బిర్జూ మహరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిర్జూ మహరాజ్‌
వ్యక్తిగత సమాచారం
జననం (1938-02-04) 1938 ఫిబ్రవరి 4 (వయసు 86)
వారణాసి, ఉత్తర ప్రదేశ్
మూలంభారతదేశం
సంగీత శైలిహిందుస్తానీ సంగీతము
వృత్తిశాస్త్రీయ నృత్యకారుడు
వెబ్‌సైటుhttp://www.birjumaharaj-kalashram.com/main.asp

బిర్జూ మహరాజ్‌గా పిలువబడే బిర్జూ మోహన్‌నాథ్ మిశ్రా (ఫిబ్రవరి 4, 1938), భారతీయ కథక్ నాట్య కళాకారుడు. ఇతడు లక్నో కాల్కా-బిందాదిన్ ఘరానాకు చెందినవాడు. బిర్జూ కథక్ కళాకారుల కుటుంబంలో పుట్టాడు. ఈయన తండ్రి అచ్చన్ మహరాజ్, మేనమామలు శంభూ మహరాజ్, లచ్చూ మహరాజ్ లు పేరొందిన కథక్ కళాకారులు. చిన్నతనం నుండి నాట్యంపైనే మక్కువ ఉన్నా, బిర్జూ హిందుస్తానీ గాత్రంలో కూడా ఆరితేరినవాడు. కథక్ నాట్యానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చాడు. ఇతడు దేశవిదేశాల్లో వేలాది నాట్య ప్రదర్శనలనిచ్చి, ఎందరో విద్యార్థులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్దాడు.

బాల్యం[మార్చు]

తండ్రి అచ్చన్ మహరాజ్ రాయఘర్ ఆస్థాన నర్తకుడు. తండ్రి వద్దనే కాక, మేనమామలు, లచ్చూ మహరాజ్, శంభూ మహరాజ్‌ల వద్ద తొలి నాట్య పాఠాలను నేర్చుకొన్నాడు. తన ఏడవ యేట, తొలి నాట్య ప్రదర్శన నిచ్చాడు.

నాట్య ప్రస్థానం[మార్చు]

బిర్జూ మహరాజ్ తన పదమూడవ ఏటి నుండే, న్యూఢిల్లీ లోని సంగీత భారతిలో నాట్యాచార్యుడిగా పనిచేయడం ప్రారంభించాడు. తరువాత భారతీయ కళాకేంద్ర, సంగీత నాటక అకాడమీ లో ప్రధాన నాట్యాచార్యుడిగా ఉండి, 1998 లో పదవీ విరమణ చేశాడు. బిర్జూ మహరాజ్ సత్యజిత్ రే సినిమా షత్రంజ్ కే ఖిలాడీ లో సంగీతం సమకూర్చి, పాడాడు. దేవ్‌దాస్ (2002) సినిమాలో, కాహె ఛేడ్ మొహె అనే పాటకు నాట్యం చేశాడు.

అవార్డులు, గౌరవ పురస్కారాలు[మార్చు]

 1. పద్మవిభూషణ్ - 1996
 2. సంగీత నాటక అకాడమీ అవార్డు
 3. కాళిదాస్ సమ్మాన్
 4. డాక్టరేట్ డిగ్రీ - బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి.
 5. లతా మంగేష్కర్ పురస్కార్ - 2002

సినిమాలు[మార్చు]

 1. దేవ్‌దాస్ (2002)
 2. గదర్ 2001
 3. దిల్ తో పాగల్ హై
 4. షత్రంజ్ కే ఖిలాడీ

మరణం[మార్చు]

బిర్జు మహారాజ్ 2021 జనవరి 17 తెల్లవారుజామున 83 సంవత్సరాల వయస్సులో తన స్వగృహంలో మరణించాడు.

రాత్రి భోజనం చేసిన తర్వాత ‘అంతాక్షరి’ ఆడుతుండగా, ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. జనవరి 17 తెల్లవారుజామున మరణించాడు.[1]

వనరులు[మార్చు]

 1. అచ్చన్ మహరాజ్
 2. బిర్జూ మహరాజ్ - కథక్
 3. బిర్జూ మహరాజ్ Archived 2007-04-01 at the Wayback Machine

మూలాలు[మార్చు]

 1. "Pandit Birju Maharaj, Legendary Kathak Dancer, Dies At 84". NDTV.com. Retrieved 4 February 2023.

బయటి లింకులు[మార్చు]