బెండకాయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెండకాయ (Lady Finger)
బెండకాయ మొక్క, కాయ, లేత పిందెలు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
esculentus
Binomial name
Abelmoschus esculentus
బెండకాయలు

అమెరికా ఖండమందలి ఉష్ణ ప్రదేశములు బెండకు (Okra, Lady Finger) జన్మ స్థానము అని ఒక అభిప్రాయం ఉంది. గోగు, ప్రత్తి, మందార, గంగరావి, మొదలగు పెక్కు జాతులును బెండయు జేరి బెండ కుటుంబముగా వ్యవహరింపబడును. బెండ వార్షిక కూరగాయ పంట. ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనిని పండిస్తారు. లేత బెండకాయలను కూరగా వండుతారు. బెండకాయల్లో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలతోపాటు అయోడిన్‌ ఎక్కువగా ఉన్నందువల్ల గాయిటర్‌ వ్యాధి రాకుండా చేస్తుంది. బెండకాయలను కూరగాయగా, సలాడ్‌గా ఎండబెట్టి వరుగులను తయారుచేయడంలో వాడతారు. వీటి కాండాన్ని కాగితపు పరిశ్రమలో, నారతీయటానికి ఉపయోగిస్తారు. బెండకాయలను క్యానింగ్‌ చేసి, ఎండబెట్టిన వాటిని ఎత్తయిన ప్రాంతాల్లో వున్న సైనికులకు అవి దొరకని కాలంలో కూడా ఎగుమతి చేస్తారు. తాజా బెండకాయలకు గల్ఫ్‌ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. బెండను భారతదేశంలో వ్యాపార సరళిలో గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పండిస్తున్నారు. 2007 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 21,569 హెక్టార్లలో సాగువుతూ 1.72 లక్షల టన్నుల దిగుబడి లభిస్తోంది. సగటు దిగుబడి హెక్టారుకు 8 టన్నులు. బెండను చలికాలం తప్ప సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. వేడి వాతావరణం ఈ పంటకు అనుకూలం.

చెట్టు భౌతికముగా[మార్చు]

బెండ మొక్క సామాన్యముగా 1 నుండి రెండు మీటర్లు ఎత్తు పెరుగును. అనుకూల పరిస్థితులలో నాలుగు మీటర్లల వరకూ పెరుగును. మొక్క యందలి లేత భాగములందు బిరుసుగా ఉండు నూగు ఉండును. పై అంచులయందు తాళ పత్ర వైఖరి చీలి సంయుక్తమౌగా ఉండును. అండాశయము ఐదు అరలు కలిగి ఉండును. కీలము కొన ఐదుగా చీలి నిడివిగ ఉండును. కాయము ఐదు గదులు కలిగి ఉండును. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వరుస గింజలు ఉండును. ఎండిన వెనుక కాయ పై నుండి క్రిందికి క్రమముగా ఐదు (అప్పుడప్పుడూ 10) భాగములుగ పగులు ఉండును. గింజలు చిన్న కందిగింజలంతేసి యుండును. గ్రామునకు 12 15 తూగును. నీలి వర్ణముతో కూడిన ధూమ్రవర్ణము కలిగి బొడ్డు వద్ద మాత్రము తెల్లగ ఉండును.

అనువైన వాతావరణం[మార్చు]

చల్లటి వాతావరణంలో పంట సరిగా రాదు. పగటి ఉష్ణోగ్రత 25-40 డిగ్రీల సెం.గ్రే. రాత్రి 22 డిగ్రీల సెం.గ్రే. ఉంటే మొక్క పెరుగుదల బాగుంటుంది. 40 డిగ్రీల సెం.గ్రే. కన్నా ఎక్కువైతే పిందె కట్టడం తగ్గి పూత రాలి, దిగుబడులు తగ్గిపోతాయి. అందువల్ల ఈ పంట వర్షాకాలం, వేసవిలో పండించటానికి అనువైనది.

