బిమ్లా బూటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిమ్లా బూటి
జననం1933
పౌరసత్వంఇండియా
జాతీయతఇండియన్
రంగములుPhysics; Plasma Physics
వృత్తిసంస్థలుINSA
చదువుకున్న సంస్థలుUniversity of Delhi
University of Chicago
పరిశోధనా సలహాదారుడు(లు)Subrahmanyan Chandrasekhar
ప్రసిద్ధిPhysicist

బిమ్లా బూటి (జననం 1933) ఒక భారతీయ భౌతిక శాస్త్రవేత్త, (ప్లాస్మా భౌతిక శాస్త్రము) లో ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఆమె ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ)  మొదటి భారతీయ మహిళా భౌతిక శాస్త్రవేత్త ఫెలో.

జీవితం[మార్చు]

బూటి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్.సి (ఆనర్స్), భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టాను పొందింది.  ఉన్నత విద్య కొరకు  చికాగో విశ్వవిద్యాలయం లోపి.హెచ్.డి (  డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా) సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో  1962 సంవత్సరంలో  ప్లాస్మా భౌతిక శాస్త్రంలో పి.హెచ్.డి పట్టాను పొందింది.[1]

వృత్తి[మార్చు]

బూటి చికాగో విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన తరువాత భారతదేశానికి వచ్చి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బోధనావృత్తి చేపట్టింది. రెండు సంవత్సరాల తరువాత తిరిగి  ఆమె గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ లో పనిచేయడానికి తిరిగి అమెరికాకు  వెళ్ళింది. 1968లో బుటి భారతదేశానికి తిరిగి వచ్చి ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో  పనిచేస్తుండగా, అప్పటి ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ (పిఆర్ఎల్) డైరెక్టర్ విక్రమ్ సారాభాయ్, పిఆర్ఎల్ లో చేరమని బూటిని ఆహ్వానించారు, అక్కడ 1970 నుండి 1993 వరకు అసోసియేట్ ప్రొఫెసర్ గా, ప్రొఫెసర్ గా, సీనియర్ ప్రొఫెసర్ గా, డీన్ ఆఫ్ ఫ్యాకల్టీగా పనిచేయడం జరిగింది  పి.ఆర్.ఎల్ లో, బూటి ప్రయోగాత్మక ప్లాస్మా భౌతిక శాస్త్ర కార్యక్రమం కోసం ఒక కొత్త విభాగాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కొద్దికాలానికి ఈ గ్రూపును ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ అని పిలువబడే ప్రత్యేక సంస్థగా మార్చారు. 1985-2003 మధ్య, బూటి ఇటలీలోని ట్రిస్టేలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ లో ప్లాస్మా ఫిజిక్స్ డైరెక్టర్ గా ఉన్నారు.[2]

గుర్తింపు-అవార్డులు[మార్చు]

బిమ్లా బూటి అందించిన సేవలకు గాను ఆమెకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో గౌరవ ప్రథమైన అవార్డులు, గుర్తింపు పొందినది.[3]

 • విక్రమ్ సారాభాయ్ అవార్డ్ ఫర్ ప్లానెటరీ సైన్సెస్ (1977)
 • జవహర్ లాల్ నెహ్రూ సెనటరీ లెక్చర్ షిప్ అవార్డ్, 1993
 • ఐఎన్ఎస్ఎ-వైను బప్పు ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ అవార్డ్, 1994
 • ప్రొఫెషనల్ అచీవ్ మెంట్ సైటేషన్ అవార్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ చికాగో, అమెరికా (1996)
 • యుఎస్ మెడల్ ఫర్ ఫండమెంటల్ కంట్రిబ్యూషన్స్ ఇన్ ది ఫిజిక్స్ నాన్ లినియర్ వేవ్స్ అండ్ కేయోస్ (2010)
 • ఫెలో ఆఫ్ టి డబ్ల్యూ ఏ ఎస్ (TWAS)
 • ఫెలో ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఇండియా)
 • ఫెలో ఆఫ్ అమెరికన్ ఫిజికల్ సొసైటీ
 • ఫెలో ఆఫ్ ది ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ

ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ, ఇండియన్ ఫిజిక్స్ అసోసియేషన్ ఫర్ యంగ్ సైంటిస్ట్స్ సొసైటీ కొరకు ఇండియన్ ప్లాస్మా సైన్స్ అవార్డ్స్ ద్వారా బూటి అనేక అవార్డులను ప్రారంభించడం జరిగింది. బూటి 1991-93 వరకు ఐఎన్ఎస్ఎ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశాడు. పీఆర్ఎల్ నుంచి అధికారికంగా పదవీ విరమణ చేసిన తర్వాత కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (నాసా) లో నాలుగేళ్లు ఉండి, ప్రస్తుతం న్యూఢిల్లీలో నివసిస్తోంది, అక్కడ ఆమె తన పరిశోధనను కొనసాగిస్తుంది, అలాగే 2003 బూటి ఫౌండేషన్ ద్వారా ఆమె సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తుంది.[2]

మూలాలు[మార్చు]

 1. "Bimla Buti | Biography , Quotes , Books , WordCloud , Life History Timeline |Minds of Science". www.mindsofscience.com. Retrieved 2022-04-16.[permanent dead link]
 2. 2.0 2.1 Chawla, Saesha (2020-06-30). "Bimla Buti". Medium (in ఇంగ్లీష్). Retrieved 2022-04-16.
 3. "Dr. Bimla Buti: A Woman Scientist In A Field Dominated By Men". Women's Web: For Women Who Do (in ఇంగ్లీష్). 2018-05-29. Retrieved 2022-04-16.