Jump to content

బుల్లెట్ రైలు ప్రాజెక్టు (ఇండియా)

వికీపీడియా నుండి
(బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు (ఇండియా) నుండి దారిమార్పు చెందింది)

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ముంబాయి- అహ్మదాబాద్‌ నగరాల మధ్య 508 కిలోమీటర్ల బుల్లెట్‌ రైలు మార్గం నిర్మాణానికి సెప్టెంబరు 14, 2017 భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే శంకుస్థాపన చేశారు. దేశంలో బుల్లెట్‌ రైళ్ల యుగానికి ఇది పునాది కాబోతోంది. జపాన్‌ సహయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు వ్యయం రూ.1.10 లక్షల కోట్లు. ఈ నిర్మాణం 2023 నాటికి పూర్తవుతుందని అంచనా.[1]

ప్రత్యేకతలు

[మార్చు]
  • బుల్లెట్‌ రైలు మార్గం నిర్మాణం- ముంబాయి- అహ్మదాబాద్‌ నగరాలు..
  • వ్యయం- రూ.1.10 లక్షల కోట్లు
  • దూరం- 508కిలోమీటర్లు (468 కిలోమీటర్ల ట్రాక్‌ పిల్లర్ల మీద నిర్మాణం, 13 కిలోమీటర్లు భూమి మీద, 27 కిలోమీటర్లు సొరంగ మార్గం, అందులో 7 కిలోమీటర్ల రైలుమార్గం (బీకేసీ నుంచి దివా వరకూ) సముద్రం కింద నుంచి ఉంటుంది!)
  • స్లేషన్లు-12
  • వేగం- గంటకు 320 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్లు..
  • ప్రయాణ సమయం- 2 గంటల58 నిమిషాలు (ప్రస్తుతం రైల్లో ముంబాయి నుంచి అహ్మదాబాద్‌ వెళ్లటానికి6.30 గంటల నుంచి8గంటల సమయం పడుతోంది) .
  • తొలిదశలో 10 బోగీల బుల్లెట్‌ రైలు,750సీట్లు. తదుపరి 16 కంపార్ట్‌మెంట్లు, 1250 మంది ప్రయాణించే వీలు.
  • జపాన్‌ రుణం- రూ.88,000 కోట్లు (వడ్డీ రేటు- 0.1 శాతం, రుణ కాలవ్యవధి 50 ఏళ్లు)
  • ఈ రైలు మార్గం నిర్మాణంతో 20,000 మంది నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక రైళ్ల నిర్వహణ కార్యకలాపాల్లో 4,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా మరో 16,000మందికి ఉపాధి లభిస్తుందని అంచనా..

మూలాలు

[మార్చు]
  1. బుల్లెట్‌ రైలు. "బుల్లెట్‌ భారతం". ఈనాడు. Archived from the original on 3 ఏప్రిల్ 2017. Retrieved 13 September 2017.