బుద్ధా అరుణా రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుద్ధా అరుణా రెడ్డి
— Gymnast  —
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశము భారతదేశం
జననం (1995-12-25) 1995 డిసెంబరు 25 (వయసు 28)
హైద్రాబాద్, తెలంగాణ, భారతదేశం
నివాసముహైద్రాబాద్, తెలంగాణ, భారతదేశం
కృషిమహిళల ఆస్టిస్టిక్ జిమ్నాస్టిక్స్
Years on national team2013
College teamసెయింట్ మెరీ కాలేజ్ (St. Mary's College, Hyderabad)

బుద్ధా అరుణా రెడ్డి ( జననం: డిసెంబర్ 25, 1995 ) భారతదేశ ప్రముఖ జిమ్నాస్టర్. 2018 మెల్బోర్న్లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్స్ పోటీలో భారతదేశం తరపున మెదటిసారిగా కాంస్య పతకం గెలచుకొని చరిత్ర సృష్టించింది.[1]

బాల్యం, విద్యాబ్యాసం[మార్చు]

ఈమె 1995, డిసెంబర్ 25న సుభధ్ర, నారాయణ రెడ్డి దంపతులకు హైద్రాబాద్లో జన్మించారు. తండ్రి వృత్తి రీత్యా అకౌంటెంట్‌. తల్లి గృహిణి. తన ఇంటర్ విద్యని 2013లో బషీర్బాగ్ లోని సెయిట్ మేరీస్ జూనియర్ కాలేజీలో పూర్తి చేసింది. ఇదే కాలేజ్ లో తన డిగ్రీ విద్యను కూడా పూర్తీ చేసింది.

మరిన్ని విశేషాలు[మార్చు]

తండ్రి నారాయణ రెడ్డి తనని ఐదేళ్ల వయసులోనే కరాటేలో చేర్పించాడు. అందులో ప్రతిభ చాటిన తను రెండేళ్ల లోపే బ్లాక్‌బెల్ట్‌ సాధించింది. అయితే అరుణ శరీరం జిమ్నాస్టిక్స్‌కు సరిపోతుందన్న సలహా మేరకు తర్వాత అందులో చేర్చాడు తండ్రి. నిజానికి మొదట్లో జిమ్నాస్టిక్స్‌ అంటే అంత ఆసక్తి లేకున్నా తండ్రి మాట ప్రకారం అందులోనే సాధన చేసింది. వయసు పెరిగే కొద్దీ ఆటపై ఆసక్తి పెరిగి పదేళ్ల వయసులోనే జాతీయ స్థాయి పోటీల్లో సత్తా కనబరిచి 12 ఏళ్ల వయసులోనే 2007 జాతీయ క్రీడల్లో వాల్ట్‌ విభాగంలో పతకం గెలిచుకొని తన సత్తాను నిరూపించుకుంది.

క్రీడా నేపథ్యం[మార్చు]

ఈమె ప్రపంచ జిమ్నాస్టిక్ 2013, 2014, 2017 పోటీలో పాల్గొంది. కాని ఈ పోటీలో తాను ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. 2018 లో నిర్వహించిన ప్రపంచ జిమ్నాస్టిక్ పోటీలో భారతదేశం తరపున పాల్గొని కాంస్య పతకం సాధించి ఈ పోటీలో గెలిచిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

పతకాలు[మార్చు]

  • 2007 జాతీయ క్రీడల్లో వాల్ట్‌ విభాగంలో పతకం కూడా గెలిచింది.
  • 2018 ప్రపంచ జిమ్నాస్టిక్స్ పోటీలో భారతదేశం తరపున కాంస్య పతకం గెలుచుకుంది.[2]

మూలాలు[మార్చు]

  1. బుద్ధా అరుణా రెడ్డి. "ఆరుణం తీర్చుకోవాలని." www.eenadu.net. ఈనాడు. Archived from the original on 6 మార్చి 2018. Retrieved 7 March 2018.
  2. బుద్ధా అరుణా రెడ్డి. "Gymnastics World Cup: Aruna Budda Reddy scripts a new chapter". www.thehindu.com. ది హిందు. Retrieved 7 March 2018.