బిఫోర్‌ సన్‌సెట్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Before Sunset
దస్త్రం:Before Sunset movie.jpg
Theatrical release poster
దర్శకత్వంRichard Linklater
నిర్మాతRichard Linklater
రచనRichard Linklater
Ethan Hawke
Julie Delpy
Kim Krizan
నటులుEthan Hawke
Julie Delpy
సంగీతంJulie Delpy
ఛాయాగ్రహణంLee Daniel
పంపిణీదారుWarner Independent Pictures
విడుదల
ఫిబ్రవరి 10, 2004 (2004-02-10) (BIFF)
02004-07-02 జూలై 2, 2004 (limited)
నిడివి
80 minutes
దేశంUnited States
భాషEnglish
French
ఖర్చు$2.7 million[1]
బాక్సాఫీసు$15,992,615

బిఫోర్‌ సన్‌సెట్‌ అనేది 2004లో విడుదలైన అమెరికన్‌ సినిమా. ఇది బిఫోర్‌ సన్‌రైజ్‌ (1995 సినిమా)కు సీక్వెల్‌. దీని ముందు సినిమాలాగే ఇది కూడా రిచర్డ్‌ లింక్లేటర్‌ దర్శకత్వంలోనే వచ్చింది. దీనికి ముందు వచ్చిన సినిమా లానే దీనికి కూడా రిచర్డ్‌ లింక్లేటర్ దర్శకత్వం వహించాడు. అయితే ఈసారి స్క్రీన్‌ప్లే క్రెడిట్‌ మాతం సినిమాల్లోని ఇద్దరు నటులు ఎథాన్‌ హాకీ మరియు జూలీ డిల్పేలకు ఇచ్చారు. కథ క్రెడిట్‌ను లింక్లేటర్‌ బిఫోర్‌ సన్‌రైజ్‌ స్క్రీన్‌రైటర్‌ కిమ్‌ క్రిజాన్‌తో కలిసి షేర్‌ చేసుకున్నారు.

కథ బిఫోర్‌ సన్‌రైజ్‌కు కొనసాగింపుగా ఉంటుంది. అందులో ఓ అమెరికా యువకుడు, ఫ్రెంచ్‌ యువతి రైలులో కలుసుకుని, వియన్నాలో ఒక రాత్రి గడుపుతారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత బిఫోర్‌ సన్‌సెట్‌లో మళ్లీ వీళ్లిద్దరి దారులూ కలుస్తాయి. పారిస్‌లో ఓ మధ్యాహ్నం కలిసి గడిపిన తర్వాత కథ సుఖాంతమవుతుంది. బిఫోర్ సన్ సెట్ సినిమా లో తొమ్మిదేళ్ళ తర్వాత వారిద్దరి దారులు మళ్ళీ కలుస్తాయి. ఒక మధ్యాహ్నం వారిద్దరూ పారిస్ లో కలిసి గడపడం తో సినిమా వర్తమానం లోకి వస్తుంది.

ఈ సినిమా కమర్శియల్‌గా సక్సెస్‌ కావడంతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగానికి అకాడమీ అవార్డు నామినేషన్‌ కూడా ఈ సినిమా స్క్రీన్‌ప్లేకు దక్కింది.

కథా సారాంశం[మార్చు]

