బెండ్ ఇట్ లైక్ బెక్హాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Bend It Like Beckham
దస్త్రం:Bend It Like Beckham movie.jpg
దర్శకత్వంGurinder Chadha
నిర్మాతGurinder Chadha
Deepak Nayar
రచనGurinder Chadha
Guljit Bindra
Paul Mayeda Berges
నటులుAnupam Kher
Parminder Nagra
Keira Knightley
Jonathan Rhys Meyers
వ్యాఖ్యానంCharlotte Hill
సంగీతంCraig Pruess
ఛాయాగ్రహణంJong Lin
కూర్పుJustin Krish
నిర్మాణ సంస్థ
పంపిణీదారుFox Searchlight Pictures
విడుదల
11 April 2002 (U.K.) 1 August 2003 (U.S.)
నిడివి
112 minutes
దేశంమూస:FilmUK
భాషEnglish, Punjabi, German, Hindi
ఖర్చు£6 million
బాక్సాఫీసు£50 million

బెండ్ ఇట్ లైక్ బెక్హాం అనేది 2002లో వచ్చిన ఉత్సాహ భరితమైన చిత్రం, మొదట యునైటెడ్ కింగ్డమ్‌లో విడుదలైన ఈ చిత్రంలో పర్మిందర్ నగ్రా, కైరా నైట్లీ మరియు ఆర్చీ పంజాబీ నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం గురిందర్ చడ్డా చేశారు. ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్హాం మరియు ఫ్రీ కిక్కుల నుండి గోడ వలే ఉండే డిఫెండర్ల మీదుగా బంతిని "వంచి" (మలుపు తిప్పి) గోలు చేసే అతని ప్రావీణ్యం మీద ఈ చిత్రం పేరు పెట్టబడింది.

ఇతివృత్తం[మార్చు]

లండన్‌లో నివసిస్తూ హీత్రూ విమానాశ్రయం వద్ద పనిచేస్తున్న పంజాబీ సిక్కుల వారి కుమార్తె 18-ఏళ్ళ జెస్మిందర్ "జెస్" భమ్రా (పర్మిందర్ నగ్రా). జూలియట్ "జూల్స్" పాక్స్టన్ (కైరా నైట్లీ) ఆంగ్ల దంపతుల కుమార్తె. జెస్ ఫుట్‌బాల్ మీద తీవ్రమైన మోహాన్ని కలిగి ఉంటుంది, కానీ ఆమె స్త్రీ కావటం వలన ఆమె తల్లితండ్రులు ఆమెను ఆడడానికి అనుమతించరు. అయినప్పటికీ ఆమె కొన్నిసార్లు పార్కులో అనేక మంది మగపిల్లలతో మరియు ఆమె మంచి స్నేహితుడు స్వలింగ సంపర్కానికి చేరువలో ఉన్నవాడు టోనీతో ఆడేది. జూల్స్, జెస్ యొక్క క్రీడా నైపుణ్యాన్ని కనుగొన్న తరువాత, స్థానిక జట్టు హౌన్స్‌లో హారియర్స్‌లో స్థానం కొరకు ప్రయత్నించమని ఆమె జెస్‌ను ఆహ్వానిస్తుంది, దీనికి శిక్షకుడు జో (జోనథన్ రైస్ మేయర్స్). నూతన క్రీడాకారిణి జట్టులో చేరటం గురించి అతను సందేహాస్పదంగా ఉంటాడు, కానీ ఆమె ప్రవీణ్యాన్ని గ్రహించిన తరువాత మరియు ఆమె జూల్స్‌తో చాలా బాగా కలిసి పోవటం వలన అతను ఆమెకు జట్టులో స్థానాన్ని అందిస్తాడు. జెస్ ఆమె తల్లితండ్రులు ఈ నిర్ణయాన్ని ఆమోదించారని జోకు అబద్ధం చెపుతుంది.

