Jump to content

బి.జి. గోవిందప్ప

వికీపీడియా నుండి
బి.జి. గోవిందప్ప

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023
ముందు గూలిహట్టి. డి. శేఖర్
నియోజకవర్గం హోసదుర్గ
పదవీ కాలం
2013  2018
ముందు గూలిహట్టి. డి. శేఖర్
తరువాత గూలిహట్టి. డి. శేఖర్
నియోజకవర్గం హోసదుర్గ
పదవీ కాలం
1999  2008
ముందు టి.హెచ్. బసవరాజ్
తరువాత గూలిహట్టి. డి. శేఖర్
నియోజకవర్గం హోసదుర్గ

వ్యక్తిగత వివరాలు

జననం (1955-10-20) 1955 అక్టోబరు 20 (వయసు: 70)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం బెలగూరు హోసదుర్గ, చిత్రదుర్గ
వృత్తి రాజకీయ నాయకుడు

బి.జి. గోవిందప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు హోసదుర్గ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బి.జి. గోవిందప్ప స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 1999 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హోసదుర్గ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఎల్కల్ విజయకుమార్‌పై 1,227 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎల్కల్ విజయకుమార్‌పై 20,728 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

బి.జి. గోవిందప్ప 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హోసదుర్గ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి గూలిహట్టి. డి. శేఖర్ చేతిలో 1,168 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి గూలిహట్టి. డి. శేఖర్‌పై 20,017 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

బి.జి. గోవిందప్ప 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హోసదుర్గ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గూలిహట్టి. డి. శేఖర్ చేతిలో 25992 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఎస్. లింగమూర్తిపై 32,816 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

బి.జి. గోవిందప్ప 2024 జనవరి 26న ఆహార & పౌర సరఫరాల కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-03.
  2. "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-03.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-03.
  4. "Karnataka Assembly Elections 2023: Hosadurga". Election Commission of India. 13 May 2023. the original నుండి 1 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 May 2025.
  5. "34 MLAs appointed as heads to govt.-owned boards and corporations in Karnataka" (in Indian English). The Hindu. 26 January 2024. the original నుండి 31 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2025.
  6. "Karnataka: 34 MLAs made chiefs of boards, Shanti Nagar MLA gets BDA" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 January 2024. the original నుండి 20 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2025.
  7. "34 MLAs given chairman posts for boards and corps, Haris BDA chairman". The Times of India. 27 January 2024. the original నుండి 24 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 May 2025.