Jump to content

బంగ్లా భాష

వికీపీడియా నుండి
(బెంగాళీ నుండి దారిమార్పు చెందింది)
బెంగాలీ
বাংলা baṅgla
మాట్లాడే దేశాలు: బంగ్లాదేశ్, భారతదేశం తదితర 
ప్రాంతం: తూర్పు దక్షిణ ఆసియా
మాట్లాడేవారి సంఖ్య: 23 కోట్లు (18.9 కోట్లు మాతృభాషగా) 
ర్యాంకు: 6,[1] 5,[2]
భాషా కుటుంబము: Indo-European
 ఇండో-ఇరానియన్
  ఇండో-ఆర్యన్
   తూర్పు వర్గము
    బెంగాలీ-అస్సామీ
     బెంగాలీ 
వ్రాసే పద్ధతి: బెంగాలీ లిపి 
అధికారిక స్థాయి
అధికార భాష: బంగ్లాదేశ్ బంగ్లాదేశ్,
 భారతదేశం (పశ్చిమ బెంగాల్ , త్రిపుర)
నియంత్రణ: బాంగ్లా అకాడమీ (బాంగ్లాదేశ్)
పశ్చిమ్‌బంగ బాంగ్లా అకాడమీ (పశ్చిమ బెంగాల్)
భాషా సంజ్ఞలు
ISO 639-1: bn
ISO 639-2: ben
ISO 639-3: ben 
బెంగాలీ యొక్క ప్రపంచ విస్తృతి.
Indic script
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...

బంగ్లా లేదా బెంగాలీ భారత ఉపఖండములోని తూర్పు భాగమునకు చెందిన ఒక ఇండో-ఆర్యన్ భాష. బంగ్లా మాగధీ పాకృతం, పాలీ, సంస్కృతముల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి, స్థాయి ఉన్నాయి.

బెంగాలీని స్థానికంగా దక్షిణ ఆసియాలోని తూర్పు ప్రాంతమైన బెంగాల్లో మాట్లాడుతారు (ప్రస్తుత బంగ్లాదేశ్, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. 23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. (ప్రపంచ భాషలలో 5వ[2] లేదా 6వ[1] స్థానములో ఉన్నది). బంగ్లాదేశ్ లో బంగ్లా ప్రాథమిక భాష, భారతదేశములో అత్యంత విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.[3][4]. అస్సామీతో పాటు బెంగాలీ, ఇండో-ఇరానియన్ భాషలలో భౌగోళికముగా అత్యంత తూర్పునకు వ్యాపించి ఉన్న భాష.

1400 సంవత్సరంలో వెండి నాణేలపై ముద్రించిన బెంగాలీ భాష

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Languages spoken by more than 10 million people". Encarta Encyclopedia. Archived from the original on 2007-12-03. Retrieved 2007-03-03.
  2. 2.0 2.1 "Statistical Summaries". Ethnologue. Retrieved 2007-03-03.
  3. Gordon, Raymond G., Jr. (2005). "Languages of India". Ethnologue: Languages of the World, Fifteenth edition. SIL International. Retrieved 2006-11-17.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  4. "Languages in Descending Order of Strength - India, States and Union Territories - 1991 Census" (PDF). Census Data Online. Office of the Registrar General, India. p. 1. Archived from the original (PDF) on 2007-06-14. Retrieved 2006-11-19.