జెస్ ఒక రకమైన ఆకర్షణను జో మీద పెంచుకుంటుంది, మరియు జట్టు హాంబర్గ్‌కు పర్యటించినప్పుడు జెస్ మరియు జోల సంబంధం బలపడుతుంది; పర్యటనలో చివరి రాత్రి వారిరువురూ ముద్దు పెట్టుకునే సమయంలో జూల్స్ రాక వారికి అవాంతరం అవుతుంది, జూల్స్ కూడా జో మీద ప్రేమను కలిగి ఉండటం వలన, జెస్ మరియు జూల్స్ స్నేహం చెడుతుంది. జెస్ స్నేహాన్ని పునరుద్ధరించుకోవటానికి జూల్స్ ఇంటికి వెళ్ళినప్పుడు, Mrs. పాక్స్టన్ తప్పుగా ఈ విషయాన్ని గ్రహించి జెస్ మరియు జూల్స్ స్త్రీ స్వలింగ సంపర్క సంబంధంలో ఉన్నట్టుగా భావిస్తుంది.

జెస్' తల్లితండ్రులు ఆమె ఆడుతున్న విషయం తెలుసుకుని, మరింత కఠినంగా మారుతారు. ఆమె ఆటలకు హాజరుకాకుండా చేస్తారు. వారి పెద్ద కుమార్తె పింకీ వివాహం యొక్క విస్తృతమైన ఏర్పాట్లలో భమ్రా పెద్దలు వ్యాకులతలో ఉన్నారు.

జెస్ మరియు జూల్స్ యొక్క ప్రావీణ్యం వల్ల, లీగ్ పోటీ యొక్క చివరి ఆటకు హారియర్స్ చేరతారు. దురదృష్టవశాత్తు, పింకీ పెళ్ళి రోజునే ఫైనల్ మ్యాచ్ నిర్వహించవలసి వస్తుంది. జెస్ ఆడడానికి అనుమతించమని జో Mr. భమ్రాను వేడుకుంటాడు, కానీ అతను తిరస్కరిస్తాడు. అతని జాతి కారణంగా అతనిని క్రికెట్ క్లబ్ నుండి తొలగించినప్పుడు అతను పడిన బాధ జెస్ అనుభవించరాదని అతను అనుకుంటాడు.

జెస్ అంతిమ ఆటలో ఆడదని జో అంగీకరిస్తాడు మరియు ఆమె లేకుండానే ఆట ఆరంభమవుతుంది. పింకీ యొక్క వివాహ సంబరాలు సగం అయిన తరువాత, జెస్‌ను ఆటకు అనుమతించమని టోనీ Mr. భమ్రాను ఒప్పిస్తాడు. జెస్‌ను ఆట జరిగే ప్రాంతానికి టోనీ తీసుకువెళతాడు, అరగంట సమయం మిగిలి ఉండగా అక్కడ హారియర్స్ 1-0 స్కోరుతో పోరాడుతూ ఉంటారు.

జెస్ మరియు జూల్స్ స్కోరును సమానం చేస్తారు, మరియు జెస్‌కు ఫ్రీ కిక్ ఇచ్చినప్పుడు, ఆట గెలవటానికి ఆమె దడిలాగా ఉన్న ఆటగాళ్ళ చుట్టూ బంతిని తిప్పవలసి ఉంది. ఆమె దానిని సాధిస్తుంది, మరియు హౌన్‌స్లో పోటీలో నెగ్గుతుంది. కాలిఫోర్నియాలోని సాంటా క్లారా విశ్వవిద్యాలయంలో ఫుట్‌బాల్ విద్యార్థి వేతనాన్ని జెస్ మరియు జూల్స్ పొందుతారు. జూల్స్ వెంటనే ఆమె తల్లితండ్రులకు చెపుతుంది, కానీ జెస్‌కు చెప్పటం సమస్యగా ఉంటుంది.

జూల్స్ సంబరాన్ని జెస్‌తో పంచుకోవాలని అనుకోవటంతో, జూల్స్ మరియు Mrs. పాక్స్టన్ వివాహం జరిగే ప్రాంతానికి వస్తారు, మరియు జెస్‌ను వంచకురాలిగా మరియు స్త్రీ స్వలింగ సంపర్కరాలుగా Mrs. పాక్స్టన్ నిందిస్తుంది. జూల్స్ ఆమె తల్లిని లాక్కొని సిగ్గుతో అక్కడ నుండి వెడలిపోతుంది.

