Jump to content

బిలావల్ భుట్టో జర్దారీ

వికీపీడియా నుండి
బిలావల్ భుట్టో జర్దారీ
బిలావల్ భుట్టో జర్దారీ

2022లో బిలవాల్


పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2007 డిసెంబర్ 30
డిప్యూటీ ఆసిఫ్ అలీ జర్దారీ (సహ-అధ్యక్షుడు)
ముందు బెనజీర్ భుట్టో

37వ విదేశాంగ మంత్రి
పదవీ కాలం
2022 ఏప్రిల్ 27 – 2023 ఆగస్టు 10
అధ్యక్షుడు అరిఫ్ అల్వి
డిప్యూటీ హినా రబ్బానీ ఖర్ (విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి)
ముందు షా మహమూద్ ఖురేషి
తరువాత జలీల్ అబ్బాస్ జిలానీ

జాతీయ అసెంబ్లీ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 ఫిబ్రవరి 29
నియోజకవర్గం ఎన్ఏ-194 లార్కానా-I
మెజారిటీ 135,112 ఓట్లు
పదవీ కాలం
2018 ఆగస్టు 13 – 2023 ఆగస్టు 10
నియోజకవర్గం ఎన్ఏ-200 లర్కానా
మెజారిటీ 34,226 (22.46%)

వ్యక్తిగత వివరాలు

జననం (1988-09-21) 1988 సెప్టెంబరు 21 (వయసు: 37)
కరాచీ, సింధ్, పాకిస్తాన్
రాజకీయ పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ
తల్లిదండ్రులు ఆసిఫ్ అలీ జర్దారీ, బెనజీర్ భుట్టో
పూర్వ విద్యార్థి క్రిస్ట్ చర్చ్, ఆక్స్‌ఫర్డ్
వృత్తి రాజకీయ నాయకుడు
పురస్కారాలు నిషాన్-ఎ-ఇంతియాజ్

బిలవల్ భుట్టో జర్దారీ ( జననం 21 సెప్టెంబర్ 1988 ) పాకిసైతం దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 నుండి 2023 వరకు 37వ విదేశాంగ మంత్రిగా పని చేశారు. ఆయన తన తల్లి బెనజీర్ భుట్టో హత్య తర్వాత 2007లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి ఛైర్మన్ అయ్యాడు.

సింధ్‌లోని కరాచీలో జన్మించిన బిలావల్ భుట్టో కుటుంబానికి చెందినవాడు, తండ్రి వైపు నుండి జర్దారీ కుటుంబానికి చెందినవారు. ఆయన మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు, మాజీ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మనవడు.

భుట్టో జర్దారీ 2018 నుండి 2023 వరకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నాడు. 2024లో కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం ఎన్ఏ-194 లర్కానా-1 నుండి 2024లో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యాడు, 2024లో ప్రమాణ స్వీకారం చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బిలావల్ భుట్టో జర్దారీ 21 సెప్టెంబర్ 1988న సింధ్‌లోని కరాచీ లేడీ డఫరిన్ ఆసుపత్రిలో రెండు సందర్భాలలో పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా పనిచేసిన బెనజీర్ భుట్టో, ఆమె భర్త పాకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు అయిన ఆసిఫ్ అలీ జర్దారీ దంపతులకు జన్మించాడు.[1] ఆయన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో, అతని భార్య నుస్రత్ భుట్టోల మనుమడు.[2] ఆయన తాత, హకీమ్ అలీ జర్దారీ, ఒక రాజకీయవేత్త, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు. తన తల్లి వైపు నుండి రాజకీయ నాయకులు ముర్తజా భుట్టో, షానవాజ్ భుట్టో మేనల్లుడు, అతని తండ్రి వైపు నుండి, అతని అత్తమామలు రాజకీయ నాయకులు అజ్రా పీచోహో, ఫర్యాల్ తల్పూర్.[3] రాజకీయవేత్త అయిన గిన్వా భుట్టో వివాహం ద్వారా అతని అత్త. రచయిత్రి ఫాతిమా భుట్టో, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కళాకారుడు జుల్ఫికర్ అలీ భుట్టో జూనియర్ అతని మేనమామ బంధువులు.

ఆయన తల్లి వైపు సింధీ, కుర్దిష్ సంతతికి చెందినవాడు, తండ్రి వైపు బలూచ్ సంతతికి చెందినవారు.[4]

ప్రాథమిక విద్య కోసం, భుట్టో జర్దారీ కరాచీ గ్రామర్ స్కూల్, ఇస్లామాబాద్‌లోని ఫ్రోబెల్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివాడు, ఆ తర్వాత 1999లో తన తల్లితో కలిసి దుబాయ్‌కి ప్రవాసం వెళ్లాడు. ఆయన దుబాయ్‌లో రషీద్ స్కూల్ ఫర్ బాయ్స్‌లో చదివాడు. ఉన్నత విద్య కోసం తన తల్లి, తాత ఇద్దరి అడుగుజాడలను అనుసరించి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు, అక్కడ క్రిస్ట్ చర్చ్‌లో ఆధునిక చరిత్ర,  రాజకీయ శాస్త్రం అభ్యసించడానికి అంగీకరించబడ్డాడు , 2012లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందాడు (తరువాత సీనియారిటీ ప్రకారం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌గా పదోన్నతి పొందాడు).[5]

రాజకీయ జీవితం

[మార్చు]

డిసెంబర్ 2007 నెల ప్రారంభంలో రావల్పిండిలో జరిగిన ఒక రాజకీయ ర్యాలీలో తన తల్లి హత్యకు గురైన తరువాత 19 సంవత్సరాల వయస్సులో భుట్టో జర్దారీ 30 డిసెంబర్ 2007న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[6][7] ఈ సందర్భంగా, అతను అమరవీరురాలైన తన తల్లిని గుర్తుచేసుకుంటూ, "ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రతీకారం అని మా అమ్మ ఎప్పుడూ చెప్పేవారు" అని అన్నారు.[8]

మూలాలు

[మార్చు]
  1. "Profile: Bilawal Zardari". BBC News. 28 January 2014. Retrieved 2 September 2017.
  2. Ayub, Imran (2022-04-28). "ANALYSIS: BILAWAL'S BIG BREAK". DAWN.COM (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  3. "Bilawal Bhutto Zardari: Heir to a political dynasty". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2018-07-25. Retrieved 2019-01-01.
  4. "President grieved: Hakim Ali Zardari passes away". The Express Tribune. 25 May 2011.
  5. Bilawal Bhutto graduates from Oxford with MA degree Dawn
  6. "Bilawal Bhutto Zardari: Heir to a political dynasty" Archived 25 జూలై 2019 at the Wayback Machine, "BBC", 25 July 2018
  7. "Bhutto's son Bilawal named PPP chairperson", "Rediff India Abroad", 30 December 2007
  8. "Bilawal named PPP chairman: party to contest elections"[permanent dead link] , "Business Recorder", 30 December 2007