బి.ఆర్. యావగల్
| బి.ఆర్. యావగల్ | |||
| పదవీ కాలం 1986 ఫిబ్రవరి 16 – 1986 జూన్ 29 | |||
| పదవీ కాలం 1983 – 1989 | |||
| ముందు | బి.ఆర్. పాటిల్ | ||
|---|---|---|---|
| తరువాత | సిద్ధనగౌడ పాటిల్ | ||
| పదవీ కాలం 1994 – 2004 | |||
| ముందు | సిద్ధనగౌడ పాటిల్ | ||
| తరువాత | సి.సి. పాటిల్ | ||
| పదవీ కాలం 2013 – 2018 | |||
| ముందు | సి.సి. పాటిల్ | ||
| తరువాత | సి.సి. పాటిల్ | ||
| నియోజకవర్గం | నరగుండ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1947 డిసెంబరు 5 జావూర్, ధార్వాడ్ జిల్లా, కర్ణాటక | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| పూర్వ విద్యార్థి | కర్ణాటక విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
బసవరాడ్డి రంగరడ్డి యావగల్ (జననం 5 డిసెంబర్ 1947) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు నరగుండ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ & గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]బి.ఆర్. యావగల్ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1983 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో నరగుండ్ శాసనసభ నియోజకవర్గం నుండి జెఎన్‌పి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బి.ఆర్. పాటిల్ పై 8519 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1985 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జెఎన్‌పి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎస్.ఎన్. కటార్కిపై 20,272 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై 1986 ఫిబ్రవరి 16 నుండి 1986 జూన్ 29 వరకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ & గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు.
బి.ఆర్. యావగల్ ఆ తరువాత జనతాదళ్ పార్టీలో చేరి 1989 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో నరగుండ్ శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సిద్ధనగౌడ పాటిల్ చేతిలో 689 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన 1994 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి వి. ఎ మత్తికట్టిపై 18652 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
బి.ఆర్. యావగల్ ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 1999 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో నరగుండ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి సి.సి. పాటిల్‌పై 11136 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సి.సి. పాటిల్ చేతిలో 12122 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
బి.ఆర్. యావగల్ కు 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సి.సి. పాటిల్ చేతిలో 17614 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత తిరిగి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సి.సి. పాటిల్‌పై 8585 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై,[3] 2016 లో హుట్టి గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[4]
బి.ఆర్. యావగల్ 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సి.సి. పాటిల్ చేతిలో 7,979 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సి.సి. పాటిల్ చేతిలో 1,791 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "rgund (Karnataka) Assembly Constituency Election Results". Elections in India. 2023. the original నుండి 23 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2025.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-03.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-03.
- ↑ "21 MLAs to head boards, corporations" (in Indian English). The Hindu. 2 November 2016. the original నుండి 23 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2025.
- ↑ "Karnataka Assembly Elections 2023: Nargund". Election Commission of India. 13 May 2023. the original నుండి 23 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2025.