జెస్ ఇంకనూ ఆమె విద్యార్థి వేతనం గురించి తన తల్లితండ్రులకు చెప్పదు, అందుచే ఆమె ఏ కళాశాలకు వెళ్ళాలను కుంటుందో దానికి వెళుతుందనే నియమం మీద తాను జెస్‌తో నిశ్చితార్థానికి ఒప్పుకుంటానని టోనీ భమ్రా కుటుంబానికి అబద్ధాలు చెపుతాడు. జెస్ అబద్ధాలను బట్టబయలు చేస్తుంది, ఆమెను ఆటకు అనుమతించినందుకు భర్తను Mrs. భమ్రా నిందిస్తుంది మరియు ఆమెను పంపటానికి తిరస్కరిస్తుంది. Mr. భమ్రా జెస్‌ను పంపటానికి అనుమతించమని Mrs. భమ్రాతో మాట్లాడతాడు.

జెస్ ఫుట్‌బాల్ మైదానానికి పరిగెత్తుకు వస్తుంది మరియు జో‌కు తన తల్లితండ్రుల నిర్ణయం చెపుతుంది. వారిరువురూ ముద్దు పెట్టుకోవటానికి దగ్గరవుతారు, కానీ జెస్ తనని తాను వెనక్కు తీసుకొంటుంది, ఆమె తల్లితండ్రులు దీనిని ఒప్పుకోరని అయిననూ వారు ఎంతో ఔదార్యంతో తనను ఆడటానికి అమెరికా వెళ్ళనిస్తున్నారని, వారు ఇంకొక సంప్రదాయ ప్రతికూల నిర్ణయాన్ని తట్టుకోలేరని చెపుతుంది.

జెస్ మరియు జూల్స్ ప్రయాణం రోజున, Mrs. పాక్స్టన్ ఆమె కుమార్తెకు ఫుట్‌బాల్ జెర్సీను అందించి ఆమెకు విజయం కలగాలని అభినందనలు తెలుపుతుంది. వారిరువురూ విమానంలోకి ఎక్కపోతున్న సమయంలో జో అక్కడకు వస్తాడు మరియు అతనికి జెస్ మీద ఉన్న ప్రేమను తెలియచేస్తాడు. వారిరువురూ ముద్దు పెట్టకుంటారు మరియు క్రిస్మస్ కొరకు వచ్చినప్పడు వారి సంబంధం (మరియు ఆమె తల్లితండ్రుల) గురించి మాట్లాడటానికి జెస్ అంగీకరిస్తుంది.

జెస్ మరియు జూల్స్ వారి తల్లితండ్రులకు జట్టు చిత్రాన్ని పంపుతారు, మరియు పింకీ గర్భవతిగా తెలియచేయబడుతుంది. Mr. భమ్రా క్రికెట్ ప్రాక్టీసును జో సహాయంతో చేస్తూ ఉంటారు.

తారాగణం[మార్చు]

 • జెస్మిందర్ కౌర్ "జెస్" భమ్రా పాత్రలో పర్మిందర్ నగ్రా
 • జూలియట్ "జూల్స్" పాక్స్టన్ పాత్రలో కైరా నైట్లీ నటించారు
 • జెస్ తండ్రి వలే అనుపమ్‌ఖేర్ నటించారు
 • జెస్" తల్లిపాత్రలో షహీన్ ఖాన్ నటించారు
 • జో వలే జోనథన్ రైస్ మేయర్స్ నటించారు
 • "పింకీ" భమ్రా పాత్రలో ఆర్చీ పంజాబీ నటించారు
 • పౌలా పాక్స్టన్ పాత్రలో జూలియట్ స్టీవెన్సన్ నటించారు
 • టోనీ వలే అమీత్ చనా నటించారు
 • మీనా పాత్రను పూజా షా పోషించారు
 • మోనికా వలే ప్రీయా కాళిదాస్ నటించారు
 • టాజ్ వలే ట్రే ఫార్లె నటించారు
 • సోనీ పాత్రలో సరాజ్ చౌదరీ నటించారు
 • బబ్లీ పాత్రలో పావేన్ విర్క్ నటించారు
 • (గుర్తింపు పొందని) వైయిటర్ పాత్రలో నితిన్ సత్యా నటించారు