బిఫోర్‌ సన్‌రైజ్ ‌లో జెస్సీ (హాకే) మరియు సెలిన్‌ (డెల్పీ) వియాన్నాలో కలిసిన తర్వాత తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. సెలిన్‌ వల్ల స్ఫూర్తి పొందిన తర్వాత ఈ సమయం లో జెస్సీ ఓ నవల రాశాడు. ఇది అమెరికాలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటి. యూరోప్‌లో పుస్తకం అమ్మకాలను పెంచేందుకు జెస్సీ ఒక బుక్‌ టూర్‌ కూడా నిర్వహించాడు. ఈ పర్యటనలో చివరి గమ్యం పారిస్‌. షేక్‌స్పియర్‌ అండ్‌ కంపెనీ అనే బుక్‌స్టోర్‌లో జెస్సీ పుస్తకం చదువుతున్నాడు. అతడు ప్రేక్షకులతో మాట్లాడుతుండగా, వియన్నాలో అతడు, సెలిన్‌లు గడిపిన అంశాల ఫ్లాష్‌బ్యాక్‌ను చూపిస్తారు. కాలగమనంలో తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయినా ఆ రాత్రి వారిద్దరూ గడిపిన జ్ఞాపకాలు అతడికి తాజాగా గుర్తుకు వస్తుంటాయి. ఆ బుక్‌స్టోర్‌లో ముగ్గురు జర్నలిస్ట్‌లు జెస్సీని ఇంటర్వ్యూ చేస్తుంటారు. వారిలో ఒక రొమాంటిక్‌ వ్యక్తి... పుస్తకంలోని ప్రధాన పాత్రధారులు మళ్లీ కలవాలని కోరకుంటాడు. మరొక సినిక్‌ వారిద్దరూ కలవరని భావిస్తాడు. మూడో వ్యక్తి, వారు కలవాలని కోరుకున్నా కలవడం అసాధ్యమనే సందేహంలో ఉంటాడు. జెస్సీ ప్రేక్షకులతో మాట్లాడుతూ ఉండగానే అతడి కళ్లు కిటికీ వైపు చూస్తాయి. ఒక్కసారిగా అతడిలో ఆశ్చర్యం. అక్కడ సెలిన్‌ అతడిని చూస్తూ నవ్వుతూ నిలుచుని ఉంటుంది.

ప్రజంటేషన్‌ ముగిసిన తర్వాత, గంటలో విమానాశ్రయానికి వెళ్లి ప్లేన్‌ అందుకోవాలని, కాబట్టి వెంటనే బయల్దేరని బుక్‌స్టోర్‌ మేనేజర్‌ జెస్సీకి గుర్తు చేస్తాడు. బిఫోర్‌ సన్‌రైజ్ ‌లో మాదిరిగానే ఇక్కడ కూడా జెస్సీ, సెలిన్‌ల కలయికకు సమయం ప్రతిబంధకంగా మారింది. గత సినిమాలో మాదిరిగానే ఇక్కడ కూడా క్యారెక్లర్లన్నీ వారు కలిసి ఉండే కొద్ది సమయాన్ని చక్కగా వినియోగించుకునేందుకు సహకరిస్తాయి. దీనివల్ల వారి సంభాషణలు సులభంగా జరుగుతాయి. థర్టీ సమ్‌థింగ్స్‌ థీమ్స్‌ ఆఫ్‌ వర్క్‌తో మొదలుపెట్టి రాజకీయాలతో సహా ఎన్నో రకాల సంభాషణలు జరుగుతాయి. వారిద్దరూ కలిసి ఉండే సమయం త్వరగా అయిపోతున్నా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ, ప్యాషన్‌ పెరుగుతూనే ఉంటుంది.

సంభాషణ మొదట్లో, ముందు అనుకున్నట్లు ఆరు నెలల్లో ఎందుకు కలవలేకపోయారనే అంశం గురించి మాట్లాడుకుంటారు. వియన్నా నుంచి జెస్సీ అనుకున్నట్లే వస్తాడు. కానీ సెలిన్‌ రాలేదు. వీరి సమావేశం షెడ్యూల్‌ తేదీ నాటికి అనుకోకుండా సెలిన్‌ గ్రాండ్‌ మదర్‌ మరణిస్తుంది. వారిద్దరూ ఒకరికి ఒకరు ఎప్పుడూ అడ్రస్‌ ఇచ్చుకోలేదు. కాబట్టి వాళ్లిద్దరూ కలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో వారి మధ్య సంబంధాలు లేకుండా పోయాయి.

