బీ.జె.దివాన్

వికీపీడియా నుండి
(బి.జె.దివాన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బీ.జె.దివాన్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి
పదవీ కాలం
1976 – 1977
ముందు ఎస్.ఓబుల్ రెడ్డి
తరువాత ఎస్.ఓబుల్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ గవర్నరు
పదవీ కాలం
1977 – 1977
ముందు ఆర్.డి.భండారే
తరువాత శారద ముఖర్జీ

వ్యక్తిగత వివరాలు

జననం (1919-08-20)1919 ఆగస్టు 20
మరణం 2012 మార్చి 12
అహ్మదాబాదు

జస్టిస్ బిపిన్‌చంద్ర జీవన్‌లాల్ దివాన్ (బీ.జె.దివాన్) స్వాతంత్ర్య సమరయోధుడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు ప్రధానన్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆపద్దర్మ గవర్నరు.[1]

బీ.జె.దివాన్

బాల్యం, విద్యాబ్యాసం

[మార్చు]

బీ.జె.దివాన్, 1919 ఆగస్టు 20న జన్మించాడు. ఈయన విద్యాభ్యాసము అహమ్మదాబాదులో తన తండ్రి జీవన్ లాల్ దీవాన్ స్థాపించిన ప్రొప్రైటరీ ఉన్నత పాఠశాలలో, బొంబాయిలోని విల్సన్ కళాశాల, ప్రభుత్వ న్యాయ కళాశాలలో, బొంబాయి యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఎకానామిక్స్ అండ్ సోషియాలజీలలో సాగింది.[2]

1941 సెప్టెంబరులో బొంబాయి హైకోర్టు, అపెల్లేట్ విభాగంలో న్యాయవాదిగా నమోదుచేసుకున్నాడు. 1943లో ఒరిజినల్ విభాగంలో నమోదుచేసుకొని 1943 నుండి 1954 వరకు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడు. 1954, నవంబరు 4న, బొంబాయి నగర సివిల్ న్యాయస్థానంలో అదనపు సెషన్స్ న్యాయమూర్తిగా నియతుడయ్యాడు. 1961 మే 1న అదే న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. 35 యేళ్ల వయసులో సివిల్ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియతుడయ్యాడు, 45 యేళ్ళకే హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు.[3]

1962, ఏప్రిల్ 19న గుజరాత్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుడై, 1963, సెప్టెంబరు 23 నుండి శాశ్వత న్యాయమూర్తిగా ఉన్నాడు.1973, జూలై 17న గుజరాత్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రేసు ప్రభుత్వం ఈయన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధానన్యాయమూర్తిగా బదిలీ చేసింది. 1976, జూలై 1 నుండి బీ.జె.దివాన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా ఉన్నాడు. అంతే కాకుండా, ఆ సమయంలో 1977 ఫిబ్రవరీ 17 నుండి 1977 మే 5 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆపద్ధర్మ గవర్నరుగా పనిచేసే అవకాశం కూడా ఈయనకు కలిగింది. ఆ తరువాత తిరిగి 1977 ఆగస్టు 28న గుజరాత్ హైకోర్టుకు ప్రధానన్యాయమూర్తిగా బదలీ అయ్యి, 1981 ఆగస్టు 20న పదవీ విరమణ పొందేవరకు ఆ పదవిలో కొనసాగాడు.

బీ.జె.దివాన్, 2012 మార్చి 12న మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "The Honorable Sri Justice B.J.Divan". High Court of Judicature at Hyderabad. High Court of Judicature at Hyderabad. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 20 February 2016.
  2. "DIVAN-BALLUBHAI SCHOOL". divanballubhai.edu.in. Archived from the original on 22 ఏప్రిల్ 2018. Retrieved 21 October 2017.
  3. http://www.dnaindia.com/india/report-legal-luminary-educationist-bj-diwan-passes-away-1661896
  4. Former CJ of Gujarat HC Justice B.J. Divan Dead Archived 13 మే 2014 at the Wayback Machine