ఆదరణ[మార్చు]

విమర్శకుల ఆదరణ[మార్చు]

ఈ చిత్రం విమర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది మరియు చాలా వరకూ అనుకూలమైన సమీక్షలను పొందింది. లాస్ ఏంజిల్స్ టైమ్స్ యొక్క కెన్నెత్ టురాన్ ఈ చిత్రాన్ని సూచిస్తూ "పూర్తి స్థాయి మృదువైన హాస్యాన్ని కలిగి ఉంది, సంస్కృతిని సన్నిహితంగా తెలుసుకొని ఉండటం వలన దానిలో దాగి ఉన్న నైతిక విలులను అర్థం చేసుకుంటూ దాని గురించి వినోదాన్ని పొందిన ఫలితంగా సాంఘిక పరిసరాల యొక్క తప్పుపట్టలేని భావనను అందించింది" అని తెలిపారు.[1] టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంటూ బెండ్ ఇట్ "నిజానికి నియమాలను, సాంఘిక స్థితి మరియు జీవితాలను మలుపు తిప్పటం – అవన్నీ చివరకు బెక్హాం లాగా వంగి బంతిని గోల్ చేయబడుతుంది [...] ముగింపులో బ్రిటన్ మారుతున్నట్టు చూపబడింది, కానీ అది ఇంకనూ మారలేదు. సౌత్‌హాల్ వద్ద ఉన్న కొన్ని పబ్బులలో చడ్డా తండ్రికి పింట్ ఇవ్వటాన్ని తిరస్కరించబడిన నాటినుండి వెల్లడి చేయని విషయం అనేక మైళ్ళు ప్రయాణించింది, బహు-జాతులు ఉన్న బ్రిటన్‌లో సరిగ్గా కలపని కూరలో పేరుకుపోయిన మసాలా ముద్దల వలే, వివక్షత ఉన్నవి రుచిని పాడుచేస్తాయి."[2] ప్లానెట్ బాలీవుడ్ ఈ చిత్రానికి 10కి 9ని ఇచ్చింది మరియు పేర్కొంటూ "స్ర్కీన్‌ప్లే జెస్ వ్యక్తిగా సాధించిన అభివృద్ధినే కాకుండా, NRI యుక్త వయసులలో మారుతున్న సంస్కృతి మరియు విలువలకు అద్దం పట్టారు: భారతీయ గృహిణిగా ఉన్న సాంఘిక కట్టుబాటును అతిక్రమించాలనే జెస్' కోరిక, ఆమె సోదరి (ఆర్చీ పంజాబీ) యొక్క శృంగారపరమైన చురుకుగా ఉన్న సంబంధం, మరియు స్వలింగ సంపర్కుడిగా ఉన్న భారతీయుడు [టోనీ పాత్రను అమీత్ చనా పోషించారు] ఇందులో ఉన్నాయి."[3] ది హిందూ వాదిస్తూ, "అనుకూలమైన భావాలు, వాస్తవికతకు దగ్గరగా మరియు ఉత్సాహకరంగా ఒకవేళ ఏదైనా చిత్రం ఉందంటే అది ఖచ్చితంగా గురిందర్ చడ్డా దర్శకత్వం వహించిన డ్రీం ప్రొడక్షన్ ఇటీవల చేసిన చిత్రం [...] మృదువైన భావోద్వేగాలతో, విలువలు, అభిప్రాయాలు మరియు ఆట గురించి ఉన్న ప్రేమ నుండి విషయాన్ని దూరంగా తీసుకువెళ్ళకుండా, ఒప్పించటానికి మరియు నిజాయితీగా ఉండటానికి మార్గాలు ఉన్నాయని ఈ చిత్రం నిరూపిస్తుంది."[4] BBC 5 స్టార్లకు 4ను అందించింది మరియు వాదిస్తూ "ఇంత గొప్ప చిత్రానికి అతని పేరును పెట్టినందుకు Mr. బెక్హాం గర్వంగా భావించాలి."[5] సమీక్షలను సమష్టిగా పరిశీలించే రాటెన్ టమేటాస్ బెండ్ ఇట్ లైక్ బెక్హాంకు 147 సమీక్షల మీద ఆధారపడి (125 ఫ్రెష్ మరియు 22 రాటెన్) 85% రేటింగ్‌ను అందించింది.[6]