సంభాషణల్లో, వారి తొలి సమావేం తర్వాత ఇద్దరి జీవితాల్లో ఏం జరిగిందనే అంశం గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరూ 30ల ఆరంభంలో ఉన్నారు. ప్రస్తుతం రచయితగా మారిన జెస్సీ పెళ్ళి చేసుకున్నాడు. అతడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. సెలిన్‌ అడ్వకేట్‌గా మారింది. ప్రస్తుతానికి అమెరికాలో నివశిస్తోంది. ఒక బాయ్‌ఫ్రెండ్‌ కూడా ఉన్నాడు. అతడు ఒక ఫొటో జర్నలిస్ట్‌. ఇద్దరికీ ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇద్దరూ తమ జీవితాల్లోనే అనేక అనేక విషయాల పట్ల సంతృప్తిగా లేరు. కేవలం కొడుకు మీద ఉన్న ప్రేమ కారణంగానే తన భార్యతో కలిసి ఉంటున్నానని జెస్సీ చెబుతాడు. తన బాయ్‌ఫ్రెండ్‌ ఎక్కువగా అసైన్‌మెంట్ల మీద ఉంటాడు కాబట్టి అతడిని ఎప్పుడో ఒకసారి మాత్రమే చూడగలుగుతున్నానని సెలిన్‌ చెబుతుంది.

వారి సంభాషణ పారిస్‌లోని అనేక ప్రదేశాల్లో జరుగుతుంది. ఒక కేఫ్‌, తోట, ఒక బెటియు మౌచ్‌, పారిస్‌లో జెస్సీ అద్దెకు తీసుకున్న కారు ఇలా అనేక ప్రదేశాల్లో మాట్లాడుకుంటూ గడుపుతారు. క్రమంగా ఇద్దరిలోనూ తమ పాత భావాలు బయటకు వస్తాయి. గతంలో మిస్‌ అయిన సమావేశం గురించిన టెన్షన్‌ కూడా ఇద్దరిలోనూ ఉంటుంది. వియన్నాలో గడిపిన ఆ రాత్రి కంటే గొప్ప అంశాలు ఇద్దరి జీవితాల్లోనూ లేవని అనుకుంటారు. ఏదో ఒక రోజు సెలిన్‌ను లుస్తాననే నమ్మకంతోనే ఆ పుస్తకం రాశానని జెస్సీ ఒప్పుకుంటాడు. ఆ పుస్తకం తనకు కొన్ని బాధాకర జ్ఞాపకాలను తెచ్చిందని సెలిన్‌ చెబుతుంది. అద్దె కారులో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో జెస్సీ తనకు ఉన్న ప్రేమలేని, సెక్స్‌లేని జీవితం గురించి బాధపడుతూ టెన్స్‌ అవుతాడు. అతడిని ఓదార్చేందుకు సెలిన్‌ చెయ్య బయటకు తెస్తుంది. ఈలోగా జెస్సీ ఆమె వైపు చూడటంతో చెయ్యి వెనక్కు తీసుకుంటుంది.

ముగింపు సీన్‌లో, సెలిన్‌, జెస్సీ కలిసి ఆమె అపార్ట్‌మెంట్‌కు చేరతారు. సెలిన్‌ తన కోసం గిటార్‌తో వాల్ట్జ్‌లోని పాట పాడిందని జెస్సీ గ్రహిస్తాడు. వాల్ట్జ్‌ (డెల్పి రాశాడు)లోని లిరిక్స్‌ వీరి బ్రీఫ్‌ ఎన్‌కౌంటర్‌ గురించి ప్రస్తావిస్తూ సాగుతాయి.

తర్వాత జెస్సీ నినా సిమోన్‌ సీడీని స్టీరియో సిస్టమ్‌లో వినిపిస్తాడు. జెస్సీ ఆమెను చూస్తుండగా సెలిన్‌ 'జస్ట్‌ ఇన్‌ టైమ్‌' డ్యాన్స్‌ చేస్తుంది. సెలిన్‌ సిమోన్‌ను ఇమిటేట్‌ చేస్తు డాన్స్‌ చేస్తూ 'బేబీ నువ్వు ఫ్లయిట్‌ను మిస్‌ కాబోతున్నావు' అని జెస్సీని ఉద్దేశించి పాడుతుంది. కెమెరా నెమ్మదిగా అతడి వైపు తిరగుతుండగా తన పెళ్ళి ఉంగరాన్ని కదుపుతూ నెమ్మదిగా 'నాకు తెలుసు' అంటాడు. అతడు వెళ్లిపోయాడా? లేక అక్కడే ఉన్నాడా? అనే అంశాన్ని ప్రేక్షకుల ఊహకే వదిలేస్తారు. సినిమా ఆరంభంలో జెస్సీని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్‌ల మాదిరిగానే ఇక్కడ కూడా జరుగుతుంది.

