బుగన్ తెగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బుగున్ తెగ (పూర్వం ఖోవా) భారతదేశపు మొట్టమొదటి గుర్తించబడిన షెడ్యూలు తెగలో ఒకటి.[1][2] వీరిలో ఎక్కువ మంది అరుణాచల ప్రదేశు లోని వెస్టు కామెంగు జిల్లాలోని సింగుచుంగు సబ్ డివిజనులో నివసిస్తున్నారు. వారి మొత్తం జనాభా సుమారు 3000. బుగన్ల నిరాడంబర జీవితం, వెచ్చని ఆతిథ్యం వారి విశిష్ఠత ప్రతిబింబిస్తుంది. బుగన్లలో వివిధ వంశాలు ఉన్నాయి. సాంప్రదాయకంగా బుగన్లు వ్యవసాయం ప్రధానంగా జీవనం సాగిస్తుంటారు. చేపలు పట్టడం, వేటాడటం, పశువుల పెంపకం వంటి ఇతర అనుబంధ కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. బుగన్లకు వారి స్వంత జానపద కథలు, పాటలు, నృత్యాలు, సంగీతం, ఆచారాలు ఉన్నాయి. అరుదైన పక్షి, బుగన్ లియోసిచ్లా, తెగకు ఈ పేరు పెట్టబడింది.

అరుణాచల ప్రదేశు రాష్ట్రంలోని 6-థ్రిజినో-బురాగావ్ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని స్థానిక జనాభాతో వారు ప్రధానంగా పశ్చిమ కామెంగు జిల్లాలోని ఉపఉష్ణమండల సింగుచంగు అడ్మినిస్ట్రేటివ్ సబ్-డివిజన్‌లో నివసిస్తున్నారు. [3] స్థానిక పురాణం ప్రకారం, వారు ఒకే పూర్వీకుడు అచిన్‌ఫంఫులువా వారసులు అని వారు విశ్వసించారు.


భాష[మార్చు]

ఖో-బ్వా భాషాకుటుంబానికి చెందిన బుగునిషు (కామెనికు) భాషలలో రెండు భారతదేశంలో అంతరించిపోతున్న భాషలుగా జాబితా చేయబడ్డాయి.[4]

జీవనాధారం[మార్చు]

బుగన్లు జీవనాధారం కొరకు ఆవు, గుర్రం, పంది, గొర్రెలు, మేక, కోడి, మిథును వంటి పెంపుడు జంతువులను పెంచుతారు. వారి ఆహారాన్ని మెరుగుపరచడానికి, అడవి జంతువులను సాధారణ ఈటెలు, ఉచ్చులు, విల్లంబులు, బాణాలు ఉపయోగించి వేటాడతారు.

సంస్కృతి[మార్చు]

మిజి, అకా మాదిరిగా స్త్రీ పురుషులిరువురూ పొడవాటి జుట్టును కలిగి ఉంటారు. రెండు లింగాలూ తమను తాము వెండి ఆభరణాలతో అలంకరించుకుంటూ ఉంటారు. పురుషులు చాలా పొడవాటి తెల్లని వస్త్రాన్ని, చాలా ఎక్కువ టోపీని ధరిస్తారు. ఇది టర్కిషు ఫెజును పోలి ఉంటుంది. మహిళలు పుర్రె టోపీని ధరిస్తారు. కొన్నిసార్లు అందమైన నమూనాలతో అలంకరిస్తారు. తెలుపు చారల జాకెట్లు కూడా ధరిస్తారు, సాధారణంగా మరొక వస్త్రం ఉంటుంది.

మతం[మార్చు]

బుగన్లు సాంప్రదాయకంగా ఆనిమిస్టికు మతాన్ని అనుసరిస్తున్నారు.[5] అయినప్పటికీ, 20 వ శతాబ్దం ప్రారంభంలో బౌద్ధమతం (మహాయాన) వంటి కొన్ని ఆధిపత్య మతాలు, ముఖ్యంగా పొరుగు జాతి సమూహం షెర్డుక్పెను, హిందూ మతం స్థానంలో క్రమంగా చొచ్చుకుపోయాయి. ప్రజలలో కొతమంది టిబెటను బౌద్ధ ప్రభావానికి లోనయ్యాయి. లోతైన బౌద్ధ ప్రభావం అనేక బౌద్ధ ఆచారాలను స్వీకరించడానికి, బౌద్ధ లామాలను వారి మతపరమైన ఆచారాలలో పాల్గొనడానికి ఆహ్వానించడానికి దారితీసింది.[2] తత్ఫలితంగా చాలా మంది బుగున్లు జనాభా గణనలలో తమను బౌద్ధులుగా ప్రకటించుకున్నారు.[6][7] ఇటీవల కొంతమంది బుగున్లు క్రైస్తవ మతంలోకి మారారు. ఏదేమైనా బుగన్ (ఖోవా) జనాభాలో ఎక్కువ భాగం ఇప్పటికీ వారి సంప్రదాయ పద్ధతిని అనిమిజం ఆచారాలు, అర్చకత్వం ఆచారాలను అనుసరిస్తున్నారు.

