బిబిసి వారి 100 మంది మహిళలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
100 Women
BBC 100 Women and Wikipedia freebies.jpg
స్థితిActive
ఫ్రీక్వెన్సీAnnually
క్రియాశీల సంవత్సరాలు4
ప్రారంభించినది2013 అక్టోబరు 22 (2013-10-22)
ఇటీవలి2016 నవంబరు 22 (2016-11-22)
వెబ్‌సైటు
100 Women

100 మహిళలు  అనేది బిబిసి విడుదల చేసే జాబితా. 2013లో మొదలైన ఈ సిరీస్ లో ప్రతీ సంవత్సరం అంతర్జాతీయంగా 100 మంది మహిళలను ఎంపిక చేసి, జాబితాగా వేస్తారు. ఈ సిరీస్ ద్వారా 21వ శతాబ్దంలో మహిళల పాత్ర తెలుస్తుంది. ప్రతీ ఏటా లండన్[1]మెక్సికో[2][3] నగరాల్లో బిబిసి ఈ విషయమై కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. బిబిసి జాబితాను ప్రచురించిన తరువాత మూడు వారాల సమయంలో మహిళల గురించి వార్తా కథనాలు, అంతర్జాల నివేదికలు, చర్చలు నిర్వహిస్తుంది.[4] ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఈ లిస్టు గురించి ట్విట్టర్ లో వ్యాఖ్యానిస్తారు. అలాగే  చర్చలు,  ఇంటర్వ్యూలు  చేసి  లిస్టుపై  అభిప్రాయాలు  వెల్లడిస్తారు.  అలా  ఖరారు  చేసిన  జాబితాను  బిబిసి  ప్రచురిస్తారు. 2013లో  మొదలైన  ఈ  జాబితా  ప్రచురణ, 2016లో కూడా కొనసాగింది.[5]

చరిత్ర[మార్చు]

2012 ఢిల్లీ సామూహిక అత్యాచార ఉదంతం జరిగిన తరువాత బిబిసి కంట్రోలర్ లిలియేన్ లాండర్[6], బిబిసి ఎడిటర్ ఫియోనా క్రాక్[7], ఇతర  పాత్రికేయులు కలసి ప్రస్తుత సమాజంలో మహిళల విజయాలు,  సమస్యల గురించి ఒక సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నారు.[8] మహిళల గురించి మీడియాలో ఎక్కువగా కవరేజ్ కావడంలేదని వారు నిర్ధారించుకున్నారు. మార్చి 2013లో మహిళల గురించి, మహిళ నుంచి ఎక్కువ కథనాలు ప్రచురించాలని పెద్ద సంఖ్యలో మహిళా ప్రేక్షకులు బిబిసిని కోరారు.[9]

భారతీయ మహిళలు[మార్చు]