పురస్కారాలు మరియు ప్రతిపాదనలు[మార్చు]

ప్రతిపాదనలు[మార్చు]

 • 2006 బిల్లీ అవార్డ్ - ఎంటర్టైన్మెంట్ (ఉత్తమ చిత్రం)
 • 2004 రైటర్స్ గిల్ద్ అఫ్ అమెరికా అవార్డ్ - ఉత్తమ స్క్రీన్ప్లే
 • 2003 బ్రిటిష్ అకాడెమి అఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ - ఉత్తమ చిత్రం
 • 2003 గోల్డెన్ గ్లోబ్ ఫర్ బెస్ట్ ఫిలిం - సంగీతం లేక హాస్య

విజయాలు[మార్చు]

2004 ప్యోంగ్ యాంగ్ ఫిలిం ఫెస్టివల్
సంగీత బహుమతి
2002 బ్రిటిష్ కామెడీ అవార్డ్స్
ఉత్తమ హాస్య చిత్రం
2003 ESPY అవార్డ్స్
బెస్ట్ స్పోర్ట్స్ మూవీ ESPY అవార్డ్
[122] ^ GLAAD మీడియా అవార్డ్స్
అద్భుతమైన సినిమా విస్తృత విడుదల
2002 లొకార్నో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్
ఆడియెన్స్ అవార్డ్ - గురిన్డర్ చాద
2002 లండన్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్
బ్రిటిష్ బెస్ట్ న్యూకామర్ - కైరా నైట్లే
2002 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ మర్రకెక్
స్పెషల్ జ్యూరి అవార్డ్ - గురిన్డర్ చాద
2003 నేషనల్ బోర్డ్ అఫ్ రివ్యు అఫ్ మోషన్ పిక్చర్స్
ప్రత్యేక గుర్తింపు
2002 సిడ్నీ ఫిలిం ఫెస్టివల్
PRIX UIP- గురిన్డర్ చాద
2003 ది కామెడీ ఫెస్టివల్
ఫిలిం డిస్కవరీ జ్యూరి అవార్డ్ - గురిన్డర్ చాద

సౌండ్‌ట్రాక్[మార్చు]

Music From the Motion Picture Bend It Like Beckham
Soundtrack album by Various artists
Released2002
GenreBhangra
Pop
LabelMilan Entertainment (US)
Cube Records (UK)

UK సౌండ్ ట్రాక్ ఫీచర్స్ యొక్క విడుదల భాంగ్ర సంగీతం, స్పైస్ గాళ్స్ చే పాటలు' విక్టోరియ బెక్హం (జ్యుల్స్ మదర్ ఉన్న సన్నివేసం దగ్గర ఈ యొక్క "IOU" పాట వినవచ్చు కానీ అసలైన సౌండ్ ట్రాక్ లో అది కలపలేదు) మరియు మెలనీ C (మెలనీ C పాట "ఐ టర్న్ టు యు" చిత్రంలో వాడబడినది కానీ సౌండ్ ట్రాక్ లో జతచేయబడలేదు) మరియు టెక్షాస్ బ్యాండ్. "బాడేస్ట్ రాఫ్ఫెస్ట్" బాక్యార్డ్ డాగ్ చే, ది అరియా నేస్సున్ దోర్మ, పుస్సిని టురండోట్ నుండి, మరియు డాన్స్ బ్యాండ్ బసేమేంట్ జాక్ష్క్ష నిష్ణాతుల నుండి. US విడుదలలో కొన్ని ట్రాక్లను మార్చి మరికొన్ని వాటిని తీసివేసినది.