తారాగణం[మార్చు]

 • జెస్సీగా ఎథాన్‌ హాక్‌
 • సెలిన్‌గా జూలీ డెల్పీ
 • బుక్‌స్టోర్‌ మేనేజర్‌గా వెర్నోన్‌ డొబ్‌చెఫ్‌
 • ఒకటో జర్నలిస్ట్‌గా లూసీ లెమోయిన్‌
 • రెండో జర్నలిస్ట్‌గా రొడాల్ఫ్‌ పాలీ
 • వెయిట్రెస్‌గా మరియెన్‌ ప్లాస్టిగ్‌
 • ఫిలిప్‌గా డయాబల
 • బోట్‌ అటెండెంట్‌గా డెనిస్‌ ఎవరర్డ్‌
 • మ్యాన్‌ ఎట్‌ గ్రిల్‌గా అల్బెర్ట్‌ డెల్పి
 • కంట్రీయార్డ్‌లోని ఉమన్‌గా మేరీ పిలెట్‌

నిర్మాణం[మార్చు]

ఈ సినిమాను 15 రోజుల్లో, సుమారు రెండు మిలియన్[2]‌ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను ఎందుకు నిర్మించారనే అంశంపై హాక్‌ వ్యాఖ్యానం చేశారు.

It's not like anybody was begging us to make a second film. We obviously did it because we wanted to.[3]

చిత్రీకరనకు వాడిన స్టడీక్యామ్స్‌కు ఈ చిత్రం పేరెన్నికగంది. ట్రాకింగ్‌ షాట్ల కోసం, సుదీర్ఘంగా వాడారు. స్టడీక్యామ్‌ షాట్‌లో ఒకటి సుదీర్ఘంగా 11 నిమిషాల[2] పాటు చిత్రీకరించారు. రియల్‌ టైమ్‌లో చిత్రీకరణ జరపడటం గుర్తించదగ్గ విషయం. కథలో గడిచిపోయిన సమయం కూడా సినిమా రన్‌టైమ్‌లో ఉంటుంది. బిఫోర్‌ సన్‌రైజ్‌ తర్వాత తొమ్మిది సంవత్సరాలకు సీక్వెల్‌ను విడుదల చేశారు. తొలి సినిమా వచ్చిన దగ్గర నుండి అంతే సమయం కాలగమనంలో కలిసిపోయింది.

ఈ సిరీస్‌లో భవిష్యత్‌ చిత్రాలను హాక్‌ సూచించారు.[4] ఈ సంబంధాన్ని[4] మరింత అభివృద్ధి చేస్తే బాగుంటుందని కూడా ఆయన సూచించారు. ఉమ తుర్మన్‌ నుంచి హాక్‌ విడాకులు తీసుకున్న సమయంలో ఈ సినిమా వచ్చింది. దీంతో కొందరు విమర్శలకులు, సినిమాకు ఆయన జీవితానికి ముడిపెట్టారు. జెస్సీ అనే క్యారెక్టర్‌[5] అతడి జీవితంలోనిదే అని పేర్కొన్నారు. హాక్‌ మరియు డెల్పి ఇద్దరూ తమ జీవితాల్లోని అంశాలను ఈ స్క్రీన్‌ప్లే[2][6] లోకి తెచ్చారనేది కూడా గుర్తుంచదగ్గ అదనపు కామెంట్‌. డెల్పి అనేక సంవత్సరాల పాటు న్యూయార్క్‌ సిటీలో జీవించారు. సినిమాలోని రెండు పాటలను ఆమె రాసింది. మూడోది క్లోజింగ్‌ క్రెడిట్స్‌లో, సినిమా సౌండ్‌ ట్రాక్‌లో వాడారు.

విడుదల[మార్చు]

ఫిబ్రవరి 2004న బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బిఫోర్‌ సన్‌సెట్ ‌ ప్రీమియర్‌ షోను ప్రదర్శించారు. అమెరికాలో జూలై 2, 2004న లిమిటెడ్‌గా విడుదల చేశారు.

