బి.వి. కారంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి.వి. కారంత్
Bv-karanth.jpg
జననం
బాబుకోడి వెంకటరమణ కారంత్

(1929-09-19)1929 సెప్టెంబరు 19
బాబుకోడి,మంచి,మైసూరు రాజ్యం,బ్రిటిష్ ఇండియా
మరణం2002 సెప్టెంబరు 1(2002-09-01) (వయస్సు 72)
బెంగలూరు, కర్ణాటక, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తికన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు
జీవిత భాగస్వాములుప్రేమ కారంత్ (1958−2002; his death)

బి.వి. కారంత్ (సెప్టెంబర్ 19, 1929 - సెప్టెంబరు 1, 2002) కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు.

జననం[మార్చు]

కర్ణాటకలోని బాబుకోడిలో 1929, సెప్టెంబర్ 19 న అతిపేద కుటుంబంలో జన్మించారు.

నాటకరంగ ప్రస్థానం[మార్చు]

బాల్యం నుంచే సంగీత సాహిత్యాలపట్ల మక్కువ చూపించేవారు. ఆ మక్కువతో ఎందరో ప్రసిద్ధుల్ని నాటక, సినీరంగాలకు అందించిన గుబ్బివీరణ్ణ నాటక కంపెనీలో చేరాడు. జి.వి.అయ్యర్, రాజ్‌కుమార్ బాలకృష్ణ వంటి సినీ, నాటకరంగ దిగ్గజాలతో కారంత్ గుబ్బి కంపెనీల మనుగడసాగింది. ఆ కంపెనీలోనే బాల్యంలో చిన్న చిన్నవేషాలు వేశారు. అక్కడినుండి ఉత్తరాదికి వెళ్ళి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో హిందీ ఎం.ఏ.లో చేరారు. సుప్రసిద్ధ విద్వాంసులు పండిట్ ఓంకారనాద టాగూర్ వద్ద సంగీతాన్ని అభ్యసించారు. బాల్యం కర్ణాటకలో గడిపి, యవ్వనదశ ఉత్తర భారతంలో గడపటంతో భిన్నప్రాంత ప్రజల జీవన సరళితో, ఆచార వ్యవహారాలలో అతనికి ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఈ అనుభవమేు ఉత్తరోత్తరా నాటక, సినీరంగాలలో దర్శకుడిగా విజయం సాధించటానికి తోడ్పడింది.

దేశంలోని వివిధ ప్రాంతాలు తిరగడం వల్ల దర్శకుడిగా కారంత్ విజయం సాధిస్తూ నాటకాన్ని ప్రజల హృదయాలకు చేరువ చేయగలిగారు. సంగీతం నేర్చుకోవడం సైడ్ ప్రైవర్, కైలాసం వంటి నాటకాలను సంగీతాత్మకాలుగానే కారంత్ తీర్చిదిద్దారు. అప్పటికే భారతీయ, పాశ్చాత్యనాటక రచనల్ని ఆధునిక నాటక దర్శకుల ధోరణుల్ని ప్రజ్ఞా పాటవాల్నీ పట్టించుకున్నా, మరేదో నేర్చుకోవాలన్న తపనతో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరి డిప్లోమా పొందారు.

వెంగుళూరుకు తిరిగి వచ్చిన తర్వాత కన్నడ భారతి పేరున ఒక నాటక సంస్థను స్థాపించారు. బాదల్ సర్కార్ ఏవం ఇంద్రజిత్, లంకేష్ సంక్రాంతి, ఈడిపస్, కింగ్లియర్ కు కన్నడరూపం జోకుమారస్వామి వంటి నాటకాలకు దర్శకత్వం వహించారు. ఈ నాటకాలు కారంత్ కు నాటక దర్శకుడిగా, సంగీతకారుడిగా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. గుబ్బి కంపెనీలో చేరటానికి ముందే నన్నగోపాల అనే నాటకంలో పాత్ర ధరించాడు. కారంత్ గుబ్బి కంపెనీలో చేరిన తర్వాత స్త్రీ వేషం ధరించాడు.

