బి.ఎన్. అదార్కర్
భాస్కర్ నామ్‌దేవ్ అదార్కర్ | |||
భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నరు
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జాతీయత | భారతీయుడు | ||
వృత్తి | ఆర్థికవేత్త, బ్యాంకరు |
భాస్కర్ నామ్‌దేవ్ అదార్కర్ MBE (1910 మే 18 [1] - 1998 మార్చి 20 [2] ) భారతీయ రిజర్వ్ బ్యాంక్ తొమ్మిదవ గవర్నరు. 1970 మే 4 - 1970 జూన్ 15 మధ్య 42 రోజుల పాటు అతను ఈ పదవిలో ఉన్నాడు. [3] 20 రోజులు మాత్రమే పనిచేసిన అమితావ్ ఘోష్ తర్వాత అతని పదవీకాలమే అతి తక్కువ. ఎస్. జగన్నాథన్ పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు తాత్కాలికంగా పనిచేసినందున అతని పదవీకాలం తక్కువగా ఉంది. [4]
వృత్తి
[మార్చు]భారతీయ సివిల్ సర్వీస్ కు చెందిన అతని ముందరి గవర్నర్ల లాగా కాకుండా, అదార్కర్ ఒక ఆర్థికవేత్త. భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కార్యాలయంలో పనిచేశాడు. అంతకు ముందు అతను వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖలో వివిధ ముఖ్యమైన పదవులను నిర్వహించాడు. అతను 1946 న్యూ ఇయర్ ఆనర్స్‌లో ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (MBE) గా నియమితుడయ్యాడు. తాత్కాలిక గవర్నరుగా బాధ్యతలు చేపట్టకముందు రిజర్వ్ బ్యాంకుకు డిప్యూటీ గవర్నరుగా ఉన్నాడు. భారత స్వాతంత్ర్యానికి ముందు, 1947 మార్చిలో పారిశ్రామిక కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని రూపొందించడానికి భారత ప్రభుత్వం అతన్ని నియమించింది. [5] ఒక సంవత్సరం తర్వాత అతను సమర్పించిన నివేదిక ప్రకారమే ఎంప్లాయ్‌మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) చట్టం, 1948 [5] వచ్చింది.
ప్రధాన కృషి
[మార్చు]అతని హయాంలో డినామినేషన్ల 2, 5, 10, 100 రూపాయిల నోట్లను మహాత్మా గాంధీ జన్మ శతాబ్ది జ్ఞాపకార్థం 1970 ఆగస్టు 24 న తిరిగి విడుదల చేసారు. ఈ నోట్లపై అతని సంతకం ఉంటుంది. అంతకు ముందరి నోట్లపై ఎల్‌కె ఝా సంతకం ఉండేది. [6] అతని స్వల్ప కాల వ్యవధి కారణంగా అతని సంతకం ఇతర భారతీయ రూపాయి నోట్లపై కనిపించదు. సాపేక్షికంగా అరుదుగా ఉంటాయి కాబట్టి అతని సంతకం [7] కలిగిన నోట్లను గ్రే మార్కెట్‌లో భారీ ప్రీమియంతో విక్రయిస్తారు. [8] అతను సంతకం చేసిన ఐదు రూపాయల నోటు 300 నుండి 500 రూపాయలకు అమ్ముడవుతోంది.
అదార్కర్ అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారతదేశ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ స్థాపనలో పాలుపంచుకున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ ""Malhotra" Reserve bank india - Google Search". www.google.co.in.
- ↑ "Reserve Bank of India - Annual Report". rbi.org.in.
- ↑ "B N Adarkar". Reserve Bank of India. Archived from the original on 16 September 2008. Retrieved 2008-09-15.
- ↑ "List of Governors". Reserve Bank of India. Archived from the original on 30 December 2006. Retrieved 2006-12-08.
- ↑ 5.0 5.1 Social Security and Social Obligation Sociology for Nurses : A Textbook for Nurses and Other Medical Practitioners By C M Abraham Retrieved 23 August 2013
- ↑ Jain, Manik (2004). 2004 Phila India Paper Money Guide Book. Kolkata: Philatelia. pp. 19, 26, 35, and 61.
- ↑ "RBI Governors' Signatures on Indian Banknotes". News 18. Retrieved 2019-06-26.
- ↑ "5 Rupee Bank Note B N Adarkar". Golden Collection. Retrieved 2019-06-23.