బాక్స్ ఆఫీస్[మార్చు]

విడుదలైన తొలి వీకెండ్‌లో ఈ సినిమా అమెరికాలోని 20 థియేటర్లలో 2,19,425 డాలర్లను వసూలు చేసింది. సగటున ఒక్కో థియేటర్‌కు ఇది 10,971 డాలర్లు. మొత్తం థియేటర్లలో ప్రదర్శించిన కాలం అంతటికీ కలిపి అమెరికాలోనే 5.8 మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన మొత్తం 16 మిలియన్‌ డాలర్లు[1].

విమర్శకుల స్వీకృతి[మార్చు]

విమర్శకుల నుంచి చాలా ఎక్కువగా బిఫోర్‌ సన్‌సెట్‌కు విమర్శలు వచ్చాయి. రొటెన్‌ టమాటోస్‌లో ఉన్న 155 రివ్యూలను[7] బేస్‌ చేసుకుని చూస్తే 95 శాతం సానుకూల రేటింగ్‌ ఉంది. మెటాక్రిటిక్‌ బేస్డ్‌లో ప్రముఖ పబ్లికేషన్‌[8] లకు చెందిన 39 రివ్యూలను తీసుకుంటే వందకు 90 స్కోరు వచ్చింది. 2004 లో విమర్శకుల టాప్ 10 అత్యుత్తమ సినిమాల జాబితాలో దీనికి చోటు దక్కింది.[9] 2008లో నిర్వహించిన అంపైర్‌ పోల్‌[10]లో ప్రపంచంలోని అత్యుత్తమ చిత్రాల్లో 110వ స్థానం లభించింది.

ఈ సినిమాను ఒరిజినల్‌ సినిమాతో పోలుస్తూ సినీ విమర్శకు రోజర్‌ 'బిఫోర్‌ సన్‌రైజ్‌ మంచి డైలాగ్‌లకు పెట్టింది పేరు. కానీ ‌బిఫోర్‌ సన్‌సెట్ క్యారెక్టర్ల వయసు, తెలివితేటల్లో బాగుంది. హాక్‌, డెల్పి సొంతంగా డైలాగ్‌లు రాసుకోవడం[11] కూడా ఇది బాగుండటానికి ఓ కారణం' అని రాశారు. లాస్‌ ఏంజిలిస్‌ టైమ్స్ ‌లో మనోహ్లా డార్గిస్‌ 'లోతుగా, నిజంగా చేసిన పని. తొలుత కంటే కళ ఎక్కువ' అని రాశారు. డైరెక్టర్‌ లింక్‌లేటర్‌కు కూడా ప్రశంసలు ఇచ్చారు. అమెరికా సినిమా అద్భుతంగా ఉంటుందనే[12] నమ్మకాన్ని ఆయన నిలబెట్టారు' అని ప్రశంసించారు.

నటన గురించి రివ్యూలలో రోలింగ్‌ స్టోన్‌ యొక్క పీటర్‌ ట్రేవర్స్‌ 'హాక్‌ మరియు డెల్పి మాటల్లో నాన్స్‌, ఎరోటిసిమ్‌ చూపించారు. మాటలు లేనప్పుడూ అవి చూపించారు. నటులు వెలిగియారు[13]' అని రాశారు. ది అబ్జర్వర్ ‌లో ఫిలిఫ్‌ ఫ్రెంచ్‌ 'హాక్‌ మరియు డెల్పి ఇద్దరి ప్రదర్శనా అద్భుతంగా ఉంది. నిజమైన లోతులకు వెళ్లి నటించారు. ఈసారి కూడా రిచర్డ్‌ లింక్‌లేటర్‌ యొక్క కల్పిత గాథల్లో వారు జీవించారు.[14] ఈసారి వారు రైటింగ్‌ క్రెడిట్‌ను కూడా అతడితో కలిసి పంచుకున్నారు. గత శతాబ్దంలోని వారి క్యారెక్టర్ల అనుభవాలను ఇందులో ప్రదర్శించారు'[14] అని రాశారు.

