బెజవాడ పాపిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెజవాడ పాపిరెడ్డి (జనవరి 5, 1927 - జనవరి 7, 2002) సోషలిస్టు నాయకుడు, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్ అనుచరుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. వీరు ప్రముఖ రాజకీయ నాయకులు బెజవాడ రామచంద్రారెడ్డి కుమారుడు.

జననం[మార్చు]

పాపిరెడ్డి 1927, జనవరి 5[1] నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా ఆయన పనిచేశారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆయన 1983లో ఆ పార్టీలో చేరారు. ఆయన 1983 నుంచి 1985 వరకు తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1958 నుంచి 1962 వరకు శాసనమండలి సభ్యుడిగా, 1967 నుంచి 1972 వరకు అల్లూరు శాసనసభ్యుడిగా, 1972 నుంచి 1978 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఈ మూడింటిని కూడా ఆయన ఇండిపెండెంట్‌గానే దక్కించుకున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున అల్లూరు నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందిన పాపిరెడ్డి పార్టీ ఆదేశానుసారం 1984లో ఒంగోలు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.

మరణం[మార్చు]

బెజవాడ పాపిరెడ్డి ఆయన తన 75 ఏట కొద్దికాలము పాటు అస్వస్థత గురై 2002, జనవరి 7హైదరాబాదులో కన్నుమూశారు.[2]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2007-08-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-07-24. Cite web requires |website= (help)
  2. http://pib.nic.in/archieve/lreleng/lyr2002/rjan2002/08012002/r0801200212.html