బీజేపీ మహిళా మోర్చా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బిజెపి మహిళా మోర్చా భారతీయ జనతా పార్టీ (బిజెపి) కు చెందిన మహిళా విభాగం.

బీజేపీ మహిళా మోర్చా
Chairpersonవనతి శ్రీనివాసన్
Preceded byవిజయ రాహత్కర్
Website
https://mahilamorcha.bjp.org/
2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యుల సమావేశం

బీజేపి మహిళా మోర్చా, (IPA: Mahilā Mōrcā, అంటే మహిళల ఫ్రంట్). భారతీయ జనతా పార్టీ (బీజేపి) కు చెందిన మహిళా విభాగం. వివిధ రాష్ట్రాలలో ఈ మహిళా విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడు బిజెపి మాజీ ఉపాధ్యక్షురాలు, కోయంబత్తూర్ దక్షిణ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గానికి చెందిన తమిళనాడు శాసనసభ సభ్యురాలు వనతి శ్రీనివాసన్ ఈ విభాగానికి జాతీయ అధ్యక్షురాలు.[1][2][3][4]

ఈ పార్టీ లక్ష్యాలు

[మార్చు]

ఈ పార్టీ వెబ్సైటు లో పేర్కొన్నట్లుగా బీజేపి మహిళా మోర్చా లక్ష్యం విప్లవాత్మకమైనది, అభివృద్ధి పథంలో మహిళలను అగ్రగామిగా మార్చడంపై దృష్టి సారించింది.

మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడం, మహిళా ఏజెన్సీలు, సామాజిక-ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కృషి చేయడం,
మారుమూల ప్రాంతాల్లో సురక్షితమైన ప్రాథమిక సౌకర్యాలకు ప్రాప్యతను పెంపొందించడం, నైపుణ్యం పెంపొందించడంలో పెట్టుబడి పెట్టడం, మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచడం, సామాజిక, రాజకీయ, ఆర్థిక వృద్ధికి సమాన అవకాశాలపై దృష్టి పెట్టడం
నైపుణ్యం పెంపొందించడం, మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచడంలో పెట్టుబడి పెట్టడం,
సామాజిక, రాజకీయ , ఆర్థిక వృద్ధికి సమాన అవకాశాల గురించి చెప్పడం
బహుముఖ సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడానికి లింగ సమానత్వం
మహిళల ఉన్నత విద్యను ప్రోత్సహించండి[5]

అధ్యక్షురాళ్లు

[మార్చు]

బీజేపి మహిళా మోర్చా పార్టీ అధ్యక్షురాళ్ల జాబితా 1980 నుండి ప్రస్తుతం వరకు ఈ క్రింద ఈయబడినది. [5]

 • రాజమాతాజి (1980 నుండి 85)
 • మృదులా సిన్హా (1985 నుండి 91)
 • జయవంతి బెన్ మెహతా (1991నుండి 95)
 • మృదులా సిన్హా (1995 నుండి 98)
 • మాయా సింగ్ (1998 నుండి 2000)
 • సురమా పధి (2000 నుండి 2002)
 • కాంతా తాయ్ నలవాడే (2002 నుండి 2004)
 • కరుణా శుక్లా (2004 నుండి 2007)
 • కిరణ్ మహేశ్వరీ (2007 నుండి 2010)
 • స్మృతి ఇరానీ (24 జూన్ 2010 నుండి 24 ఏప్రిల్ 2013)
 • సరోజ్ పాండే (24 ఏప్రిల్ 2013 నుండి 21 ఆగస్టు 2014)
 • విజయ రాహత్కర్ (21 ఆగస్టు 2014 నుండి 28 అక్టోబర్ 2020)
 • వనతి శ్రీనివాసన్ (28 అక్టోబర్ 2020 నుండి ప్రస్తుతం) [5]

కొన్ని వివాదాలు

[మార్చు]

మహిళా మోర్చా తమ బిజెపి పార్టీ సందేశాన్ని మహిళలకు, ముఖ్యంగా ఆర్టికల్ 370, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్. ఆర్. సి) లను వ్యాప్తి చేయడానికి ప్రచారం చేయడానికి దుర్గా పూజ పండుగను ఉపయోగించుకుంది అనే విషయం ప్రచారం లో ఉంది.[6]

బిజెపి మహిళా విభాగం జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యురాలు సీమా పాత్రా, సునీత అనే గృహ కార్మికురాలిని హింసించినట్లు 2022 ఆగస్టులో ఆరోపణలు వచ్చాయి. అనేక వీడియోలు సునీత కథలను ఆన్లైన్ లో ప్రసారం చేసాయి. సునీత శరీరంపై గాయాలు కనిపించాయి, ఆమె కూర్చోలేకపోయింది. ఆమె దంతాలు విరిగిపోయాయి. ఇనుప కడ్డీ తో తన దంతాలు విరిగిపోయాయని, మూత్రం నాకమని నాలుకతో నేల శుభ్రం చేయమని బలవంతం చేశారని ఆమె ఆరోపించింది. ఇంటికి తిరిగి వెళ్లడానికి ఆమె అనుమతి అడిగినప్పుడు, ఆమెను కొట్టి, తాళం వేశారు. సీమా ఆ కార్మికురాలిని దాదాపు 10 సంవత్సరాలు పాటు విడవకుండా బందీగా ఉంచింది. వీడియో వ్యాప్తం కావడంతో, జార్ఖండ్ బిజెపి అధ్యక్షుడు దీపక్ ప్రకాష్ ఆమెపై చర్య తీసుకోవాలని ఆదేశించడంతో, బిజెపి పార్టీ నుండి సీమా పాత్రాను సస్పెండ్ చేసింది.[7][8] మరుసటి రోజు, ఆమెను ఆరోపణల కారణంగా జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు.[9]

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచనలు

[మార్చు]
 1. "Akhilesh Yadav faces BJP Mahila Morcha protests over Badaun gangrape : North, News - India Today". Indiatoday.intoday.in. Retrieved 2014-06-05.
 2. "Badaun Gangrape: Police Fire Water Cannons on Protesters". Outlookindia.com. Retrieved 2014-06-05.
 3. "BJP Mahila Morcha protests against increasing number of rapes in UP". Business Standard India. 2014-05-30. Retrieved 2014-06-05.
 4. Madhav, Pramod (July 20, 2021). "Discussion on 'Kongu Nadu' needed, growth of area pending for years: BJP MLA Vanathi Srinivasan". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-08-05.
 5. 5.0 5.1 5.2 "BJP Mahila Morcha". 27 April 2024.{{cite web}}: CS1 maint: url-status (link)
 6. Arnimest (2019).
 7. "BJP Suspends Jharkhand Leader Over Allegations of Brutal Torture of Domestic Worker". The Wire. 2022-08-30. Retrieved 2022-08-30.
 8. "Jharkhand horror: BJP leader Seema Patra accused of torturing domestic help in Ranchi". The New Indian Express. 2022-08-30. Retrieved 2022-08-30.
 9. "Jharkhand Police Arrests BJP's Seema Patra on Allegations of Torturing Domestic Help". The Wire. 2022-08-31. Retrieved 2022-08-31.