Jump to content

బీమా భారతి

వికీపీడియా నుండి
బీమా భారతి
బీమా భారతి


చెరకు పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
2019 జూన్ 3 – 2020 నవంబర్ 16

పదవీ కాలం
నవంబర్ 2005 – 2024 జూలై 13
ముందు శంకర్ సింగ్
తరువాత శంకర్ సింగ్
నియోజకవర్గం రూపాలి
పదవీ కాలం
నవంబర్ 2000 – ఫిబ్రవరి 2005
ముందు బాల్ కిషోర్ మండల్
తరువాత శంకర్ సింగ్
నియోజకవర్గం రూపాలి

వ్యక్తిగత వివరాలు

జననం (1973-01-01) 1973 జనవరి 1 (age 52)
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (2024 – ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (యునైటెడ్) (2024 వరకు)
జీవిత భాగస్వామి అవధేష్ మండల్

బీమా భారతి (జననం 1 జనవరి 1973[1]) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చెరకు పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసింది.

రాజకీయ జీవితం

[మార్చు]

బీమా భారతి 2000లో స్వతంత్ర అభ్యర్థిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికలలో రూపాలి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి బీహార్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2005లో శాసనసభ ఎన్నికలలో రాష్ట్రీయ జనతా దళ్ నుండి పోటీ చేసి ఓడిపోయింది.

బీమా భారతి ఆ తరువాత 2005 అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎన్నికైంది. ఆమె ఆ తరువాత ఆమె 2010, 2015 ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 జూన్ 3 నుండి 2020 నవంబర్ 16 వరకు నితీష్ కుమార్ మంత్రివర్గంలో చెరకు పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసింది.

బీమా భారతి 2020లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికలలో రూపాలి నియోజకవర్గం నుండి ఐదవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[2] ఆ తరువాత 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనతాదళ్ (యునైటెడ్) పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో చేరి[3] 2024లో పూర్ణియా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచింది.[4]

బీమా భారతి 2024లో రూపౌలి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో రాష్ట్రీయ జనతా దళ్ నుండి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచింది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Member profile - 60" (PDF) (in హిందీ). Bihar Vidhan Sabha. Archived (PDF) from the original on 27 April 2020.
  2. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "Former JD(U) MLA Bima Bharti quits party, joins RJD ahead of Lok Sabha polls" (in ఇంగ్లీష్). India Today. 24 March 2024. Archived from the original on 5 February 2025. Retrieved 5 February 2025.
  4. "Lok Sabha 2024 Election results: Purnai". Election Commission of India. 4 June 2024. Archived from the original on 5 February 2025. Retrieved 5 February 2025.
  5. "रुपौली में बड़ा उलटफेर, निर्दलीय उम्मीदवार की जीत, बीमा भारती तीसरे नंबर पर" (in హిందీ). TV9 Bharatvarsh. 13 July 2024. Archived from the original on 5 February 2025. Retrieved 5 February 2025.