బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్

బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్, సాధారణంగా బెంగాల్ స్కూల్ అని పిలుస్తారు, ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ రాజ్ కాలంలో బెంగాల్ లో, ప్రధానంగా కోల్‌కతా, శాంతినికేతన్ లలో పుట్టి, భారత ఉపఖండం అంతటా వర్ధిల్లిన భారతీయ చిత్రకళా శైలి, కళా ఉద్యమం. ప్రారంభ రోజుల్లో 'భారతీయ చిత్రకళా శైలి'గా పిలువబడిన ఇది భారతీయ జాతీయవాదం (స్వదేశీ) తో ముడిపడి అబనీంద్రనాథ్ ఠాగూర్ (1871–1951) నేతృత్వంలో కొనసాగింది. 1896 నుండి కలకత్తా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కు ప్రిన్సిపాల్‌గా ఉన్న ఎర్నెస్ట్ బిన్‌ఫీల్డ్ హావెల్ లాంటి బ్రిటిష్ కళా నిర్వాహకుల ప్రోత్సాహం, మద్దతు కూడా దీనికి లభించింది. చివరకు ఇది ఆధునిక భారతీయ చిత్రకళ అభివృద్ధికి దారితీసింది.[1][2]
చరిత్ర
[మార్చు]భారతదేశంలో గతంలో రాజారవివర్మ లాంటి భారతీయ కళాకారులు, బ్రిటిష్ ఆర్ట్ స్కూల్స్ ప్రోత్సహించిన అకడమిక్ ఆర్ట్ శైలులకు వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తూ బెంగాల్ స్కూల్ ఒక అవాంట్ గార్డ్, జాతీయవాద ఉద్యమంగా ఆవిర్భవించింది. పాశ్చాత్య దేశాలలో భారతీయ ఆధ్యాత్మిక భావాల ప్రభావాన్ని అనుసరించి, బ్రిటిష్ కళా ఉపాధ్యాయుడు ఎర్నెస్ట్ బిన్‌ఫీల్డ్ హావెల్ విద్యార్థులను మొఘల్ సూక్ష్మ చిత్రాలను అనుకరించేలా ప్రోత్సహించడం ద్వారా కలకత్తా స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లోని బోధనా పద్ధతులను సంస్కరించడానికి ప్రయత్నించాడు.[3][4] ఇది వివాదానికి దారితీసి విద్యార్థుల సమ్మెకు కారణమైంది, దీనిని తిరోగమన చర్యగా భావించిన జాతీయవాదులతో సహా స్థానిక పత్రికల నుండి ఫిర్యాదులు వచ్చాయి. కవి రవీంద్రనాథ్ ఠాగూర్ మేనల్లుడు అయిన కళాకారుడు అబనీంద్రనాథ్ ఠాగూర్ హావెల్‌కు మద్దతు ఇచ్చాడు. పాశ్చాత్య భౌతికవాదానికి విరుద్ధంగా భారతదేశ విలక్షణమైన ఆధ్యాత్మిక లక్షణాలను వ్యక్తపరిచే శైలిగా హావెల్, ఠాగూర్ భావించిన మొఘల్ కళ ప్రభావంతో ఠాగూర్ అనేక చిత్రాలను గీశాడు. ఠాగూర్ గీసిన అత్యంత ప్రసిద్ధ చిత్రలేఖనం భారత్ మాత. ఇందులో ఒక యువతిని హిందూ దేవతల వలె నాలుగు చేతులతో, భారతదేశ జాతీయ ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచే వస్తువులను పట్టుకుని ఉన్నట్లుగా చిత్రించారు. పాన్-ఏషియన్ ఆర్ట్ మోడల్‌ను నిర్మించాలనే ఆకాంక్షలో భాగంగా ఠాగూర్ తరువాత జపనీస్ కళాకారులతో సంబంధాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాడు. భారత్ మాత చిత్రాల ద్వారా అబనీంద్రనాథ్ దేశభక్తి నమూనాను స్థాపించాడు. బెంగాల్ స్కూల్‌కు చెందిన కొందరు ప్రముఖ చిత్రకారులు, కళాకారులలో నందలాల్ బోస్, ఎం.ఎ.ఆర్ చుగ్తాయ్, సునయని దేవి (అబనీంద్రనాథ్ ఠాగూర్ సోదరి), మనీషి దే, ముకుల్ దే, కాళీపద ఘోషల్, అసిత్ కుమార్ హల్దార్, సుధీర్ ఖస్తగిర్, క్షితీంద్రనాథ్ మజుందార్, సుఘ్రా రబాబీ ఉన్నారు.[5] 1920లలో ఆధునికవాద భావాల వ్యాప్తితో భారతదేశంలో బెంగాల్ స్కూల్ ప్రభావం తగ్గింది. 2012 నాటికి పండితులు, కళాభిమానులలో బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ పట్ల ఆసక్తి పెరిగింది.[6]
బిమల్ సిల్ అబనీంద్రనాథ్ ఠాగూర్ సమకాలికుడు. అతను వాటర్ కలర్స్‌లో చిత్రాలు గీశాడు. అతని చిత్రలేఖనాలు ప్రైవేట్ సేకరణలలో మాత్రమే కనిపిస్తాయి.
