బి.వి.రాధ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెంగళూరు విజయ "బి.వి." రాధ (15 ఆగష్టు 1948 – 10 సెప్టెంబరు 2017) భారతీయ సినిమానటి, దర్శకురాలు. ఆమె 1964 లో కన్నడ చిత్రం "నవకోటి నారాయణ" తో సినీ రంగంలో ప్రవేశించింది. ఆమె కన్నడ చిత్రరంగంతో పాటు తమిళం, తెలుగు, మలయాళ, తుళు, హిందీ చిత్రపరిశ్రమలో సుమారు 300 చిత్రాలలో వివిధ పాత్రలలో నటించింది.[1] ఆమె చలనచిత్ర దర్శకుడైన "కె.ఎస్.ఎల్.స్వామి" ని వివాహమాడింది.[2]

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ తదితరులతో కలిసి రాధ నటించారు. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది.[3]

ఆమె ఆమె భర్తతో కలసి "రాధారవి చిత్ర" బ్యానర్ పై చిత్రాలకు దర్శకత్వం వహించింది. తరువాత కాలంలో ఆమె క్యారక్టర్ పాత్రలకు పరిమితమైనది. ఆమె నటవ్‌రింద బృందంతో వివిధ పాత్రలలో నటించింది.[4]

ప్రారంభ జీవితం[మార్చు]

ఆమె 1948లో రాజ్యలక్ష్మికి జన్మించింది. ప్రారంభం నుండి చిత్రసీమలో నటిగా ఉండాలనే ఆశక్తి కనబరిచేది. ఆమె పాఠశాల విద్యను వదిలి చిత్రసీమలో ప్రవేశించింది. 1964లో రాజ్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించిన కన్నడ చిత్రం "నవకోటి నారాయణ" లో నటనా ప్రస్థానాన్ని ప్రరంభించింది. 1966లో తమిళ చిత్రం "తంజంపూ" లో ప్రధాన పాత్రలో నటించింది. 1960, 1970లలో దక్షిణ భారతీయ చలన చిత్ర రంగంలో వివిధ పాత్రలను పోషించింది. ఆమె సెప్టెంబర్ 10, 2017 న గుండెపోటుతో మరణించింది.

మూలాలు[మార్చు]

  1. "B. V. Radha profile". veethi.com. Retrieved 4 December 2014. Cite web requires |website= (help)
  2. "B.V. Radha profile". chiloka.com. Retrieved 4 December 2014. Cite web requires |website= (help)
  3. http://www.inbtimes.com/telugunews/news/senior-actress-b-v-radha-eye-lid/[permanent dead link]
  4. "Award for B.V. Radha". The Hindu. 6 January 2010. Retrieved 4 December 2014. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బి.వి.రాధ&oldid=2888659" నుండి వెలికితీశారు