బుద్ధవనం మ్యూజియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుద్ధవనం మ్యూజియం
Buddhist Heritage Museum.jpg
స్థాపితం14 మే, 2014
ప్రదేశంనాగార్జున సాగర్, నల్గొండ జిల్లా, తెలంగాణ, భారతదేశం
రకంమ్యూజియం
సందర్శకులుప్రజా

బుద్ధవనం మ్యూజియం తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రాంతంలో ఉన్న మ్యూజియం.[1] నాగార్జున సాగర్ ఆనకట్టకు సమీపంలో ఉన్న నందికొండ గ్రామం ఒకప్పుడు ఇక్ష్వాకు రాజవంశంలో భాగంగా ఉంది. స్తంభాల మందిరాలు, మఠాల వంటి అనేక బౌద్ధ నిర్మాణాలు కనుగొనబడిన తర్వాత ఈ ప్రాంతం ప్రాముఖ్యతను సంపాదించుకొంది. నాగార్జున సాగర్ ఆనకట్ట కుడి ఒడ్డున ఉన్న కాలువ త్రవ్వకాలలో వెలికితీసిన అవశేషాలు ఈ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్నాయి.[2]

చరిత్ర[మార్చు]

బుద్ధుడు నివసించిన కాలంలోనే తెలంగాణలో బౌద్ధం వికసించింది. భారతదేశంలోని పురాతన బౌద్ధ నాగరికతలకు నిలయంగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాంతంలో 1950వ దశకంలో ఆనకట్ట నిర్మాణ సమయంలో అనేక చారిత్రాత్మక నాణేలు, కళాఖండాలు లభించాయి. ఆ కళాఖండాలను భద్రపరచే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ వారసత్వ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ డ్యామ్ సమీపంలోని బుద్ధవనంలో[3] 2014, మే 14న బుద్ధ జయంతి వేడుకల సందర్భంగా బౌద్ధ వారసత్వ మ్యూజియం అధికారికంగా ప్రారంభించబడింది.[4] జాతక కథలు, అజంతా, ఎల్లోరా గుహల్లో ఉన్న చిత్రాలు, శిల్పాలు, జనపదాల్లో వ్యవహారంలో ఉన్న కథలలోని ఘట్టాల ఆధారంగా ఈ బుద్ధవనంలో కళాకృతులను రూపొందించారు.[5]

సేకరణలు[మార్చు]

బౌద్ధ థీమ్ పార్కుగా పేరొందిన బుద్ధవనంలోని ఈ మ్యూజియంలో బౌద్ధ శిల్పాలు, బౌద్ధ టాంకులు, కాంస్యాలు, పాల, గాంధార శిల్పాలు, అజంతా చిత్రాలు, రాతి శిల్పాలు మొదలైనవి భద్రపరచబడ్డాయి. బౌద్ధమత స్థాపకులలో ఒకరైన ఆచార్య నాగార్జునుడు నివాసమున్న ఈ ప్రాంతపు వారసత్వాన్నీ, వైభవాన్ని ప్రతిబింబించే టైంలెస్ స్మారక చిహ్నాలు, శిల్పాలను కాపాడటం కోసం ఇక్కడ కొత్త గ్యాలరీలు ఏర్పాటుచేయబడ్డాయి. ప్రత్యేకమైన మ్యూజియంలో అవతార్ ధ్యానంలో భగవంతుడు గౌతమ బుద్ధుని ఆకర్షణీయమైన శిల్పాలు ఉన్నాయి,

సందర్శన వివరాలు[మార్చు]

ప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. శుక్రవారం, పబ్లిక్ హాలిడేస్‌లో మ్యూజియం మూసివేయబడుతుంది.[6]

మాలాలు[మార్చు]

  1. India, The Hans (2020-11-06). "World's largest Buddhist heritage theme park on the anvil in Telangana". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-18.
  2. Telangana Tourism, Telangana (7 February 2019). "Unique Museum of Buddhist Heritage". www.telanganatourism.gov.in. Archived from the original on 18 September 2021. Retrieved 18 September 2021.
  3. "Govt to develop Buddhist sites across Telangana". The New Indian Express. Retrieved 2021-09-18.
  4. Department of Heritage Telangana, Museums. "Buddhist Heritage Museum, Buddavanam". www.heritage.telangana.gov.in. Archived from the original on 27 January 2021. Retrieved 18 September 2021.
  5. సాక్షి, హైదరాబాద్ (5 April 2021). "సిద్ధయానం". Sakshi. వాకా మంజులారెడ్డి. Archived from the original on 13 April 2021. Retrieved 18 September 2021.
  6. "Buddhist Heritage Museum". map.sahapedia.org (in ఇంగ్లీష్). Retrieved 2021-09-18.