పండుగలు[మార్చు]

" ఫాం-ఖో "[8] (కోతల పండుగ) బుగన్ ప్రజల ప్రసిద్ధ పండుగ. ఇది ఇప్పుడు ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10 న జరుపుకుంటారు. ఫాం ఖో సోవై అంటే "పర్వతం" (ఫాం), "నది" లేదా "నీరు" (ఖో) అని అర్ధం. ఇవి మానవ మనుగడకు అవసరమైన ముఖ్యమైన అంశంగా భావిస్తారు. దయగల దేవతలు పర్వతం, నది రూపంలో వ్యక్తమవుతారు. వారు ప్రజలకు జీవితాన్ని ఇస్తారు. కాబట్టి ఫాం-ఖో పండుగ అరుణాచల ప్రదేశు లోని బుగన్ (ఖోవా) సంఘం జరుపుకునే కోతల పండుగ. బుగన్ల ఇతర ముఖ్యమైన పండుగ క్ష్యాతు-సోవై, డైయింగు-ఖో.

బుగన్ ప్రజలు ముఖ్యంగా ప్రధాన గ్రామాల స్రైబాలో (ఆరాధన, సంబంధిత ఆచారాలకు మైదానం వంటి పవిత్ర స్థలం), క్ష్యాతు-సోవై( డైయింగు-ఖో), ఫాం ఖోలను జరుపుకుంటారు. ఈ వేడుకను మతపరమైన ఆచారాలతో నిర్వహించడంలో ఫాబీ పూజారి ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.

క్లౌను, గాస్యో-సయో వంటి పాటలు, నృత్యాలు వారి మతంతో సన్నిహిత అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈ పండుగలలో విందులలో ప్రధానంగా వారి సాంప్రదాయ ఆహారాలు, ఫువా (స్థానికంగా బ్రూ) ఉంటాయి.

ప్రభుత్వం[మార్చు]

సాంప్రదాయకంగా బుగన్లు వారి సమాజాన్ని నియంత్రించడానికి వారి స్వంత సామాజిక-రాజకీయ-పరిపాలనా నిర్ణయాత్మక వ్యవస్థను కలిగి ఉన్నారు. బుగన్ (ఖోవా) సాంప్రదాయ గ్రామ మండలిని నిమియాంగు (కౌన్సిలు ఆఫ్ ఎల్డర్సు) అని పిలుస్తారు. ఇది గ్రామ జీవితంలోని ప్రతి అంశాన్ని చూసుకుంటుంది. ఇది అవసర నిర్ణయాలు తీసుకోవడం, స్థానిక వనరుల వినియోగం, సంఘర్షణల పరిష్కారం లేదా సమాజాన్ని నియంత్రించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. ప్రతి కుటుంబం నుండి పురుషులు నిమియాంగు సెషన్లలో దాని ప్రధాన సభ్యత్వం వహిస్తూ ప్రాతినిధ్యం వహిస్తారు. సాంప్రదాయ గ్రామ " కౌన్సిలు ఆఫ్ బుగన్స్ "కు థాపు-బఖో (గ్రామాధిపతి) నేతృత్వం వహిస్తాడు. థాపు-బోఖో అంగీకరించబడిన నాయకుడు ఏకగ్రీవంగా ఎంపిక చేయబడతాడు. ఇది వంశపారంపర్యంగా కాదు. థాపు-బాఖో ఎంపికకు కఠినమైన ప్రమాణాలు లేవు. కానీ ఆర్థిక సంపద, సామాజిక స్థితి, ఆచార చట్టాల పరిజ్ఞానం, మంచి మనస్తత్వం, శారీరక బలం, ఔదార్యం ఉన్న వ్యక్తిని పరిగణనలోకి తీసుకుంటారు. ఆయన నిమియాంగు సెషను సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. పైన పేర్కొన్న లక్షణాలను కలిగి ఉన్న మగ సభ్యుడు మాత్రమే థాపు-బాఖోగా మారడం ఆచారం. మహిళలు నిమియాంగు సెషన్ల కార్యకలాపాలకు సాక్ష్యమివ్వవచ్చు. కుటుంబ పురుష సభ్యుడు లేని సమయంలో మాత్రమే ఆ కుంటుంబానికి చెందిన మహిళ సమావేశంలో భాగస్వామ్యం వహిస్తారు.

