బెరీలియం హైడ్రాక్సైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెరీలియం హైడ్రాక్సైడ్
పేర్లు
IUPAC నామము
Beryllium hydroxide
ఇతర పేర్లు
Hydrated beryllia
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [13327-32-7]
పబ్ కెమ్ 25879
యూరోపియన్ కమిషన్ సంఖ్య 236-368-6
వైద్య విషయ శీర్షిక Beryllium+hydroxide
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:35102
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య DS3150000
SMILES O[Be]O
జి.మెలిన్ సూచిక 1024
ధర్మములు
BeH2O2
మోలార్ ద్రవ్యరాశి 43.03 g·mol−1
స్వరూపం Vivid white, opaque crystals
సాంద్రత 1.92 g cm−3[1]
ద్రవీభవన స్థానం 1,000 °C (1,830 °F; 1,270 K) (decomposes)
slightly soluble
నిర్మాణం
Linear
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-904 kJ mol−1[2]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
47 J·mol−1·K−1[2]
విశిష్టోష్ణ సామర్థ్యం, C 1.443 J K−1
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Carcinogenic
Lethal dose or concentration (LD, LC):
4 mg kg−1 (intravenous, rat)
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 0.002 mg/m3
C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be)
REL (Recommended)
Ca C 0.0005 mg/m3 (as Be)
IDLH (Immediate danger)
Ca [4 mg/m3 (as Be)]
సంబంధిత సమ్మేళనాలు
సంబంధిత సమ్మేళనాలు
Aluminium oxide

Magnesium hydroxide

Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

బెరీలియం హైడ్రాక్సైడ్ ఒక అకర్బన రసాయన సంయోగపదార్ధం. బెరీలియం, హైడ్రాక్సైడ్ సంయోగం వలన ఈ రసాయన సంయోగపదార్ధం ఏర్పడినది.ఇది బెరీలియం, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాల సమ్మేళనఫలితంగా ఏర్పడిన సంయోగపదార్ధం. బెరీలియం హైడ్రాక్సైడ్ ఒక ద్విశ్వభావయుత (amphoteric) హైడ్రాక్సైడ్ అనగా ఇది ఆమ్లాలలో, క్షారాలలో కరుగును.

బెరీలియం ఖనిజాలైన బెరిల్ (beryl), బెట్రాండైట్ (bertrandite) లనుండి బెరీలియం లోహాన్ని తయారు చేయునపుడు బెరీలియం హైడ్రాక్సైడ్ ఉపఉత్పత్తిగా లభిస్తున్నది. బెరిలీయం లవణద్రవణాలకు క్షారాలను చేర్చిన α-రూపం (జెల్) ఏర్పడును. ఇలా ఏర్పడిన పదార్థాన్ని అలాగే ఉంచిన లేదా మరిగించిన రోమ్బిక్ β-రూపం అవక్షేపంగా ఏర్పడును బెరీలియం హైడ్రాక్సైడ్ యొక్క అణుసౌష్టవం చతుస్కోణ బెరిలీయం కేంద్రాలను కలిగి జింక్ హైడ్రాక్సైడ్ అణుసౌష్టవ పోలిక కలిగి ఉంది. బెరీలియం హైడ్రాక్సైడ్ రసాయన సంకేతపదంBe (OH) 2

భౌతిక ధర్మాలు

[మార్చు]

బెరీలియం హైడ్రాక్సైడ్ తెల్లని స్పటికపదార్ధం.బెరీలియం హైడ్రాక్సైడ్ అణుభారం 43.03 గ్రాములు/మోల్.సాధారణ గది ఉష్ణోగ్రత,25°C వద్ద బెరీలియం హైడ్రాక్సైడ్ సాంద్రత 1.92 గ్రాములు/సెం.మీ3.బెరీలియం హైడ్రాక్సైడ్ బాష్పీభవన స్థానం 1,000 °C (1,830 °F; 1,270 K, కాని ఈ ఉష్ణోగ్రత వద్ద ఇది వియోగం చెందును. నీటిలో స్వల్పంగా కరుగును.

రసాయన చర్యలు

[మార్చు]

క్షారాలలో బెరీలియం హైడ్రాక్సైడ్ కరగడం వలన టెట్రాహైడ్రాక్సీడోబెరిలేట్ (2-) అనయాన్ ఏర్పడును.సోడియం హైడ్రాక్సైడ్ తో చర్యఫలితం:

2NaOH(aq) + Be(OH)2(s) → Na2Be(OH)4(aq)

ఆమ్లాలలో బెరీలియం హైడ్రాక్సైడ్ ను కరిగించిన బెరిలీయం లవణాలు ఏర్పడును.ఉదాహరణకు సల్ఫ్యూరిక్ ఆమ్లంతో బెరీలియం సల్ఫేట్ ఏర్పడును.

Be(OH)2 + H2SO4 → BeSO4 + 2H2O

400°C వద్ద బెరీలియం హైడ్రాక్సైడ్ నిర్జలీకరణ (dehydrate) చెందడం వలన కరుగు (soluble) గుణమున్న తెల్లని పొడి వంటి బెరిలీయం ఆక్సైడ్ ఏర్పడును.

Be(OH)2 → BeO + H2O

ఇలాఏర్పడిన ఈ రసాయనపదార్థాన్ని మరింత ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడిచేసిన కరుగని (insoluble) గుణమున్న బెరిలీయం ఆక్సైడ్ ఏర్పడును.

భద్రత

[మార్చు]

మిగతా బెరిలీయం సంయోగపదార్థాలవలె బెరీలియం హైడ్రాక్సైడ్ కూడా విషకారి.క్యాన్సర్ కారక గుణం కలిగిఉన్నది.

ఇవికూడాచూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. Pradyot Patnaik. Handbook of Inorganic Chemicals. McGraw-Hill, 2002, ISBN 0-07-049439-8
  2. 2.0 2.1 Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. ISBN 0-618-94690-X.