శ్రీ కోడెన బేడే (1967), పంజరశాలె (1971), ఓడిపస్, సంక్రాంతి, జోకుమారస్వామి (1972), ఏవం ఇంద్రజిత్ (1972), హయవదన (1973), సత్తాపరనేరలు (1974), చోర్ చరణ్ దాస్ (1981), రుష్యశృంగ (1981), దెడ్డిబగిలు (1981), హిత్తినహుంజ (1981), మిస్ సదారమి (1985), కింగ్లియర్ (1988) వంటి నాటకాలను కర్నాటకలో కారంత్ ప్రదర్శించగా, పంజరశాలె, నందగోపాల, ఇన్స్ పెక్టర్ రాజా (1963), తుగ్లక్, విజయనరసింహ (1965) వంటి నాటకాలను న్యూఢిల్లీలో ప్రదర్శింపచేశారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రిపర్టరీ కంపెనీ తరపున 1997లో హిందీ నాటకం బడపంపన, 1980లో చోటే సయాద్ బడాసయాద్, 1980లో అంధేర్ నగరి, 1978లో ముద్రారాక్షస, షాజహాన్, భగవదజ్ఞక నాటకాలను ప్రదర్శించారు. కర్నాటక, ఢిల్లీలోనేగాక భారతదేశంలో పలు పట్టణ, నగరాలలో నాటకాలను ప్రదర్శింపచేసిన ఘనత సమకాలిక భారతీయ నాటకరంగ ప్రముఖులలో కారంత్ కే దక్కుతుంది. 1972లో కనకదెబల్లిని చంఢీగర్ లోనూ, 1981లో ఘాశీరాం కొత్వాల్ ను.. 1982లో మాళవికాగ్నిమిత్ర, స్కందగుప్త నాటకాలను భోపాల్ లోనూ ప్రదర్శింపజేశారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రాపూ తరపున హయవదన నాటకాన్ని ఆస్ట్రేలియా దేశంలో ప్రదర్శించడం విశేషం.

జానపద, సంప్రదాయ కళారీతుల్ని నాటక ప్రదర్శనలో వాడేవారు. అలా ఆయన నాటకాలు ప్రజల్లో చాలా గుర్తింపునిచ్చాయి. మేగల్స్ నాటక ప్రదర్శనలోనూ యక్షగాన పోకడల్ని ప్రవేశపెట్టి నాటకాన్ని విజయవంతంచేశారు.

తెలుగు నాటకరంగంలో కూడా నాటకాలకు దర్శకత్వం వహించి జనరంజకంగా ప్రదర్శింపచేశారు. 1996 లో భువనగిరిలో ఆర్. నాగేశ్వరరావు సారథ్యం లోని సురభి వేంకటేశ్వర నాట్యమండలి తరపున నలభై రోజులు రిహార్సల్స్ చేయించి భీష్మ నాటకాన్ని, 1997లో నల్గొండ జిల్లా లోని బొమ్మలరామారంలో ముప్పయి రోజుల పాటు రిహార్సిల్స్ చేయించి ఛండీప్రియ జానపద నాటకాన్ని, 1998లో బస్తీదేవత యాదమ్మ నాటకాన్ని ముప్పయి రోజులపాటు సురభి వారితో రిహార్సల్స్ చేయించి ప్రదర్శింపచేశారు.

వంశవృక్షవోమనదుడివంటి జాతీయ పురస్కారాలు పొందిన చిత్రాలకు కారంత్ దర్శకుడిగా పనిచేశారు. మరెన్నో చిత్రాలకు సంగీతం అందించిన కారంత్ కు ఎన్నో జాతీయస్థాయి పురస్కారాలు లభించాయి. 1981లో పద్మశ్రీ, మధ్యప్రదేశ్ కాళిదాస్ సమ్మాన్ అవార్డ్, కర్నాటక ప్రభుత్వ గుబ్చి వీరణ్ణ అవార్డ్ కారంత్ కు అభించాయి.

మరణం[మార్చు]

2002, సెప్టెంబరు 1 న మరణించారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]