UK ట్రాక్ జాబితాలు
 1. క్రైగ్ ప్రుఎస్స్ & బల్లి సాగూ ఫీట్. గుంజన్ - "టైటిల్స్"
 2. బ్లోన్దీ - "అటామిక్ "
 3. బాక్యార్డ్ డాగ్ - "బడేస్ట్ రఫ్ఫెస్ట్"
 4. B21 - "దర్షన్"
 5. (చిత్ర సంభాషణ) - "ఇట్స్ బెకంస్ కార్నర్"
 6. విక్టోరియా బెక్హం - "ఐ విష్"
 7. (చిత్ర సంభాషణ) - "లార్న్ టు కుక్ దాల్"
 8. మాల్కిత్ సింగ్ - "జింద్ మాహి"
 9. నుస్రత్ ఫతే అలీ ఖాన్ - "తేరే బిన్ నహి లగడ"
 10. బల్లి సాగూ ఫీట్ గుంజన్ - "నూరీ"
 11. (చిత్ర సంభాషణ) - "జ్యుసి జ్యుసి మాంగోస్"
 12. బేస్మెంట్ జాక్ష్క్ష - "డు యువర్ థింగ్"
 13. (చిత్ర సంభాషణ) - "ఐస్ డౌన్"
 14. టెక్షాస్ - "ఇన్నర్ స్మైల్"
 15. మెలానీ C - "ఇండిపెన్డేన్స్ డే"
 16. (చిత్ర సంభాషణ) - "కాంట్ మేక్ రౌండ్ చపాతీస్"
 17. హన్స్ రాజ్ హన్స్ - "పున్జబియాన్ ది షాన్"
 18. గుంజన్ - "కిన్న సోహన"
 19. టిటు బెల్ట్రాన్ - "నేస్సున్ దోర్మ"
 20. (చిత్ర సంభాషణ) - "ది ఆఫ్ సైడ్ రూల్ ఈస్"
 21. బిన మిస్ట్రి - "హాట్ హాట్ హాట్ "
 22. క్రైగ్ ప్రుఎస్స్ & బల్లి సాగూ ఫీట్. గుంజన్ - "హై రబ

!"

US ట్రాక్ జాబితాలు
 1. క్రైగ్ ప్రుఎస్స్ & బల్లి సాగూ ఫీట్. గుంజన్ - "టైటిల్స్"
  • (చిత్ర సంభాషణ) - "ఇట్స్ బెకంస్ కార్నర్"
 2. టెక్షాస్ - "ఇన్నర్ స్మైల్"
 3. మల్కిత్ సింగ్ - "జింద్ మాహి"
 4. బల్లి సాగూ ఫీట్ గుంజన్ - "నూరీ"
  • (చిత్ర సంభాషణ) - "లార్న్ టు కుక్ దాల్"
 5. విక్టోరియా బెక్హం - "ఐ విష్"
  • (చిత్ర సంభాషణ) - "జ్యుసి జ్యుసి మాంగోస్"
 6. గుంజన్ - "కిన్న సోహన"
 7. పార్టనర్స్ ఇన్ రైం (తారాగణం నుస్రత్ ఫతే అలీ ఖాన్) - "తేరే బిన్ నహి లగడ"
  • (చిత్ర సంభాషణ) - "కాంట్ మేక్ రౌండ్ చపాతీస్"
 8. మెలానీ C - "ఇండిపెన్డేన్స్ డే"
 9. B21 - "దర్షన్"
  • (చిత్ర సంభాషణ) - "ఐస్ డౌన్"
 10. బిన మిస్ట్రి - "హాట్ హాట్ హాట్"
 11. బ్లోన్దీ - "అటామిక్"
 12. క్రైగ్ ప్రుఎస్స్ & బల్లి సాగూ ఫీట్. గుంజన్ - "హై రబ

!"

 1. టిటు బెల్ట్రాన్ - "నేస్సున్ దోర్మ"

సూచనలు[మార్చు]

మూస:Portalbox

గమనికలు[మార్చు]

 1. LA టైమ్స్ రివ్యు
 2. టైమ్స్ అఫ్ ఇండియా రివ్యు
 3. ప్లానెట్ బాలీవుడ్ రివ్యు
 4. ది హిందూ రివ్యు
 5. BBC రివ్యు
 6. "Bend It Like Beckham". Rotten Tomatoes. Retrieved 2010-10-05. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:Women's football మూస:Gurinder Chadha మూస:CinemaoftheUK