వలసలు[మార్చు]

ప్రస్తుత స్థానానికి బుగన్ల వలస గురించి తెలియదు. ఏది ఏమయినప్పటికీ వారు బహుశా టిబెట్టు నుండి తూర్పు కామెంగు మీదుగా వలస వచ్చారని వారి పురాణాల ద్వారా తెలుస్తుంది. (బుగున్లు వారి నిర్దిష్ట ప్రాంతాన్ని బట్టి విభాగాలుగా విభజించబడి వేర్వేరు పేర్లతో పిలువబడ్డారు: -హఖోంగ్డువా, హజిదువా, బ్రాయిడువా, ఖుచుండువా, హాయిండువా).

బుగన్ గ్రామాలు[మార్చు]

కొన్ని " బుగన్ " గ్రామాలు:-

 • వాంగుహూ,
 • దిఖియాంగు,
 • సిగ్చంగు,
 • లిచిని,
 • రాము,
 • మాంఫ్రి ,
 • మంగోపం,
 • చిటు ,
 • సచిడ ,
 • డిచింగు ,
 • కాస్పి ,
 • బిచోం (లిచిని, రాము, చిటు, సచిడా, నుండి పాక్షికం ప్రజలను చేర్చి ఏర్పాటు చేసిన మాదిరి గ్రామం).
 • సింగ్చుంగు ఆధ్వర్యంలోని తెంగా మార్కెటు, కాస్పీకి చెందిన నాగు మందిరం.

పొరుగు తెగలతో బుగన్ల సంబంధాలు[మార్చు]

 • బుగన్లు తమ పొరుగున ఉన్న షుర్డుక్పెన్, అకా (హ్రుస్సో), మోన్పా (ముఖ్యంగా, భూటు మోన్పా /సర్తాంగు), మిజిసు వంటి తెగలు మంచి సంబంధాలు కొనసాగించారు.
 • వాన్ఘూ , దిఖియాంగుకు చెందిన బుగన్లకు మోన్పాతో (ముఖ్యంగా, భూటు మోన్పా / సర్తాంగు) చాలా సన్నిహిత సంబంధం ఉంది. రెండు తెగల వంశాలలో చాలా మంది మధ్య వివాహం కూడా నిషేధించబడింది. వారి తెగలతో సంబంధం లేకుండా వారిని తమ సొంత సోదరులుగా భావించారు.
 • సింగుచుంగు గ్రామానికి చెందిన బుగన్లు షెర్డుక్పెన్లతో ప్రాచీన కాలం నుండి చాలా మంచి సంబంధాలు కొనసాగించారు. బుంగన్ల మాదిరిగా వాన్ఘూ / దిఖియాంగు వారి తెగలతో సంబంధం లేకుండా కొన్ని వంశాల మధ్య వివాహాలు నిషేధించబడ్డాయి. వారు ఒకరిని ఒకరు సోదరులు, సోదరీమణులుగా భావించినందున వివాహాలు పరిమితం చేయబడ్డాయి. మతపరమైన అంశాలలో కూడా, సింగుచుంగు ప్రాంతాలలో చాలా మంది బుగున్లు షెర్డుక్పెను మహాయాన బౌద్ధమతం ద్వారా ప్రభావితమయ్యారు.
 • లిచిని, రాము, చిటు, కాస్పి ప్రాంతానికి చెందిన బుగన్సు ప్రారంభ రోజులలో ఆకాలతో (హ్రస్సో) తో చాలా సన్నిహిత సోదర సంబంధాలను కలిగి ఉన్నారు.
 • , మిజి (సజలోంగు) భూభాగాల సరిహద్దులో ఉన్న బుగన్లు కూడా డిచింగు, బిచోం బుగన్లతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు

