బీనాదాస్

వికీపీడియా నుండి
(బీనాదాస్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బీనా దాస్‌
బీనాదాస్‌
బీనాదాస్‌,(1911-1986), బెంగాల్‌కు చెందిన విప్లవకారిని జాతీయోద్యమ నాయకురాలు. The image was shot around early 1940s.
జననంNot recognized as a date. Years must have 4 digits (use leading zeros for years < 1000).
మరణంమూస:మరణ తేది , వయస్సు
ఉద్యమంభారతజాతీయోద్యమం
తల్లిదండ్రులు
కుటుంబంకళ్యాణిదాస్‌ (సోదరి)
పురస్కారాలుపద్మశ్రీ అవార్డు

బీనా దాస్

బీనాదాస్‌ ( 1911 ఆగస్టు 24—1986) పశ్చిమ బెంగాల్కు చెందిన భారతీయ విప్లవకారిని, జాతీయవాది.

జీవితం&కుటుంబం:

[మార్చు]

బీనాదాస్ ఒక ప్రసిద్ధ బ్రహ్మో టీచర్ మధాబ్ దాస్, సామాజిక కార్యకర్త సరళ దేవి కుమార్తె. ఆమె అక్క కళ్యాణి దాస్ (భట్టాచార్య) కూడా స్వాతంత్ర్య సమరయోధురాలు.

చదువు:

[మార్చు]

దాస్ సెయింట్ జాన్స్ డియోసెసన్ బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్, కలకత్తాలోని బెతున్ కాలేజీ విద్యార్థి.

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం:

[మార్చు]

బీనాదాస్ కోల్‌కతాలోని మహిళల సెమీ విప్లవ సంస్థ ఛత్రి సంఘ సభ్యురాలు. 1932 ఫిబ్రవరి 6 న, ఆమె బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌ను కలకత్తా విశ్వవిద్యాలయంలోని కాన్వొకేషన్ హాల్‌లో హత్య చేసేందుకు ప్రయత్నించింది. రివాల్వర్‌ను మరొక స్వాతంత్ర్య సమరయోధురాలు కమలా దాస్ గుప్తా[1] సరఫరా చేశారు. ఆమె ఐదు షాట్లు కాల్చింది కానీ విఫలమై[2] తొమ్మిదేళ్ల కఠిన కారాగార శిక్షను అనుభవించింది.[3][4] 1939 లో ఆమె విడుదలైన తర్వాత దాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1942 లో, ఆమె క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంది 1942 నుండి 1945 వరకు మళ్లీ జైలు శిక్ష అనుభవించింది. 1946 నుండి 1947 వరకు, ఆమె బెంగాల్ ప్రావిన్షియల్ శాసనసభ సభ్యురాలు.1947 నుండి 1951 వరకు, పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యురాలు. 1947 లో ఆమె జుగంతర్ గ్రూప్ యొక్క భారతీయ స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త జతీష్ చంద్ర భౌమిక్‌[5]ను వివాహం చేసుకుంది. ఆమె సోదరి కళ్యాణి భట్టాచార్జీ బెంగాల్ స్పీక్స్ (1944 లో ప్రచురించబడింది) అనే పుస్తకాన్ని ప్రచురించారు దానిని బీనాదాస్‌కు అంకితం చేశారు.[6] ఆమె స్వాతంత్ర్య సమరయోధురాలు సుహాసిని గంగూలీ స్నేహితురాలు.

అవార్డులు :

[మార్చు]

దాస్ తాను చేసిన సామాజిక సేవలకు గాను 1960 లో పద్మశ్రీ అవార్డును పొందింది.

పోస్ట్‌మాస్టర్‌ నిలిపివేసిన డిగ్రీ:

[మార్చు]

2012 లో, దాస్ కు ప్రీతిలత వడ్డేదార్‌కు బ్రిటిష్ ప్రభుత్వం నిలిపివేసిన డిగ్రీని దాదాపు 80 సంవత్సరాల తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం మరణానంతరం గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌లను ప్రదానం చేసింది.

మరణం:

[మార్చు]

ఆమె భర్త మరణం తరువాత, దాస్ రిషికేష్‌లో ఒంటరి జీవితాన్ని గడిపి అజ్ఞాతంలో మరణించింది. ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన 1986 డిసెంబరు 26 న పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో వెలికితీశారు. ఇది ప్రయాణిస్తున్న జనం ద్వారా కనుగొనబడి పోలీసులకు సమాచారం అందించబడింది ఆమె గుర్తింపును గుర్తించడానికి వారికి ఒక నెల పట్టింది.

రచనలు:

[మార్చు]

బెంగాలీలో రెండు ఆత్మకథ రచనలు రాశారు1 శృంఖల్ జంకర్ 2 పిత్రిధన్.

మూలాలు:

[మార్చు]
  1. Kumar Radha (1997)The History of doing: An illustreted Account of Movements for women's Rights and Feminisim in india 1800-1900. KUMAR RADHA 1997. ISBN 9788185107769.{{cite book}}: CS1 maint: location (link)
  2. "news.google.com/newspapers?id=WPBYAAAAIBAJ&sjid=YKUMAAAAIBAJ&pg=4036,4976689". en.wikipedia.org/wiki/File:Front_cover_of_the_Herald,_11_January_2020.jpg.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "news.google.com/newspapers?id=YB8xAAAAIBAJ&sjid=3OEFAAAAIBAJ&pg=4930,2340793". google.com/support/news/bin/topic.py?topic=9312&hl=en.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "dnaindia.com/analysis/column-forgotten-female-freedom-fighters-2402311". dnaindia.com/analysis/column-forgotten-female-freedom-fighters-2402311.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Chatarjee In India" (PDF). web.archive.org/web/20171201035318/http://www.manushi-india.org/pdfs_issues/PDF%20files%2045/26.%20The%20Bengali%20Bhadramahila.pdf. Archived from the original on 1 డిసెంబరు 2017. Retrieved 2 అక్టోబరు 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Sansad Bangali Charitavidhan(Bengali) 1,Kolkata Sahitya Sansad. Sengupta,Subodh Basu,Anjali (2016). ISBN 978-81-7955-135-6.{{cite book}}: CS1 maint: location (link)
"https://te.wikipedia.org/w/index.php?title=బీనాదాస్&oldid=4077181" నుండి వెలికితీశారు