వారసత్వం
[మార్చు]ఇరవయ్యవ శతాబ్దపు మొదటి భాగంలో ఉద్భవించిన బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ భారతీయ కళా ప్రపంచంలో గణనీయమైన వారసత్వాన్ని సృష్టించింది.[7] భారతదేశ సాంస్కృతిక ముఖచిత్రంపై దాని లోతైన ప్రభావం, ఆధునిక భారతీయ కళ గమనాన్ని రూపొందించడంలో దాని పాత్రను తక్కువ అంచనా వేయలేము. అబనీంద్రనాథ్ ఠాగూర్, నందలాల్ బోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి ప్రముఖ కళాకారుల నేతృత్వంలో సాంప్రదాయ భారతీయ కళా పద్ధతులను పునరుద్ధరించడానికి, ఒక ప్రత్యేకమైన జాతీయ గుర్తింపును ఏర్పరచుకోవడానికి ప్రయత్నించిన శక్తివంతమైన ఉద్యమంగా బెంగాల్ స్కూల్ ఆవిర్భవించింది. అయినప్పటికీ, "అబనీంద్రనాథ్ చిత్రలేఖనాలలో, రవీంద్రనాథ్ ఆలోచనలలో ఒక ప్రత్యేకమైన జాతీయవాద భావన ఉన్నప్పటికీ ఆ భావాల ప్రధాన కేంద్రంలో ప్రత్యక్ష రాజకీయ ఘర్షణ పట్ల ఎల్లప్పుడూ విముఖత ఉండేది".[7] ఈ శైలికి చెందిన కళాకారులలో అమిత్ సర్కార్, అజోయ్ ఘోష్, శంకర్లాల్ ఐచ్, అమల్ చక్లాదర్, నరేంద్ర చంద్ర దే సర్కార్, సుక్తి శుభ్ర ప్రధాన్, రతన్ ఆచార్య ఉన్నారు. నేటి బెంగాల్‌కు చెందిన అత్యంత ప్రసిద్ధ కళాకారులలో జోగెన్ చౌదరి, మృణాల్ కాంతి దాస్, గోపాల్ సన్యాల్, గణేష్ పైన్, మనీషి దే, షాను లాహిరి, గణేష్ హాలోయ్[8] జహర్ దాస్‌గుప్తా, సమీర్ ఐచ్, బికాష్ భట్టాచార్జీ, మణీంద్ర భూషణ్ గుప్తా, సుదీప్ రాయ్, రామానంద బందోపాధ్యాయ, దేబజ్యోతి రాయ్ ఉన్నారు.
