బి. బి. లాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి. బి. లాల్
రాష్ట్ర మంత్రి డా.మహేష్ బి.జి.లాల్ చే పుస్తక పరిచయం
జననం
బ్రాజి బాసి లాల్

(1921-05-02) 1921 మే 2 (వయసు 102)
ఝాన్సీ, ఉత్తరప్రదేశ్
మరణం2022 సెప్టెంబరు 10
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిపురావస్తు శాస్త్రవేత్త, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ( 1968 - 1972 )
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సింధు లోయ నాగరికత సైట్లు, మహాభారతం సైట్లు, కలిబంగన్

బి. బి. లాల్ (1921 మే 2 - 2022 సెప్టెంబరు 10) ఇతను భారత పురాతత్వ శాస్త్రవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత.[1] 2021 లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అందజేసింది.[2]

జననం, విద్యాబ్యాసం[మార్చు]

ఈయన 1921, మే 2న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ అనే గ్రామంలో జన్మించాడు. ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత విభాగంలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశాడు.

కెరీర్[మార్చు]

తన చదువు పూర్తిచేసిన తరువాత, ఈయన పురావస్తు శాస్త్రంపై తన ఆసక్తిని పెంచుకున్నాడు. 1943లో అనుభవజ్ఞుడైన బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త మోర్టిమెర్ వీలర్ దగ్గర తను టాక్సీలా, ఒడిశాలోని హరప్ప, సిసూపలాగ్రహః వంటి ప్రదేశాలలో జరిగిన తవ్వకాలలో శిక్షణ తీసుకున్నాడు. యాభై ఏళ్ళకు పైగా పురావస్తు శాస్త్రవేత్తగా పనిచేసిన ఇతను, 1968 నుంచి 1972 వరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా పనిచేశాడు. ఆ తరువాత సిమ్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్ గా పనిచేశాడు.

పురస్కారాలు[మార్చు]

భారత పురావస్తు శాఖలో ఈయన సేవలకు గాను 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించారు.[3]

గుర్తింపు[మార్చు]

ఈయన పేరు మీద కాన్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చైర్ స్థాపింపజేసింది.[4] బ్రిటీష్ పురావస్తు శాస్త్రవేత్తలు అయినటువంటి స్టువర్ట్ పిగ్గోట్, డి.హెచ్. గోర్డాన్ లు లాల్ చేసిన గాంగెటిక్ బేసిన్ కాపర్ హోర్డ్స్, హస్తినాపురా ఎక్స్కవేషన్ రిపోర్ట్, జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ప్రచురించబడిన తన పరిశోధనలను మంచి పరిశోధన పత్రాలుగా గుర్తించి ప్రశంషించారు.

పురావస్తు పరిశోధనలు[మార్చు]

ఈయన నాయకత్వంలో భారత పురావస్తు శాఖ సర్వే ఆఫ్ బుద్ధస్ ఆఫ్ బమియన్, బాల్ఖ్‌లోని ఖ్వాజ్ పార్సా మసీదు ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఆర్. సేన్ గుప్తాతో వీటి పరిరక్షణ, పునరుద్ధరణకు అధ్యయనం చేశారు.[5] ఈయన 1950-52 సంవత్సర కాలంలో హిందూ ఇతిహాసం అయినటువంటి మహాభారతంలో కురుల రాజధాని నగరం హస్తినాపురం పునరుద్ధరణకు అధ్యయనం చేసాడు. అతను ఇండో ‑ గంగెటిక్ డివైడ్, ఎగువ యమునా ‑ గంగా దోయాబ్‌లోని అనేక పెయింటెడ్ గ్రే వేర్ ప్రదేశాలను కనుగొన్నాడు. నూబియాలోని అఫియే సమీపంలో నైలు నది టెర్రస్లలో మధ్య ఉన్న చివరి రాతి యుగం నాటి సాధనాల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, అతని బృందం కలిసి కనుగొన్నారు. ఇతని బృందం సి-గ్రూప్ ప్రజల శ్మశానవాటికలో తవ్వకాలు జరిపి 109 సమాధులను వెలికితీశారు. ఈయన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిధులతో 1975-76 సంవత్సరంలో "ఆర్కియాలజీ ఆఫ్ రామాయణ సైట్స్" ప్రాజెక్ట్‌ పేరుతో హిందూ ఇతిహాసం రామాయణంలో పేర్కొన్న ఐదు సైట్‌లను - అయోధ్య, భరద్వాజ్ ఆశ్రమం, నందిగ్రామ్, చిత్రకూట్, శ్రీంగవరాపూర్ వంటి ప్రదేశాలను త్రవించి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఏడు పేజీల ప్రాథమిక నివేదిక సమర్పించాడు. ఇందులో అయోధ్య లోని బాబ్రీ మసీదు నిర్మాణానికి దక్షిణాన "స్తంభ స్థావరాల" ఉన్నాయని వెల్లడించాడు.[6]

మరిన్ని విశేషాలు[మార్చు]

ప్ఈయన జాతీయ, అంతర్జాతీయ శాస్త్రీయ పత్రికలలో అనేక పుస్తకాలు, 150 కి పైగా పరిశోధనా పత్రాలను, తన కథనాలను ప్రచురించాడు. ఈయన 2002 లో రాసిన పుస్తకం లో, ది సరస్వతి ఫ్లోస్ ఆన్, మునుపటి ఆర్యన్ దండయాత్ర / వలస సిద్ధాంతాన్ని ఇందులో విమర్శించాడు. సరస్వతి నది యొక్క ఋగ్వేద వర్ణన (ఇది క్రీ.పూ. 2000 నాటికి ఎండిపోయింది) కానీ "పొంగిపొర్లుతుంది" అని వాదించాడు. కానీ ఇతని వాదనన కొంతమంది చరిత్రకారులు చేసిన వాదనకు విరుద్ధ ఉంది. ఇండో-ఆర్యన్ వలస వెళ్లిన మూడు వందల సంవత్సరాల తరువాత సరస్వతి నది ఎండిపోయిందని, సింధు లోయ నాగరికత అంతరించిపోవడానికి ఇది దారితీసిందని వాదించాడు.

మరణం[మార్చు]

101 సంవత్సరాల బిబి లాల్ 2022 సెప్టెంబరు 10న న్యూఢిల్లీలో మరణించాడు.[7]

మూలాలు[మార్చు]

  1. "Invitation to the fifth chapter of Sanskriti Samvaad Shrinkhla" (PDF). Indira Gandhi National Centre for the Arts. 19 జూలై 2017. Retrieved 12 అక్టోబరు 2019.
  2. "పద్మ అవార్డు గ్రహీతలు 2021". భారత ప్రభుత్వం.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Padma Awards Directory (1954–2009)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 10 మే 2013. Retrieved 12 అక్టోబరు 2019.
  4. B. B. Lal Chair at IIT Kanpur Archived 2012-03-20 at the Wayback Machine, Indian Institute of Technology, Kanpur website.
  5. Archaeological endeavours abroad, Archaeological Survey of India Official website.
  6. Book review by Dr. V. N. Misra, Book review of The Saraswati Flows on: the Continuity of Indian Culture, by Chairman of Indian Society for Prehistoric and Quaternary Studies journal Man and Environment; (vol. XXVI, No. 2, July–December 2001)
  7. "Archaeologist B B Lal passes away at 101 years, PM Modi pays tribute | Business Standard News". web.archive.org. 2022-09-11. Archived from the original on 2022-09-11. Retrieved 2022-09-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)