బీరం హర్షవర్దన్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీరం హర్షవర్దన్‌ రెడ్డి
బీరం హర్షవర్దన్ రెడ్డి


పదవీ కాలం
2018 - ప్రస్తుతం
ముందు జూపల్లి కృష్ణారావు
నియోజకవర్గం కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 31 ఆగస్టు, 1978[1]
సింగోటం, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు బీరం లక్ష్మారెడ్డి - బుచ్చమ్మ
నివాసం హైదరాబాద్

బీరం హర్షవర్దన్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]

జననం, విద్య[మార్చు]

హర్షవర్ధన్ రెడ్డి 1978, ఆగస్టు 31న లక్ష్మారెడ్డి - బిచ్చమ్మ[3] తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ సమీపంలోని సింగోటం గ్రామంలో జన్మించాడు. తండ్రి లక్ష్మారెడ్డి సింగోటం గ్రామ సర్పంచ్ గా, జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2001లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పిఆర్ఆర్ లా కళాశాల నుండి ఎల్.ఎల్.బి. పూర్తిచేసిన హర్షవర్ధన్ రెడ్డి, తరువాత 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

హర్షవర్ధన్ రెడ్డికి విజయతో వివాహం జరిగింది.

రాజకీయ విశేషాలు[మార్చు]

తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హర్షవర్ధన్ రెడ్డి, కొన్నిరోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు చేతిలో 10,498 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుపై 12,543 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5][6] 2018 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[7] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.[8][9]

ఇతర వివరాలు[మార్చు]

మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు[మార్చు]

  1. The Hans India (31 August 2019). "MLA Beeram Harsha Vardhan celebrates birthday in Kollapur". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
  2. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-05.
  3. Andhrajyothy (23 June 2021). "కొల్లాపూర్‌ ఎమ్మెల్యేకు భారీ నజరానా!". andhrajyothy. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
  4. "Harshavardhan Reddy Beeram(Indian National Congress(INC)):Constituency- KOLLAPUR(MAHBUBNAGAR) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-05.
  5. "Beeram Harshavardhan Reddy(Indian National Congress(INC)):Constituency- KOLLAPUR(NAGARKURNOOL) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-05.
  6. Eenadu (13 November 2023). "తొలి ప్రయత్నం.. వరించిన విజయం". EENADU. Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  7. "Another Telangana Cong MLA to join ruling TRS". Business Standard (in ఇంగ్లీష్). Retrieved 2021-09-05.
  8. Namasthe Telangana (22 August 2023). "సమరానికి సై". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  9. Eenadu (14 November 2023). "ఎన్నికల బరిలో కోటీశ్వరులు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.