Jump to content

బిర్ సింగ్ మహతో

వికీపీడియా నుండి
బిర్ సింగ్ మహతో

పదవీ కాలం
1996 – 2006
ముందు చిత్తరంజన్ మహాత
తరువాత నరహరి మహతో
నియోజకవర్గం పురూలియా

వ్యక్తిగత వివరాలు

జననం (1945-09-14)1945 సెప్టెంబరు 14
పురూలియా , పశ్చిమ బెంగాల్
మరణం 2021 ఏప్రిల్ 17(2021-04-17) (వయసు: 75)
పురూలియా, పశ్చిమ బెంగాల్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
జీవిత భాగస్వామి పుష్ప మహతో
సంతానం 3 కుమారులు
నివాసం పురూలియా, పశ్చిమ బెంగాల్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

బిర్ సింగ్ మహతో (14 సెప్టెంబర్ 1945 - 17 ఏప్రిల్ 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పురూలియా లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

బిర్ సింగ్ మహతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1996, 1998, 1999, 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పురూలియా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐఎఫ్‌బి అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

బిర్ సింగ్ మహతో శ్వాసకోశ సమస్యలతో పురులియా జిల్లా వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ 76 సంవత్సరాల వయసులో 2021 ఏప్రిల్ 17న మరణించాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "A prestige battle for Trinamool Congress' heir apparent". The Economic Times. 9 May 2019. Archived from the original on 23 July 2025. Retrieved 23 July 2025.
  2. "Bengal Left Front, Amid Talks With Congress, Announces List For 25 Seats" (in ఇంగ్లీష్). NDTV. 15 March 2019. Retrieved 23 July 2025.
  3. "ফরওয়ার্ড ব্লক নেতা ও প্রাক্তন সাংসদ বীরসিংহ মাহাতো প্রয়াত". Ananda Bazar. 2021. Archived from the original on 23 July 2025. Retrieved 23 July 2025.