బుధు భగత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుధు భగత్
జననం17 ఫిబ్రవరి 1792
సిలగాయి, ఝార్ఖండ్
మరణం13 ఫిబ్రవరి 1832
సిలగాయి, ఝార్ఖండ్

బుధు భగత్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధానికి నాయకత్వం వహించాడు. అతను 1832 [1] లార్కా తిరుగుబాటుకు నాయకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను బ్రిటీష్ ఇండియాలోని రాంచీ జిల్లాలోని చాన్హో బ్లాక్‌లోని సిలగై గ్రామంలో 1792 ఫిబ్రవరి 17న జన్మించాడు. అతను ఓరాన్ రైతు కుటుంబంలో జన్మించాడు. [2]

అతను జమీందార్లు మఱియు బ్రిటిష్ దళాల క్రూరత్వాన్ని చూస్తూ పెరిగాడు. పండిన పంటను జమీందార్లు, బ్రిటీష్ దళాలు ఎలా తీసుకెళ్తాయో అతను చూస్తూనే ఉన్నాడు. పేద కుటుంబానికి సరిపడా ఆహారం అందడం లేదు. అతను గెరిల్లా యుద్ధం కోసం తన స్నేహితులకు శిక్షణ ఇచ్చాడు. బ్రిటీష్‌తో పోరాడాలని బుధు భగత్ ప్రజలకు సూచించారు. అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధానికి నాయకత్వం వహించాడు. బుధు భగత్‌ను పట్టుకున్న వారికి బ్రిటీష్ ప్రభుత్వం బహుమతులు ప్రకటించారు. బ్రిటిష్ బలగాలు ఫిబ్రవరి 13న సిలగై గ్రామానికి చేరుకున్నాయి. బ్రిటీష్ వారు బుధు భగత్ అనుచరుల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. వారు విల్లు, బాణం, గొడ్డలి మఱియు కత్తితో బ్రిటిష్ వారిపై దాడి చేశారు. బ్రిటిష్ వారిపై కాల్పులు జరిపారు. ఈ పోరాటములో బుధు భగత్ ఇద్దరు కుమారులు అయిన బుధు భగత్ హల్ధర్ మఱియు గిరిధర్ చనిపోయారు. చివరికి బుధు భగత్ బ్రిటిష్ దళాలతో పోరాడి మరణించాడు. [3]

మూలాలు[మార్చు]

  1. "Governor pays tribute to Veer Budhu Bhagat". dailypioneer. 23 August 2016. Retrieved 28 November 2019.
  2. "वीर बुधु भगत ने 1832 में शुरू किया था लरका विद्रोह". bhaskar. 18 February 2017. Retrieved 28 November 2019.
  3. "वीरों में वीर थे शहीद बुधु भगत". prabhatkhabar. Retrieved 28 November 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=బుధు_భగత్&oldid=3850459" నుండి వెలికితీశారు