు సైన్యంలో భాగంగా బయలుదేరిన బిజూ పట్నాయక్ శ్రీనగర్లో అడుగుపెట్టిన తొలి భారతీయ సైనికుడిగా చరిత్రకెక్కాడు.

కుటుంబం

[మార్చు]

బిజూపట్నాయక్ భార్య "జ్ఞాన్‌పట్నాయక్". ఆయన చిన్న కుమారుడు నవీన్ పట్నాయక్ ప్రస్తుతం ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కుమార్తె "గీతా మెహ్రా" ఆంగ్ల రచయిత. ఆయన పెద్ద కుమారుడు ప్రేం పట్నాయక్ ఢిల్లీ కేంద్రంగా గల పారిశ్రామికవేత్త.

స్మారక చిహ్నాలు

[మార్చు]

ఒడిశా ప్రభుత్వం ఆయన పేరుతో అనేక సంస్థలకు నామకరణం చేసింది. అందులో "బిజూ పట్నాయక్ ఎయిర్‌పోర్టు" (భువనేశ్వర్ వద్ద), బిజూపట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, బిజూపట్నాయక్ స్టేడియం (నాల్కో నగర్ వద్ద) మొదలగునవి ముఖ్యమైనవి. ఆయన కుమారుడు నవీన్ పట్నాయక్ తన తండ్రి జన్మదినం అయిన మార్చి 5 న పంచాయతీ రాజ్ దివస్ గా గుర్తించాడు. ఆ దినం ఒడిశాలో ఆయన జ్ఞాపకార్థం శెలవు దినంగా ప్రకటించారు.

బిజు పట్నాయక్ స్మారకం

శాసన సభా చరిత్ర

[మార్చు]
House Constituency[1] Start End[2] Party Notes
11వ లోక్‌సభ అస్కా 1996 1997 ఏప్రిల్ 17* జనతాదళ్ *మరణం
10వ విధాన సభ భువనేశ్వర్ 1990 1995 జనతాదళ్
9వ విధాన సభ భువనేశ్వర్ 1985 1990 జనతా
8వ లోక్‌సభ కేంద్రపారా 1984 1985 మార్చి 25* *రాజీనామా
7వ లోక్‌సభ కేంద్రపారా 1980
8వ విధాన సభ పట్కూరా 1980 1980 జూన్ 11* జనతా (ఎస్) *రాజీనామా[3]
6వ లోక్‌సభ కేంద్రపారా 1977
6వ విధాన సభ రాజ్‌నగర్ 1974 1977 ఉత్కల్ కాంగ్రెస్
రాజ్యసభ ఒడిశా 13 May 1971 1971 అక్టోబరు 6 జనతాదళ్
3వ విధాన సభ చౌద్వార్ 1961 1967 కాంగ్రెస్
2వ విధాన సభ సురాడా 1957 1961 కాంగ్రెస్
1వ విధాన సభ జగన్నాథ్ ప్రసాద్ 1951 1957 కాంగ్రెస్

ఇవికూడా చూడండి

[మార్చు]

బిజు సేన

మూలాలు

[మార్చు]
  1. List of Members of Odisha Legislative Assembly (1951–2004)
  2. "Shri Biju Patnaik, J.D. - Aska (Odisha)". Archived from the original on 2016-04-05. Retrieved 2016-09-20.
  3. S. Gajrani (2004). History, Religion and Culture of India. Gyan Publishing House. pp. 167–. ISBN 978-81-8205-063-1.

ఇతర లింకులు

[మార్చు]