స్క్రిప్ట్‌లోని గొప్పతనం గురించి, న్యూయార్క్‌ టైమ్స్‌లో ఎ.ఒ.స్కాట్‌ ఇలా రాశారు. కొన్నిసార్లు పిచ్చెక్కించారు. కానీ స్క్రీన్‌రైటింగ్‌లో ఉండే సహజత్వాన్ని ఎక్కడా కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు. అంతేకాదు వాళ్లేమనుకుంటున్నారో స్పష్టంగా చూపించారు. మీరేమయినా చేయగలరా? ఇది పాయింట్లకు, అర్థాలకు సంబంధించనది కాదు. భాష. ఇది కమ్యూనికేషన్స్‌ను చూపించే ఒక మీడియం. అంతే కాదు ఎవాయిడెన్స్‌, మిస్‌డైరెక్షన్‌, సెల్ప్‌ ప్రొటెక్షన్‌, ప్లెయిన్‌ కన్ఫ్యూజన్‌ అన్నీ ఈ సినిమాలో థీమ్స్‌. డీప్‌ ట్రూత్‌లోని సెల్‌డమ్‌ను బుక్స్‌తో పాటు స్క్రీన్‌ మీద కూడా సొంతం చేసుకున్నారు.[15]

పురస్కారాలు మరియు ప్రతిపాదనలు[మార్చు]

అవార్డులు
 • 2004 లో బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు - అత్యుత్తమ సినిమా (రెండో స్థానం)
ప్రతిపాదనలు
 • 2004 - 77 వ అకాడెమి అవార్డ్స్ - అత్యుత్తమ రైటింగ్ (అడాప్తేడ్ స్క్రీన్ ప్లే). రిచర్డ్ లింక్లాటర్, ఏతాన్ హవ్కే, జూలీ దెల్పి, కిం క్రిజాన్ లకు.
 • 2004 ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డు - అత్యుత్తమ స్క్రీన్ ప్లే. రిచర్డ్ లింక్లాటర్, ఏతాన్ హవ్కే, జూలీ దెల్పిలకు.
 • 2005 రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డు - బెస్ట్ అడాప్తేడ్ స్క్రీన్ ప్లే. రిచర్డ్ లింక్లాటర్, ఏతాన్ హవ్కే, జూలీ దెల్పి, కిం క్రిజాన్లకు.
 • 2004 బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - గోల్డెన్ బేర్
 • 2004 గోతం అవార్డ్స్ - బెస్ట్ ఫిలిం.

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 "Before Sunset (2004)". Box Office Mojo. Retrieved 2009-12-28.
 2. 2.0 2.1 2.2 Lee Marshall (2004-07-19). "Love that goes with the flow". London: Telegraph. Retrieved 2007-08-11.
 3. Geoffrey Macnab (2005-10-08). "Forget me not". London: The Guardian. Retrieved 2007-08-10.
 4. 4.0 4.1 James Wood (2005-06-11). "The last word". London: The Guardian. Retrieved 2007-08-10.
 5. Dan Halpern (2005-10-08). "Another sunrise". London: The Guardian. Retrieved 2009-12-28.
 6. S.F. Said (2004-07-09). "Keeping the dream alive". London: Telegraph. Retrieved 2007-08-11.
 7. "Before Sunset Movie Reviews, Pictures - Rotten Tomatoes". Rotten Tomatoes. Retrieved 2010-03-23.
 8. "Before Sunset reviews at Metacritic.com". Metacritic. Retrieved 2009-11-19.
 9. "Metacritic: 2004 Film Critic Top Ten Lists". Metacritic. Retrieved 2009-11-19.
 10. "Empire Features - 500 Greatest Movies of All Time". Empire. Retrieved 2010-01-25.
 11. "Before Sunset :: rogerebert.com :: Reviews". Chicago Sun-Times. Retrieved 2009-12-28.
 12. "'Before Sunset' - Movie Review". Los Angeles Times. Retrieved 2009-12-28.
 13. "Before Sunset : Review : Rolling Stone". Rolling Stone. Retrieved 2009-12-28.
 14. 14.0 14.1 French, Philip (2004-07-25). "Brief re-encounter". London: The Observer. Retrieved 2009-12-28.
 15. Scott, A. O. (2004-07-02). "FILM REVIEW: Reunited, Still Talking, Still Uneasy". The New York Times. Retrieved 2009-12-28.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Richard Linklater