బెండకాయలు/పాకాల సంతలో తీసిన చిత్రము

నేలలు[మార్చు]

సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల తేలికపాటి నల్లరేగడి నేలలు, గరుప నేలలు బెండ సాగుకు అనుకూలం. గుల్లగా ఉండే సారవంతమైన ఒండ్రు నేలల్లో అధిక దిగుబడి వస్తుంది. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.8 వరకు ఉండాలి.

పంటకాలం[మార్చు]

ఖరీఫ్‌ పంటను జూన్‌-జులై (వర్షాధారపు పంట) మాసాల్లోను, వేసవి పంటగా ఫిబ్రవరి - మార్చి మాసాల్లోనూ విత్తుకోవాలి. వర్షాకాలంలో ఆలస్యంగా (ఆగస్టులో) విత్తుకుంటే మొక్కలు సరిగా పెరగవు. బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. వేసవిలో ఆలస్యంగా పంట విత్తితే మొక్క పెరుగుదల తగ్గి, పల్లాకు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది.

పోషక పదార్థాలు[మార్చు]

Okra
Nutritional value per 100 g (3.5 oz)
శక్తి145 kJ (35 kcal)
7.6 g
పీచు పదార్థం3.2 g
0.1 g
2.0 g
విటమిన్లు Quantity
%DV
ఫోలేట్ (B9)
22%
87.8 μg
విటమిన్ సి
25%
21 mg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
8%
75 mg
మెగ్నీషియం
16%
57 mg

Vitamin A (660 IU)
Percentages are roughly approximated using US recommendations for adults.

బెండకాయలో 90 శాతం నీరు, 6.4 శాతం పిండి పదార్థాలు, 1.9 శాతం మాంసకృత్తులు, 0.2 శాతం కొవ్వుపదార్థాలు, 1.2 శాతం పీచు, 0.7 శాతం ఖనిజలవణాలు ఉండి, 33 కిలో కేలరీలు శక్తిని ఇస్తాయి. 66 మి.గ్రా. సున్నం, 56 మి.గ్రా. భాస్వరం, 0.30 మి.గ్రా. ఇనుము ఉన్నాయి. కెరోటిన్‌ 52 మైక్రోగ్రాములు, 0.07 మి.గ్రా. థయమిన్‌, 0.1 మి.గ్రా. రైబోఫ్లేవిన్‌, 0.6 మి.గ్రా. నియసిన్‌, పోలిక్‌ ఆమ్లం 105 మైక్రో గ్రాములు, 'సి' విటమిను 13 మి.గ్రా.లు ఉన్నాయి. ఇవేగాక సూక్ష్మధాతువులైన మెగ్నీషియం (53 మి.గ్రా.), సోడియం (6.9 మి.గ్రా.), పొటాషియం (103 మి.గ్రా.), రాగి (113 మి.గ్రా.), మాంగనీస్‌ (149 మి.గ్రా.), జింక్‌ (417 మి.గ్రా.) లాంటి సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి.

బెండకాయ ఆరోగ్యకర ఉపయోగాలు[మార్చు]

బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్ధము కడుపులో మంటనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు, విటమిన్‌ ' సి ' దీనిలో చాలా ఎక్కువ . మ్యూకస్ పదార్ధము గాస్ట్రిక్ సమస్యలను, ఎసిడిటీకి చక్కని పరిష్కారము . దీనిలోగల డయూరిటిక్ లక్షణాలవల్ల యూరినరీ ట్రాక్ట్ ఇంఫెక్షన్‌ను నయము చేయడములో సహకరిస్తుంది. బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరము తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారేక తాగితే టెంపరేచర్ తగ్గును . చెక్కెర (డయాబిటీస్ ) నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది. బెండకాయ నిలువుగా చీల్చి రెండు సగాల్ని గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి, మరునాటి ఉదయము ముక్కలు తీసివేసి ఆ నీటిని త్రాగాలి. ఇలా రెండు వారాలు పాటు త్రాగితే సుగర్ స్థాయిలు తగ్గుతాయి. దీనిలో ఉండే పెక్టిన్‌ .. బ్లడ్ కొలెస్టిరాల్ ను తగ్గించును. బెండకాయ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.

