బుచ్చయ్యపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బుచ్చయ్యపాలెం పల్నాడు జిల్లా, పెదకూరపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం .

బుచ్చయ్యపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
బుచ్చయ్యపాలెం is located in Andhra Pradesh
బుచ్చయ్యపాలెం
బుచ్చయ్యపాలెం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°31′03″N 80°14′05″E / 16.517472°N 80.234638°E / 16.517472; 80.234638
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం పెదకూరపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522436
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

పెదకూరపాడు మండలం[మార్చు]

పెదకూరపాడు మండలంలోని 75 తాళ్ళూరు, కంభంపాడు, కన్నెగండ్ల, కాశిపాడు, గారపాడు, చినమక్కెన, జలాల్‌పురం, పాటిబండ్ల, పెదకూరపాడు, బలుసుపాడు, బుచ్చయ్యపాలెం, ముస్సాపురం , రామాపురం, లగడపాడు, లింగంగుంట్ల, హుసేన్‌నగరం గ్రామాలు అన్నీ ఉన్నాయి.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామస్థులు అందరూ కలిసి సమిష్టిగా ఆలోచనచేసి, గ్రామానికి ఉమ్మడిగా ఉన్న చెరువులో చేపల అమ్మకం ద్వారా వచ్చిన రు. 2.1 లక్షల ఆదాయాన్ని ఉపయోగించి ఒక శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేసికొన్నారు. దీనికి తోడు గ్రామ సర్పంచి శ్రీ పరుచూరి పూర్ణచంద్రరావు, తన స్వంత నిధులు రు. 40 వేలు సమకూర్చడంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకొన్నారు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.