బిరియాని (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిరియాని
(2013 తమిళ సినిమా)
Biriyani poster.jpg
దర్శకత్వం వెంకట్ ప్రభు
నిర్మాణం కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా
కథ వెంకట్ ప్రభు
తారాగణం కార్తిక్ శివకుమార్
హన్సికా మోట్వాని
ప్రేమ్ జీ అమరెన్
సంగీతం యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం శక్తి శరవణన్
కూర్పు ప్రవీణ్ కె.ఎల్.
ఎన్.బీ. శ్రీకాంత్
నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్
పంపిణీ స్టూడియో గ్రీన్
భాష [[తమిళ]]

{{ }}

స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన బ్లాక్ కామెడీ సినిమా బిరియాని. కార్తిక్ శివకుమార్, హన్సికా మోట్వాని, మాండీ థాకర్, ప్రేమ్ జీ అమరెన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆయనకి సంగీతదర్శకుడిగా 100వ సినిమా కావడం విశేషం. శక్తి శరవణన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేయగా ప్రవీణ్-శ్రీకాంత్ కూర్పును అందించారు. చెన్నై, హైదరాబాద్, అంబూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా 2013 డిసెంబరు 20న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలయ్యింది.

కథ[మార్చు]

సుధీర్‌ (కార్తీ), పరశు (ప్రేమ్‌జీ) చాలా మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి రాజమండ్రిలో తమ కార్యాలయ కొత్త శాఖ తెరుస్తుంటే వెళతారు. తిరిగి వస్తుండగా ఓ ‘మాయ’లాడి (మాండీ తక్కర్‌) వలలో పడి ఆమెతో పాటు హోటల్‌కి వెళతారు. తప్పతాగి తెల్లారి లేచి చూసేసరికి తాము ఒక కిడ్నాప్‌ కేసులో ఇరుక్కుంటారు. వరదరాజులు (నాజర్‌) అనే వ్యాపారవేత్తని వీరిద్దరూ కిడ్నాప్‌ చేసినట్టు పోలీసులు ఆరోపిస్తారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయిన ఇద్దరికీ తమ కారు డిక్కీలో వరదరాజులు శవం కనిపిస్తుంది. ఈ హత్య కేసు తమ మెడకే చుట్టుకుంటుందని అర్థం చేసుకున్న తర్వాత దానినుంచి బయటపడేందుకు పథకం రచిస్తారు. అసలు వరదరాజులుని ఎవరు చంపుతారు. వీరిపై నింద ఎందుకు నెడతారు? అన్నది మిగిలిన కథ.[1]

సంగీతం[మార్చు]

పాట గానం రచన
బిరియాని తన్వీ షా, భవతారిణి, హర్షిణి రాకేందు మౌళి
బే ఆఫ్ బెంగాల్ క్రిష్ వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
పామ్ పామ్ పామ్ రాహుల్ నంబియార్, రమ్య ఎన్.ఎస్.కె. వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
మిసిసిపీ కార్తిక్ శివకుమార్, ప్రేమ్ జీ అమరెన్, ప్రియా హిమేష్ వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
బిరియాని ర్యాప్ రాకేందు మౌళి, ప్రియా హిమేష్, వందేమాతరం శ్రీనివాస్ రాకేందు మౌళి
అడుగులే ఆ నింగి సత్యన్, సెంధిల్ దాస్, రాకేందు మౌళి, సాకేత్ నాయుడు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
బే ఆఫ్ బెంగాల్ (రీమిక్స్ 1) క్రిష్, ప్రేమ్ జీ అమరెన్ వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
బే ఆఫ్ బెంగాల్ (రీమిక్స్ 2) ప్రేమ్ జీ అమరెన్ వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
  1. Telugu Great Andhra. "సినిమా రివ్యూ: బిరియాని" (in ఇంగ్లీష్). Archived from the original on 3 నవంబర్ 2021. Retrieved 3 November 2021. Check date values in: |archivedate= (help)