బెట్టింగ్ బంగార్రాజు
బెట్టింగ్ బంగార్రాజు | |
---|---|
దర్శకత్వం | ఇ. సత్తిబాబు |
రచన | గంధం నాగరాజు (మాటలు) |
నిర్మాత | రామోజీ రావు |
తారాగణం | అల్లరి నరేష్, నిధి, కోట శ్రీనివాసరావు |
ఛాయాగ్రహణం | కరుణ మూర్తి |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | శేఖర్ చంద్ర |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 9, 2010 |
భాష | తెలుగు |
బెట్టింగ్ బంగార్రాజు ఇ. సత్తిబాబు దర్శకత్వంలో 2010లో విడుదలైన హాస్యచిత్రం. ఇందులో అల్లరి నరేష్, నిధి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించాడు.[1] శేఖర్ చంద్ర ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చాడు. గౌతంరాజు కూర్పు బాధ్యతలు నిర్వహించగా కరుణ మూర్తి కెమెరామెన్ గా పని చేశాడు.
కథ
[మార్చు]బంగార్రాజు పందేలకు పేరుపొందిన వాడు. ఏ పందెం వేసినా అతని అదృష్టం బాగుంటుంది. బంగార్రాజుకు ఊర్లో మంచి పేరు లేకపోయినా అతని తండ్రిని మాత్రం అందరూ గౌరవిస్తుంటారు. పల్లెటూర్లో ఉంటే అతన్ని అందరూ ఎగతాళి చేస్తున్నారని, పిల్లను ఎవరూ ఇవ్వడం లేదని పట్నం వెళతాడు. అక్కడ ఇద్దరూ ముగ్గురు అమ్మాయిలను చూసి బోర్లా పడ్డాక, దివ్య అనే అమ్మాయిని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమెను పెళ్ళి చేసుకోవడానికి ఇదివరకే ముగ్గురు రేసులో ఉంటారు. దివ్య నలుగురినీ తమ ఊరికి తీసుకెళ్ళి ఒక వారం రోజులలోపు తన కుటుంబాన్ని మెప్పించిన వారినే పెళ్ళి చేసుకుంటానని చెబుతుంది. బంగార్రాజు తన తెలివి తేటలు ఉపయోగించి దివ్య కుటుంబాన్ని ఎలా మెప్పించాడన్నది మిగతా కథ.
తారాగణం
[మార్చు]- బంగార్రాజుగా అల్లరి నరేష్
- దివ్యగా నిధి
- కోట శ్రీనివాసరావు
- రఘుబాబు
- అమిత్ తివారీ
- సామ్రాట్
- శ్రీ అక్షయ్
- పిల్ల ప్రసాద్
- విజయ్ సాయి
- కృష్ణభగవాన్
- ఎల్. బి. శ్రీరామ్
- సురేఖ వాణి
- చలపతిరావు
- సన
- కల్యాణి
సాంకేతిక సిబ్బంది
[మార్చు]- దర్శకత్వం: సత్తిబాబు
- మాటలు: గంధం నాగరాజు
- సంగీతం: శేఖర్ చంద్ర
- కెమెరా: కరుణ మూర్తి
- కూర్పు: గౌతంరాజు