బి.ఎన్. సూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి.ఎన్. సూరి
భావన నారాయణ సూరి
BN Suri.jpg
జననం1935
మరణం1995
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, రచయిత, సమాజ నిర్వాహకుడు
తల్లిదండ్రులురామయ్య సూరి, రంగనాయకమ్మ

బి.ఎన్. సూరి (భావన నారాయణ సూరి, 1935 - 1995) ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, సమాజ నిర్వాహకుడు.[1]

జననం[మార్చు]

సూరి 1935వ సంవత్సరంలో రామయ్య సూరి, రంగనాయకమ్మ దంపతులకు కృష్ణా జిల్లా, బేతవోలులో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

పోలీస్ వైర్ లెస్ సెట్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సూరి నాటకరంగంపై ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలి నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలు రాసి, ప్రదర్శించాడు

టి. పూర్ణచంద్రరావు, దేవి వరప్రసాద్, తన శ్రీమతి బి.ఎన్. సీతాకుమారితో కలిసి తాండ్ర వేంటక సుబ్రహ్మణ్యం రచించిన మహిషాసుర మర్థని నాటకాన్ని అనేకచోట్ల ప్రదర్శనలు ఇచ్చాడు. గుడివాడ ప్రాంతంలోని నాటక కళాకారులకు, సాంకేతిక నిపుణుల ఉపాధిని కృషిచేశాడు.

మరణం[మార్చు]

నాటకరంగానికి ఎనలేని సేవలు అందించిన సూరి 1995లో నాటకం వేస్తూ రంగస్థలంపైనే తుది శ్వాస విడిచాడు.

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.666.