ఆర్. శివకుమార్ అభిప్రాయభేదం
[మార్చు]80వ దశకం ప్రారంభం నుండి శాంతినికేతన్ మాస్టర్స్ పనితీరును, కళ పట్ల వారి విధానాన్ని అధ్యయనం చేస్తున్న ఆర్. శివకుమార్... నందలాల్ బోస్, అబనీంద్రనాథ్ ఠాగూర్, రామ్ కింకర్ బైజ్, బెనోద్ బిహారీ ముఖర్జీలను బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ కింద చేర్చే పద్ధతిని ఖండించాడు. శివకుమార్ ప్రకారం, 'ప్రారంభ రచయితలు వారి శైలులు, ప్రపంచ దృక్పథాలు, కళా అభ్యాసంపై దృక్కోణాల కంటే అప్రెంటిస్‌షిప్ వంశవృక్షాల ద్వారా మార్గనిర్దేశం చేయబడటం వల్ల ఇలా జరిగింది'.[9]
ఈ విషయంపై అతని ఆలోచనలు శాంతినికేతన్: ద మేకింగ్ ఆఫ్ ఎ కాంటెక్స్ట్వల్ మోడర్నిజం ప్రదర్శన కాటలాగ్ వ్యాసంలో రూపొందించబడ్డాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- కాంటెక్స్ట్వల్ మోడర్నిజం
- ఆధునిక భారతీయ చిత్రకళ
- ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూప్
- తంజావూరు చిత్రకళ
- రాజపుత్ర చిత్రకళ
- మధుబని చిత్రకళ
మూలాలు
[మార్చు]- ↑ Mitter, Partha (1994). "How the past was salvaged by Swadeshi artists". Art and nationalism in colonial India, 1850-1922: occidental orientations. Cambridge, UK: Cambridge University Press. pp. 267–306. ISBN 978-0-521-44354-8. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 March 2012.
- ↑ Onians, John (2004). Atlas of world art. London: Laurence King Publishing. p. 304. ISBN 978-1-85669-377-6. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 March 2012.
- ↑ Mitter, Partha (2001). Indian art. Oxford University Press. p. 177. ISBN 0-19-284221-8.
Ernest Binfield Havell education.
- ↑ Cotter, Holland (August 19, 2008). "Art Review: Indian Modernism via an Eclectic and Elusive Artist". New York Times.
- ↑ "Showcase - Bengal School". National Gallery of Modern Art.
- ↑ Ghose, Archana Khare (12 February 2012). "For many art lovers, it's back to the old school". The Times of India. New Delhi. ఒరిజినల్ నుండి 8 May 2013 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 March 2012.
- 1 2 Cohen, Jasmin (2012). "Nationalism and Painting in Colonial Bengal". Unpublished Paper – via SIT Digital Collections.
- ↑ "Shanu Lahiri dead". The Telegraph (Calcutta). the original నుండి February 7, 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: March 15, 2013.
- ↑ "Humanities underground » All the Shared Experiences of the Lived World II".
మరింత చదవడానికి
[మార్చు]- Bagchi, Jasodhara. (1990). Representing Nationalism: Ideology of Motherhood in Colonial Bengal. Economic and Political Weekly, 25(42/43), WS65–WS71. JSTOR 4396894
- Eaton, Natasha. (2013). “Swadeshi” Color: Artistic Production and Indian Nationalism, ca. 1905–ca. 1947. The Art Bulletin, 95(4), 623–641. JSTOR 43188857
- Havell, E. B. (1920). A Handbook of Indian Art. John Murray, London.
- Jamal, Osman (1997). E B Havell: The art and politics of Indianness. Third Text, 11(39), 3–19. doi:10.1080/09528829708576669
- John Onians (2004). "Bengal School". Atlas of World Art. Laurence King Publishing. p. 304. ISBN 1856693775.
- Kossak, Steven (1997). Indian court painting, 16th-19th century. New York: The Metropolitan Museum of Art. ISBN 0870997831. (see index: p.148-152)
- Sircar, Sanjay. (1998). Shashthi’s Land: Folk Nursery Rhyme in Abanindranath Tagore’s “The Condensed-Milk Doll.” Asian Folklore Studies, 57(1), 25–49. https://doi.org/10.2307/1178995
- Thakurta, Tapati Guha. (1991). Women as “Calendar Art” Icons: Emergence of Pictorial Stereotype in Colonial India. Economic and Political Weekly, 26(43), WS91–WS99. JSTOR 4398221
- Wong, A. Y. (2009). "6. Landscapes Of Nandalal Bose (1882–1966): Japanism, Nationalism And Populism In Modern India". In Okakura Tenshin and Pan-Asianism. Leiden, The Netherlands: Brill. doi: https://doi.org/10.1163/ej.9781905246618.i-176.19