బూచమ్మ బూచోడు
బూచమ్మ బూచోడు | |
---|---|
దర్శకత్వం | రేవన్ యాదు (యాదగిరి) |
రచన | సాయి కృష్ణ |
స్క్రీన్ ప్లే | సాయి కృష్ణ |
కథ | సాయి కృష్ణ |
నిర్మాత | రమేష్ అన్నంరెడ్డి & ప్రసాద్ రెడ్డి |
తారాగణం | శివాజీ ఖైనాజ్ మోతీవాల |
ఛాయాగ్రహణం | విజయ్ మిశ్ర |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | శేఖర్ చంద్ర |
నిర్మాణ సంస్థ | స్నేహ మీడియా & హెజెన్ ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 5 సెప్టెంబరు 2014 |
సినిమా నిడివి | 112 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బూచమ్మ బూచోడు 2014, సెప్టెంబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. స్నేహ మీడియా, హెజెన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రేవన్ యాదు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, ఖైనాజ్ మోతీవాల జంటగా నటించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.[1][2]
కథా నేపథ్యం
[మార్చు]కార్తీక్ (శివాజీ), శ్రావణి (కైనాజ్) భార్యాభర్తలు, ఎంతో అన్యోన్యంగా ఉంటుంటారు. కొత్తగా కొనుక్కున్న ఫామ్ హౌస్‌లో ఏకాంతంగా గడపడానికి వెళ్ళిన వాళ్ళు, ఒక రాత్రి కారణం లేకుండా ఒకర్నొకరు కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకున్నారన్నది వాళ్ళిద్దరికి అర్థంకాదు. కొన్నిరోజుల తరువాత ఆ ఇంట్లో ఏదో ఉందనే విషయం తెలుస్తుంది. కార్తీక్ భయపడ్డట్టుగానే ఆ ఇంట్లో అదృశ్య శక్తులు తమని అధీనంలోకి తీసుకుని వేధిస్తుంటాయి. అక్కడ్నుంచి బయటపడడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో ఒకర్నొకరు ఫలానా రోజున చంపుకుంటామని సవాల్ చేసుకుంటారు. కార్తీక్, శ్రావణి చనిపోయారా, అసలు ఎందుకు అలా జరుగుతుందనేది మిగతా కథ.[3][4]
నటవర్గం
[మార్చు]- శివాజీ (కార్తీక్)
- ఖైనాజ్ మోతీవాల (శ్రావణి)
- బ్రహ్మానందం (చరణ్-కార్తీక్ అంకుల్)
- పోసాని కృష్ణమురళి (తాంత్రిక్)
- వెన్నెల కిషోర్
- శ్రీనివాసరెడ్డి
- తాగుబోతు రమేష్
- చమ్మక్ చంద్ర (యాదగిరి)
- రవివర్మ
- చిత్రం శ్రీను
- వేణు
- అవినాష్ మాదేటి
- భక్తి
- బేబి మోక్ష
- తేజ కాకుమాను
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రేవన్ యాదు (యాదగిరి)
- నిర్మాతలు: రమేష్ అన్నంరెడ్డి & ప్రసాద్ రెడ్డి
- కథ, చిత్రానువాదం, మాటలు: సాయి కృష్ణ
- సంగీతం: శేఖర్ చంద్ర
- ఛాయాగ్రహణం: విజయ్ మిశ్ర
- కూర్పు: ప్రవీణ్ పూడి
- పాటలు: శ్రీమణి
- నిర్మాణ సంస్థ: స్నేహ మీడియా & హెజెన్ ఎంటర్టైన్మెంట్
పాటలు
[మార్చు]- ఈ క్షణమే ఒక - సాయి చరణ్, హార్సెక్స్ - 4:06
- ఏం జరిగిందో - భార్గవి పిళ్ళై, సాయి చరణ్ - 3:33
- ఓహ్ చెలియా ఇది - శేఖర్ చంద్ర - 0:55
మూలాలు
[మార్చు]- ↑ "Boochamma Boochodu review. Boochamma Boochodu Telugu movie review, story, rating". IndiaGlitz.com.
- ↑ "Archived copy". Archived from the original on 2014-11-20. Retrieved 2020-08-06.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ తెలుగు గ్రేట్ ఆంధ్ర, రివ్యూ (5 September 2014). "సినిమా రివ్యూ: బూచమ్మ బూచోడు". www.telugu.greatandhra.com. Retrieved 7 August 2020.
- ↑ The Times of India, Movie Review (5 May 2016). "Boochamma Boochodu Movie Review". Archived from the original on 7 August 2020. Retrieved 7 August 2020.