రకాలు[మార్చు]

సాధారణ రకాలు[మార్చు]

బెండలో హైబ్రిడ్‌ (సంకర) రకాలకు దీటుగా సాధారణ రకాలు దిగుబడినిస్తాయి.

  • పూసా సవాన
  • పూసా ముఖమలి
  • పంజాబ్‌ పద్మిన
  • అర్క అనామిక
  • అర్క అభయ
  • కో-1
  • ఎం.డి.యు-1
  • గుజరాత్‌ బెండ-1
  • హర్భజన్‌
  • పర్భని క్రాంతి
  • పి-7
  • పి-8

సంకరజాతి రకాలు[మార్చు]

శంఖు రోగాన్ని తట్టుకునే రకాలు
  • వర
  • విజయ
  • విశాల్
  • నాథ్‌శోభ
  • ప్రియ
  • సుప్రియ
  • మహికో హైబ్రిడ్‌ నెం. 1, 6, 7, 8
మిగిలిన రకాలు
  • ఐశ్వర్య మిస్టిక
  • ఎస్‌-008
  • ఎస్‌-040
  • ఎస్‌-073

ఎగుమతి రకాలు[మార్చు]

ఎగుమతికి కాయలు లేతగా, ఆకుపచ్చగా 6-8 సెం.మీ. పొడవుతో ఉండాలి.

  • పంజాబ్‌ పద్మిని
  • వర్ష
  • విశాల్‌
  • నాథ్‌శోభ

ఉప జాతులు[మార్చు]

  • పెద్ద బెండ - ఇది చాల చోట్ల సాగునందున్న రకము. మొక్క పెద్దదిగా పెదురుగున్‌. కాపు ప్రారంభించుట కొంచెము ఆలస్యము. కాయ పలుకలు తీరి లేబసిమి వర్ణము కలిగి 12 - 18 సెంమీ పొడవుండును.
  • ఏడాకుల బెండ
  • నున్న బెండ
  • పొడుగు బెండ
  • ఎర్ర బెండ

చీడపీడలు[మార్చు]

బెండకాయల పంటను వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించుకోవాలి.

పురుగులు
తెగుళ్ళు

వంటలు[మార్చు]

బెండకాయలు
బెండకాయ కాయలుతో వేపుడు
బెండకాయ కాయలుతో వేపుడు

బెండ పైత్యాన్ని తగ్గిస్తుందని, వాతాన్ని నివారిస్తుందని, వీర్య వృద్ధిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. బెండకాయలో జిగురు ఉండటంవల్ల విరివిగా అన్ని వంటలలో వీటిని వాడటం కుదరకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో బెండకాయను చాలా ఎక్కువగా వంటలలో వాడతారు.

  1. బెండకాయ వేపుడు
  2. బెండకాయ కుర్మా
  3. బెండకాయ కూరు
  4. బెండకాయ పచ్చడి
  5. బెండకాయ ఒరుగులు
  6. బెండకాయల సాంబారు
  7. బెండకాయ పులుసు
  8. బెండకాయ కూర

సామెతలు[మార్చు]

  • బెండకాయలు ముదిరినా బ్రహ్మచారులు ముదిరినా ఎందుకు పనికిరారు అని సామెత.

సూచన[మార్చు]

  • ముదిరిన బెండకాయలు చివర్లు వంచితే త్వరగా పుటుక్కున తెగవు, అవి వేలాడబడతాయి, చివర్లు పుటుక్కున విరుగుతే అదే లేత బెండకాయలు .

Lady's finger - Abelmoschus esculentus, N.O. Malvaceae

తమిళము వెండై; కన్నడము బెండె; మలయాళము వెండ; హింది ఖిండీ, ఖేండా, ఓక్రా; సంస్కృతము చతుష్పద.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=బెండకాయ&oldid=4055647" నుండి వెలికితీశారు