సమూహం కొరకు పనిచేసే సేవా సంస్థలు[మార్చు]

 • " ఎ.బి.ఎస్.":- బుగన్ (ఖోవా) సొసైటీ. బుగన్ సొసైటీ శిఖరాగ్ర (సామాజిక-సాంస్కృతిక) నిర్ణయం తీసుకునే సంస్థ. గతంలో ఎ.బి.వై.ఎ.- ఆల్ బుగన్ యూత్ అసోసియేషన్ అని పిలిచేవారు.
 • ఎ.బి.ఎస్.యు:- ఆల్ బుగన్ (ఖోవా) స్టూడెంట్సు యూనియన్. సంఘం ఆధారిత విద్యార్థుల సంస్థ.

వీటితో పాటు బుగన్ భూభాగంలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో చురుకుగా పనిచేస్తున్న అనేక ఇతర ఎన్జిఓలు మనకు కనిపిస్తాయి: - బి.డల్యూ.ఎస్.- బుగన్ వెల్ఫేర్ సొసైటీ.[9] ఎం.టి. సిఫాంగ్ సొసైటీ మొదలైనవి.

కళారూపాలు & సంగీతం[మార్చు]

గాస్యో-స్యో

అరుణాచల ప్రదేశు లోని బుగన్ (ఖోవా) తెగ ప్రసిద్ధ నృత్య రూపం గాస్యో-సియో (అంటే "నృత్యం చేయి" లేదా "నృత్యం చేద్దాం" అని అర్ధం). వీటిలో గెకు, గిడింగుడాకు వంటి గాస్యో-సియో అనేక రూపాలు ఉన్నాయి. ఈ నృత్యసంగీతాలు సాధారణంగా ప్రతి పండుగ సందర్భంగా, పుట్టుక, వివాహ వేడుకలు, ఫాం ఖో సోవై వంటి పండుగలలో నిర్వహిస్తారు.

బుగన్ సంగీతం, నృత్యాలతో పాటు సాంప్రదాయ సంగీత వాయిద్యాలు తబాం (డ్రం), ఖెన్ఖ్యాపు (క్లాప్పర్సు), బీయను (ఒకే తీగల ఫిడేలు), గాంగు (వెదురు & ఒక స్ట్రింగు చేత తయారు చేయబడిన వాయిద్యం), వివిధ రకాల ఫ్లై (వేణువు) ఉన్నాయి.

కొన్ని ప్రసిద్ధ సంగీత ఆల్బంలు:

1. ఓయ్ (ఆడియో).

2. గైతే బుగుండువా (ఆడియో).

3. చారిత్ లూ ఖుంగ్ (ఆడియో).

మూలాలు[మార్చు]

 1. file:///http://lawmin.nic.in/ld/subord/rule9a.htm Archived 2017-09-20 at the Wayback Machine The constitution (schedule Tribes) Order, 1950
 2. 2.0 2.1 Tribes of India
 3. Ram Kumar Deuri (1983). Festivals of Kameng. Directorate of Research, Govt. of Arunachal Pradesh. p. 11.
 4. The Kho-Bwa or Bugunish languages are a small family of Tibeto-Burman languages* spoken in India. They are Khowa (Bugun), Sulung (Puroik), Lishpa, and Sherdukpen. Van Driem (2001) suggested the name Kho-Bwa based on their words *kho 'fire' and *bwa 'water'.
 5. Dalvindar Singh Grewal (1997). Tribes of Arunachal Pradesh: Identity, Culture, and Languages. South Asia Publications. p. 53. ISBN 81-7433-019-4.
 6. William Carey Library (2004). Peoples of the Buddhist World: A Christian Prayer. South Asia Publications. p. 135. ISBN 0-87808-361-8.
 7. Shiva Tosh Das (1987). Life Style, Indian Tribes: Locational Practice. Gian Pub. House. p. 28. ISBN 81-212-0058-X.
 8. "Archived copy". Archived from the original on 2016-03-04. Retrieved 2014-10-04.CS1 maint: archived copy as title (link)
 9. "Archived copy". Archived from the original on 2014-10-21. Retrieved 2014-10-13.CS1 maint: archived copy as title (link)

Bibliography[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

మూస:Tribes of Arunachal Pradesh మూస:Hill tribes of Northeast India

"https://te.wikipedia.org/w/index.php?title=బుగన్_తెగ&oldid=2863633" నుండి వెలికితీశారు