Jump to content

బృహదీశ్వర ఆలయ అగ్నిప్రమాదం

బృహదీశ్వర ఆలయ అగ్నిప్రమాదం
పటం
Date1997 జూన్ 7 (1997-06-07)
Location

1997 జూన్ 7న తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయంలో కుంభాభిషేకం సందర్భంగా ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది. ఆలయ సమీపంలో వెలిగించిన ఒక బాణాసంచా తాత్కాలికంగా నిర్మించిన యజ్ఞశాలపై పడటంతో అగ్ని చెలరేగింది. ఆ మంటలు తాటాకులతో కప్పబడిన పైకప్పుల మీదకు వ్యాపించాయి. భయంతో ఒక్కటే తూర్పు ప్రవేశ ద్వారం వైపు భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి 48 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు.

ఈ రక్షణ చర్యలను అప్పటి హిందూ మత ధర్మాదాయ శాఖ మంత్రి పులవర్ సెంగుట్టువన్, జిల్లా కలెక్టర్ టి.ఎన్. రామనాథన్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్.కె. దోగ్రా, అలాగే తంజావూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జయంత్ మురళి పర్యవేక్షించారు. రక్షణ చర్యల్లో హోం గార్డులు, రెడ్ క్రాస్ సభ్యులు, సాధారణ ప్రజలు సహకరించారు. మృతుల కుటుంబాలకు రూ.1,00,000 పరిహారం ప్రకటించగా, గాయపడిన వారికి రూ.10,000 నుండి రూ.50,000 వరకు పరిహారం చెల్లించారు.

నేపథ్యం

[మార్చు]
ఆలయ ప్రవేశ ద్వారం

బృహదీశ్వర ఆలయం, దీనిని పెరువుడైయార్ కోవిల్ (అక్షరాలా 'పెద్ద ఆలయం') అని కూడా పిలుస్తారు, ఇది శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. దీనిని క్రీ.శ. 1010వ సంవత్సరంలో రాజ రాజ చోళుడు I తన రాజధాని నగరం తంజావూరులో నిర్మించాడు..[1]

ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించబడింది, ఇది గ్రేట్ లివింగ్ చోళ ఆలయాలులో ఒకటి. ఆలయ విమానం (గోపురం) సుమారు 216 అడుగుల ఎత్తుతో, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆలయ గోపురాలలో ఒకటిగా గుర్తించబడింది. విమానం శిఖరంపై ఉన్న కుంభం (కలశం) ఒకే రాతితో చెక్కబడి సుమారు 80 టన్నుల బరువు ఉంటుంది.[2]

ఈ ఆలయం స్వచ్ఛమైన ద్రావిడ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇది చోళ సామ్రాజ్యం యొక్క శిల్పకళ, శిల్పం, చిత్రకళ, కంచు శిల్పకళలోని ప్రావీణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.[3]

అగ్నిప్రమాదం

[మార్చు]
బృహదీశ్వర ఆలయం

1997లో జరిగిన కుంభాభిషేకం సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 48 మంది మరణించగా, 86 మంది గాయపడ్డారు.[4][5] ఈ ఘటన మహాకుంభాభిషేకానికి కొన్ని గంటల ముందు జరిగింది.[6] ఆ సమయంలో సుమారు 120 మంది పూజారులు పూజా కార్యాచరణలు నిర్వహిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆలయ సమీపంలో వెలిగించిన బాణాసంచా యజ్ఞశాలపై పడటంతో మంటలు చెలరేగాయని, అవి తాటాకుల పైకప్పులకు వ్యాపించాయని పేర్కొన్నారు. భయాందోళనకు గురైన భక్తులు తూర్పు వైపున ఉన్న సన్నని ద్వారం వైపు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది.[6] మరణాలలో ఎక్కువ శాతం కార్బన్ మోనాక్సైడ్ విషపూరిత ప్రభావం వల్ల సంభవించాయి. పూజలలో ఉపయోగించే నెయ్యి, కర్పూరం వంటి జ్వలనశీల పదార్థాలు అగ్నిప్రమాదాన్ని మరింత తీవ్రమయ్యేలా చేశాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడింది.[7]

అనంతర పరిణామాలు

[మార్చు]

ఈ అగ్నిప్రమాదం తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అత్యంత ఘోరమైన నాలుగు అగ్నిప్రమాదాలలో ఒకటిగా గుర్తించబడింది. ఇతర ఘటనలలో ఎరవాడి అగ్నిప్రమాదం (2001), శ్రీరంగం వివాహ మండప అగ్నిప్రమాదం (2004), 2004 కుంభకోణం పాఠశాల అగ్నిప్రమాదం ఉన్నాయి.[8]

మృతుల కుటుంబాలకు రూ.1,00,000 పరిహారం ప్రకటించగా, గాయపడిన వారికి రూ.10,000 నుండి రూ.50,000 వరకు పరిహారం చెల్లించారు. దర్యాప్తులో ఇది విధ్వంసక చర్య కాదని పోలీసులు స్పష్టం చేశారు.

సూచనలు

[మార్చు]
  1. ↑ Swaminathan Natarajan (25 September 2010). "India's Big Temple marks 1,000th birthday". BBC. BBC Tamil. Retrieved 17 December 2013.
  2. ↑ "The Archaeological Survey of India (ASI)". Archaeological Survey of India. Retrieved 30 November 2013.
  3. ↑ "Great Living Chola Temples". UNESCO. Retrieved 2008-01-21.
  4. ↑ B.K. 2005, పుట 190
  5. ↑ Deccan Herald. June 2010 http://www.deccanherald.com/content/59116/hex-fears-doom-temple-gala.html. Retrieved 22 June 2012. {{cite news}}: Missing or empty |title= (help)
  6. 1 2 Rediff.com. June 1997 http://www.rediff.com/news/jun/09fire.htm. Retrieved 22 June 2012. {{cite news}}: Missing or empty |title= (help)
  7. ↑ "Fire Kills Hindu Worshipers". The Washington Post. 8 June 1997.
  8. ↑ Teets 2007, పుటలు 103–104

ఇవి కూడా చూడండి

[మార్చు]