Jump to content

బెట్సీ రస్సెల్

వికీపీడియా నుండి
బెట్సీ రస్సెల్
2007లో బెట్సీ రస్సెల్
జననంఎలిజబెత్ రస్సెల్
(1963-09-06) 1963 సెప్టెంబరు 6 (వయసు: 63)
శాన్ డియాగో, కాలిఫోర్నియా, యు.ఎస్.
విద్యమిషన్ బే హై స్కూల్
విశ్వవిద్యాలయాలుశాంటా మోనికా విశ్వవిద్యాలయం
వృత్తి
  • నటి
  • నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1982–ప్రస్తుతం
భార్య / భర్త
విన్సెంట్ వాన్ పాటెన్
(m. 1989; div. 2001)
పిల్లలు2
బంధువులుమాక్స్ లెర్నర్ (తాతయ్య)
తండ్రిరిచర్డ్ రస్సెల్
సంతకం

బెట్సీ రస్సెల్ (ఆంగ్లం: Betsy Russell; జననం ఎలిజబెత్ రస్సెల్, 1963 సెప్టెంబరు 6) ఒక అమెరికన్ నటి. ఆమె ప్రైవేట్ స్కూల్ (1983), టోంబోయ్ (1985) లలో తన పాత్రలకు, 2006 నుండి 2010 వరకు సా ఫిల్మ్ సిరీస్లోని ప్రాధమిక పాత్రలలో ఒకటైన జిల్ టక్ పాత్రలకు ప్రసిద్ధి చెందింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

బెట్సీ రస్సెల్ 1963 సెప్టెంబరు 6న కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో కాన్స్టాన్స్, స్టాక్ విశ్లేషకుడు రిచర్డ్ లయన్ రస్సెల్ దంపతుల కుమార్తెగా జన్మించింది.[1][2] ఆమె పాత్రికేయుడు, విద్యావేత్త మాక్స్ లెర్నర్ మనుమరాలు. ఆమె తండ్రి, తాత యూదులు.[2] ఆమె మిషన్ బే హైస్కూల్లో చదివి 1981లో పట్టభద్రురాలైంది.[3] ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు, ఆమె స్థానికంగా రికార్డు చేయబడిన పెప్సి వాణిజ్య ప్రకటనలో కనిపించింది.[4]

కెరీర్

[మార్చు]

బెట్సీ రస్సెల్ మొదటి పాత్ర 1982లో వచ్చిన లెట్స్ డూ ఇట్! చిత్రంలో ఉంది. అదే సంవత్సరం, ఆమె టి. జె. హుకర్, ఫ్యామిలీ టైస్, ది పవర్స్ ఆఫ్ మాథ్యూ స్టార్ లలో నటించింది.[5] 1983లో, సెక్స్ కామెడీ ప్రైవేట్ స్కూల్లో జోర్డాన్ లే-జెన్సన్ పాత్రకు ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నది. యాక్షన్ చిత్రం అవెంజిలింగ్ ఏంజెల్ చిత్రీకరణ సమయంలో, 1985 చిత్రం సిల్వరాడో కోసం ఆడిషన్ కు ఆమె ప్రతిపాదించబడింది, కానీ దానిని తిరస్కరించింది.

ఆమె 1980లలో కామెడీ టోంబోయ్, స్లాషర్ చిత్రం చీర్లీడర్ క్యాంప్ సహా బి చిత్రాల శ్రేణిలో నటించింది. ఆమె ది ఎ-టీమ్, మర్డర్, షీ రైట్, 1స్ట్ & టెన్ వంటి టీవీ సిరీస్లలోనూ కనిపించింది.

ఆమె సా 3D, సా IV, సా V, సా VI సీక్వెల్స్ లలో నటించింది.[6] ఆమె 2010 చిత్రం చైన్ లెటర్, సైఫై చిత్రం మాండ్రేక్, మై ట్రిప్ బ్యాక్ టు ది డార్క్ సైడ్ లో ఒక పాత్రను పోషించింది.[7][8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆగష్టు 1988లో, బెట్సీ రస్సెల్ నటుడు విన్సెంట్ వాన్ ప్యాటెన్ నిశ్చితార్థం చేసుకున్నది, తొమ్మిది నెలల తరువాత, 1989 మే 27న ఉత్తర హాలీవుడ్ లో వివాహం చేసుకున్నారు.[9] వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ఆ జంట 2001లో విడాకులు తీసుకున్నది.[10][11] ఆమె గతంలో చిత్ర నిర్మాత మార్క్ బర్గ్ తో నిశ్చితార్థం చేసుకున్నది.[12] 2010 నాటికి , ఆమె కాలిఫోర్నియాలోని మాలిబులో నివసించింది. ఆమె శాంటా మోనికా విశ్వవిద్యాలయంలో ఆధ్యాత్మిక మనస్తత్వశాస్త్రంలో మాస్టర్స్ ప్రోగ్రామ్ ను పూర్తి చేసింది. ఆమె హిప్నోటిస్ట్, లైఫ్ కోచ్ కూడా.[11][13]

మూలాలు

[మార్చు]
  1. Rose, Mike (September 6, 2022). "Today's famous birthdays list for September 6, 2022 includes celebrities Idris Elba, Macy Gray". Cleveland.com. Retrieved February 22, 2023.
  2. 1 2 "Marriage In April For Miss. C. Lerner; Columnist's Daughter Engaged to Richard Russell, Former Air Force Bombardier". The New York Times. February 15, 1953. Retrieved October 30, 2010.
  3. "MBHS Taroga 1981". Mission Bay Senior High School. 1981. p. 198. Archived from the original on February 23, 2023. Retrieved 2023-02-23.
  4. "Betsy Russell". Haute Living. 2012-07-28. Retrieved 2023-02-23.
  5. "Let's Do It". Rotten Tomatoes. Retrieved 2023-02-23.
  6. Topel, Fred (October 26, 2007). "Betsy Russell on Saw IV". CraveOnline. Archived from the original on March 10, 2008. Retrieved May 31, 2008.
  7. Miska, Brad (November 8, 2009). "AFM '09: New Films Acquires 'Chain Letter', New Trailer". Bloody Disgusting. The Collective. Retrieved December 23, 2010.
  8. Seidman, Robert (August 30, 2010). "Syfy Original Movie 'Mandrake' Premieres Saturday, September 11 at 9pm". TV by the Numbers. Archived from the original on July 11, 2011. Retrieved December 23, 2010.
  9. . "Hollywood Freeway - Tears and Cheers for 'Phantom'".
  10. Noor, Star (November 2010). "Betsy Russell on MF Magazine". Music Fashion Magazine. Retrieved December 22, 2010.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  11. 1 2 Bryant, Jessica (August 26, 2010). "Haute Secrets Los Angeles: Betsy Russell". Haute Living Magazine. Archived from the original on February 23, 2023. Retrieved December 22, 2010.
  12. Bowles, Duncan (November 9, 2009). "Interview with Saw actress Betsy Russell". Den of Geek. Archived from the original on February 23, 2023. Retrieved December 22, 2010.
  13. Aushenker, Michael (October 13, 2010). "Malibu's queen of Halloween". The Malibu Times. Archived from the original on January 25, 2018. Retrieved December 23, 2010.