Jump to content

బి.కె. సంగమేశ్వర

వికీపీడియా నుండి
బి.కె. సంగమేశ్వర

కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్/ల్యాండ్ ఆర్మీకి ఛైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జనవరి 26

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
ముందు ఎం.జె. అప్పాజీ గౌడ
నియోజకవర్గం భద్రావతి
పదవీ కాలం
2004 – 2013
ముందు ఎం.జె. అప్పాజీ గౌడ
తరువాత ఎం.జె. అప్పాజీ గౌడ

వ్యక్తిగత వివరాలు

జననం 1970
కర్ణాటక, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

బి.కె. సంగమేశ్వర (జననం 1970) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు భద్రావతి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 జనవరి 26న కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్/ల్యాండ్ ఆర్మీకి ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

బి.కె. సంగమేశ్వర భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో భద్రావతి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఎం.జె. అప్పాజీ గౌడ చేతిలో 7,386 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2004 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎం.జె. అప్పాజీ గౌడపై 17,431 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

బి.కె. సంగమేశ్వర 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో భద్రావతి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం.జె. అప్పాజీ గౌడపై 487 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎం.జె. అప్పాజీ గౌడ చేతిలో 44,099 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

బి.కె. సంగమేశ్వర 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో భద్రావతి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం.జె. అప్పాజీ గౌడపై 11,567 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి శారద అప్పాజీపై 2,705 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, [3] 2024 జనవరి 26న కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్/ల్యాండ్ ఆర్మీకి ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. ↑ "34 MLAs appointed as heads to govt.-owned boards and corporations in Karnataka". The Hindu (in Indian English). 26 January 2024. Archived from the original on 31 July 2024. Retrieved 20 January 2025.
  2. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. ↑ "Karnataka Assembly Elections 2023: Bhadravati". results.eci.gov.in. Election Commission of India. 13 May 2023. Archived from the original on 13 May 2025. Retrieved 13 May 2025.
  4. ↑ "Karnataka: 34 MLAs made chiefs of boards, Shanti Nagar MLA gets BDA" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 January 2024. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.