చిత్రం పేరు వృత్తి సంవత్సరం
బిల్కిస్ దాదీ పౌరసత్వ సవరణబిల్లు (2019)కి వ్యతిరేకంగా పోరాడిన వృద్ధురాలు 2020
ఈశాయివాణి గాయకురాలు 2020
ప్రవీణా అహంగర్ మానవహక్కుల కార్యకర్త 2019
అరణ్య జోహార్ కవయిత్రి 2019
Dr. Susmita Mohanty.jpg సుస్మితా మొహంతీ అంతరిక్ష నౌక డిజైనర్ 2019
శుభలక్ష్మి నంది లైంగిక సమానత్వ ప్రచారకర్త 2019
నటాషా నోయల్ బాడీ పాజిటివిటీ ఇన్‌ఫ్ల్యూయన్సర్ 2019
Dr. Vandana Shiva DS.jpg వందన శివ సామాజిక కార్యకర్త 2019
ప్రగతి సింగ్ అలైంగిక వ్యక్తుల సంస్థ ఇండియన్ ఏసెస్ నిర్వాహకురాలు 2019
Rahibai Soma Popere H2019030865839 (cropped).jpg రాహిబాయ్ సోమా పొపెరె దేశవాళీ విత్తనబ్యాంకు స్థాపకురాలు, మహిళా రైతు 2018
విజి పలితోడి కేరళలో మహిళా కార్మిక సంఘం వ్యవస్థాపకురాలు 2018
మీనా గాయెన్ వ్యాపారవేత్త 2018
Mithali Raj Truro 2012.jpg మిథాలి రాజ్ క్రికెటర్ 2017
Rupi Kaur, 2017 (cropped).jpg రూపి కౌర్ రచయిత్రి 2017
Virali Modi portrait (cropped).jpg విరాలి మోది వికలాంగుల హక్కుల కార్యకర్త, యువ అంబాసిడర్ 2017
అదితి అవస్థి పారిశ్రామికవేత్త, సి.ఇ.వో ఎమ్‌బైబ్ 2017
మెహరున్నీసా సిద్ధిఖి గృహిణి 2017
సవితా దేవి డోలు కళాకారిణి 2017
నిత్యా తుమ్మలచెట్టి డైరెక్టర్ ఆఫ్ డైవర్సిటీ, ఫార్చునా పిక్స్ 2017
ప్రియాంకా రాయ్ విద్యార్థిని 2017
తులికా కిరణ్ ఉపాధ్యాయిని, సామాజిక కార్యకర్త 2017
ఊర్వశి సాహ్ని వ్యవస్థాపకురాలు, సి.ఇ.వో స్టడీ హాల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 2017
Ira Trivedi at IITD (cropped).jpg ఇరా త్రివేది రచయిత్రి 2017
గౌరీ చిందర్కర్ భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థి 2016
Mallika Srinivasan - Chairman and CEO TAFE.jpg మల్లికా శ్రీనివాసన్ భారతీయ ట్రాక్టర్ తయారీదారులు 2016
నేహాసింగ్ భారతీయ సామాజిక కార్యకర్త 2016
Saalumarada Thimmakkaj.jpg సాలుమరద తిమ్మక్క భారతీయ పర్యావరణ వేత్త 2016
Ashaji.jpg ఆశా భోస్లే[10] భారతీయ గాయకురాలు 2015
Kamini Kaushal.jpg కామినీ కౌశల్[10] భారతీయ బాలీవుడ్ నటి 2015
రింపి కుమారి[10] భారతీయ రైతు 2015
Sania Mirza (28418631362).jpg సానియా మీర్జా[11] భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి 2015
స్మృతి నాగ్‌పాల్[10] భారతీయ వ్యాపారవేత్త 2015
ముంతాజ్ షేక్[10] భారతీయ మానవ హక్కుల కార్యకర్త 2015
కానికా తేక్రీవాల్[10] భారతీయ వ్యాపారవేత్త 2015
రుబీ చక్రవర్తి భారతీయ మహిళా హక్కుల ప్రచారకురాలు 2014
అదితి మిట్టల్ భారతీయ హ్యాస్యనటి 2014
దివ్యాశర్మ భారతీయ విజ్ఞానశాస్త్ర విద్యార్థిని 2014
Kavita Krishnan 02.jpg కవితా కృష్ణన్ సెక్రటరీ,

ఆల్ ఇండియా ప్రొగ్రెస్సివ్ వుమెన్ అసోసియేషన్

2014
ఇరియానా చక్రవర్తి రష్యన్-ఫినిష్-భారతీయ ఇంజనీర్ 2013
అదితి మిట్టల్ భారతీయ హాస్యనటి 2013
దివ్యాశర్మ ఎలక్ట్రానిక్స్,కమ్యూనికేషన్స్ ఇంజనీరు 2013

మూలాలు[మార్చు]

 1. "100 Women: Who is taking part?". BBC News. 22 October 2013.
 2. Low, Harry (25 November 2016). "100 Women 2016: Mexico festival draws thousands". BBC News.
 3. "Participa Inmujeres CDMX en el festival 100 Women de la BBC". CDMX (in Spanish). 24 November 2016. Archived from the original on 20 December 2016. Retrieved 6 December 2016.CS1 maint: unrecognized language (link)
 4. "Saalumarada Thimmakka in BBC's 100 Women list". The Times of India. 23 November 2016.
 5. Stoughton, India (28 October 2014). "Lebanon makes its mark on BBC's 100 Women list". Beirut, Lebanon: The Daily Star. Retrieved 6 December 2016. Italic or bold markup not allowed in: |publisher= (help)
 6. Martinson, Jane (16 June 2016). "BBC World Service Language Boss and Diversity Champion Quits". The Guardian.
 7. WITW Staff (18 November 2015). "BBC's 100 Women program celebrates female accomplishments across the globe". The New York Times. Archived from the original on 22 నవంబర్ 2015. Retrieved 3 మార్చి 2017. Check date values in: |archive-date= (help)
 8. Crack, Fiona (31 October 2013). "100 BBC 100 Women: a series borne out of suffering and violence". The Guardian.
 9. Fisher, Amanda (26 October 2013). "BBC assembles 100 women to get them talking on issues". Khaleej Times.
 10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 "Seven Indians feature in BBC 100 Women 2015 list". The Times of India. 19 November 2015.
 11. Australian mental health champion among BBC’s 100 inspirational woman, 27 November 2015, BeyondBlue, Retrieved 6 December 2016

ఇతర లింకులు[మార్చు]