Coordinates: 29°22′N 78°08′E / 29.37°N 78.13°E / 29.37; 78.13

బిజ్నౌర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిజ్నౌర్
పట్టణం
బిజ్నౌర్ is located in Uttar Pradesh
బిజ్నౌర్
బిజ్నౌర్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 29°22′N 78°08′E / 29.37°N 78.13°E / 29.37; 78.13
దేసం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబిజ్నౌర్
Elevation
225 మీ (738 అ.)
Population
 (2011)
 • Total1,15,381
భాషలు
 • అధికారికహిందీ[1]
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationUP-20

బిజ్నోర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలో ఒక పట్టణం, ఆ జిల్లాకు కేంద్రం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. బిజ్నోర్‌ను జాతీయ రాజధాని ప్రాంతం‌లో చేర్చాలని డిమాండ్ ఉంది. [2]

చరిత్ర[మార్చు]

బిజ్లీ పాసి బిజ్నోర్ పట్టణాన్ని స్థాపించాడు. గతంలోని శక్తివంతమైన సామ్రాజ్యాల పతనానికి ముందు, ఉత్తర భారతదేశం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయినప్పుడు పాసి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. [3]

అక్బర్ కాలంలో బిజ్నోర్, మొఘల్ సామ్రాజ్యంలో భాగం. 18 వ శతాబ్దం ప్రారంభంలో, రోహిల్‌ఖండ్ ప్రాంతంలో రోహిల్లా పష్తూన్లు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. 1748 లో, రోహిల్లా నేత అలీ మొహమ్మద్ ఖాన్ బిజ్నోర్లో తన మొదటి ఆక్రమణలు చేపట్టాడు. మిగిలినవి కూడా త్వరలోనే రోహిల్లా కిందకు వచ్చాయి. ఉత్తర జిల్లాలను అలీ మొహమ్మద్ ఖాన్, ఖుర్షీద్ అహ్మద్ బేగ్‌కు మంజూరు చేశాడు. అతను క్రమంగా గంగానదికి ఆవల ఉన్న ప్రాంతం లోను, ఢిల్లీ లోనూ తన ప్రభావాన్ని విస్తరించుకున్నాడు. ఢిల్లీలో అతడు మొఘల్ దళాలకు జీతాలిచ్చే అధికారి పదవితో నజీబ్-ఉద్-దౌలా అనే బిరుదును పొందాడు. మరాఠాలు బిజ్నోర్ పై దాడి చేసి, అనేక యుద్ధాలకు తెరతీసారు. పానిపట్‌లో అహ్మద్ షా అబ్దాలీతో చేతులు కలిపిన రోహిల్లా నేత నజీబ్, సామ్రాజ్యానికి మహామంత్రిగా నియమితుడయ్యాడు. [4]

తాను మరాఠాలను బహిష్కరిస్తానని, అందుకు ప్రతిగా రోహిల్లాలు తనకు డబ్బు చెల్లించాలనీ 1772 లో ఔధ్ నవాబు, రోహిల్లాలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరాఠాలను వెళ్ళగొట్టి నవాబు తనవంతు పని పూర్తి చేసాడు. కాని రోహిల్లాలు డబ్బు చెల్లించడానికి నిరాకరించారు. 1774 లో నవాబు కలకత్తాలోని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంతో కూటమి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తరువాత, రోహిల్లాలకు వ్యతిరేకంగా తన పంతాన్ని నెగ్గించుకునేందుకు ఒప్పందం ప్రకారం ఒక బ్రిగేడు సైన్యాన్ని పంపమని బ్రిటిషు వారిని అడిగాడు. బ్రిటిషు వారు అతనికి సాయం చేసారు. అప్పుడు జరిగిన యుద్ధంలో, రోహిల్లాలను గంగానది దాటి తూర్పు వైపుకు పారద్రోలాడు. నవాబు, బిజ్నోర్‌ను తన రాజ్యంలో కలిపేసుకున్నాడు. అదే సంవత్సరంలో (1774) దీనిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు. 1857 లో జరిగిన తిరుగుబాటు సమయంలో జూన్ 1 న జబీతా ఖాన్ మనవడు నజీబాబాద్ నవాబు బిజ్నోర్‌ను ఆక్రమించుకున్నాడు. హిందువులుకు ముస్లిం పష్టూన్లకూ మధ్య తగవు లున్నప్పటికీ నవాబు, 1858 ఏప్రిల్ 21 వరకు నాగినాలో బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయే వరకు తన స్థానాన్ని కొనసాగించడంలో విజయవంతమయ్యాడు.

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, బిజ్నోర్ పట్టణ సముదాయం జనాభా 1,15,381. అందులో పురుషులు 60,656, స్త్రీలు 54,725. ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 77.90%. [5]

ఇవి కూడ చూడండి[మార్చు]

అఫ్జల్‌ఘర్

మూలాలు[మార్చు]

  1. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 24 నవంబరు 2020.
  2. UP seeks to include 6 districts in NCR, Indian Express.
  3. Gupta, Dipankar (2004-12-08). Caste in Question: Identity Or Hierarchy? (in ఇంగ్లీష్). SAGE Publications. p. 208. ISBN 978-0-7619-3324-3.
  4.  One or more of the preceding sentences incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). "Bijnor". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 3 (11th ed.). Cambridge University Press. pp. 928–929.
  5. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 July 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=బిజ్నౌర్&oldid=3798719" నుండి వెలికితీశారు