బెర్నార్డ్ షోల్ట్జ్
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | బెర్నార్డ్ మార్టినస్ షోల్ట్జ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1990 అక్టోబరు 3 కీట్‌మాన్‌షూప్, ఇకారాస్ ప్రాంతం, నమీబియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బంధువులు | నికోలస్ షోల్ట్జ్ (సోదరుడు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 22) | 2019 ఏఫ్రిల్ 27 - ఒమన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2025 సెప్టెంబరు 4 - స్కాట్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 9) | 2019 మే 20 - ఘనా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2025 అక్టోబరు 11 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2025 అక్టోబరు 12 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బెర్నార్డ్ మార్టినస్ స్కోల్ట్జ్ (జననం 1990 అక్టోబరు 3) నమీబియా క్రికెట్ ఆటగాడు. కీట్‌మన్‌షూప్‌లో జన్మించిన అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఎడమచేతి ఆర్థడాక్స్ బౌలరు. అతని కంటే నాలుగు సంవత్సరాలు పెద్దవాడైన అతని అన్న నికోలస్, 2004 నుండి ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు.
జీవిత చరిత్ర
[మార్చు]2008 లో మలేషియాలో జరిగిన అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో స్కోల్ట్జ్ నమీబియా అండర్-19 జాతీయ జట్టు తరపున ఆడాడు. ఈ పోటీలో అతను ఐదు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు, కానీ రెండు సార్లూ నాటౌట్‌గా నిలిచాడు.
స్కోల్ట్జ్ 2008 అక్టోబరులో నార్త్ వెస్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ రంగప్రవేశం చేశాడు. తన తొలి ఇన్నింగ్స్‌లో రెండో బంతికే డకౌట్ అయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన 2009 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో అతను నమీబియా తరఫున అతి పిన్న వయస్కుడైన ఆటగాడు. 2014-15లో బోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 116 పరుగులకు 8 వికెట్లు, 66 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు. [1] 2016 నవంబరులో, క్రికెట్ నమీబియా వారి వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో అతను ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. [2] 2018 జనవరిలో, అతను 2018 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ టూ టోర్నమెంట్ కోసం నమీబియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. [3]
2017–18 సన్‌ఫాయిల్ 3-డే కప్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో 35 వికెట్లు తీసుకుని, నమీబియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా నిలిచాడు, [4]
2018 ఆగస్టులో అతను 2018 ఆఫ్రికా T20 కప్ కోసం నమీబియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.[5] 2018 అక్టోబరులో, బోట్స్వానాలో జరిగిన 2018–19 ICC వరల్డ్ ట్వంటీ20 ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నమెంటు కోసం దక్షిణ ఉప ప్రాంత సమూహం తరఫున నమీబియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.[6]
2019 మార్చిలో అతను 2019 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ టూ టోర్నమెంట్ కోసం నమీబియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. [7] ఆ టోర్నమెంట్‌లో నమీబియా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచింది, తద్వారా వన్డే ఇంటర్నేషనల్ (ODI) హోదాను పొందింది. [8] 2019 ఏప్రిల్ 27 న ఒమన్‌తో జరిగిన టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్‌లో స్కోల్ట్జ్ నమీబియా తరపున వన్డేల్లోకి ప్రవేశించాడు.[9]
2019 మేలో, అతను ఉగాండాలో జరిగిన 2018–19 ICC T20 ప్రపంచ కప్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నమెంటు ప్రాంతీయ ఫైనల్స్ కోసం నమీబియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. [10] [11] 2019 మే 20 న ఘనాపై తన తొలి ట్వంటీ20 అంతర్జాతీయ ఆట ఆడాడు.[12]
2019 జూన్లో, 2019–20 అంతర్జాతీయ సీజన్‌కు ముందు క్రికెట్ నమీబియాకు చెందిన అత్యుత్తమ పురుషుల స్క్వాడ్‌కు ఎంపికైన ఇరవై ఐదు మంది క్రికెటర్లలో అతను ఒకడు. [13] [14] 2019 సెప్టెంబరులో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే 2019 ICC T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటు కోసం నమీబియా జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. [15]
2021 సెప్టెంబరులో, స్కోల్ట్జ్ 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం నమీబియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. [16] 2022 జూలైలో, 2019–2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 టోర్నమెంటు 14వ రౌండ్‌లో, స్కోల్ట్జ్ వన్‌డేల్లో తన తొలి ఐదు వికెట్ల ఘనతను సాధించాడు.[17]
2024 మేలో, అతను 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంటు కోసం నమీబియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.[18]
మూలాలు
[మార్చు]- ↑ "Boland v Namibia 2014-15". Cricinfo. Retrieved 22 February 2015.
- ↑ "Cricket Namibia Awards 2016". Cricket Namibia. Archived from the original on 20 December 2016. Retrieved 13 December 2016.
- ↑ "Six teams vying for the final two spots in ICC Cricket World Cup Qualifier 2018". International Cricket Council. Retrieved 29 January 2018.
- ↑ "Sunfoil 3-Day Cup, 2017/18 Namibia: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 13 April 2018.
- ↑ "Cricket Namibia to compete in T20 Africa Cup". The Namibian. Retrieved 24 August 2018.
- ↑ "Boland v Namibia 2014-15". Cricinfo. Retrieved 22 February 2015.
- ↑ "Boland v Namibia 2014-15". Cricinfo. Retrieved 22 February 2015.
- ↑ "Boland v Namibia 2014-15". Cricinfo. Retrieved 22 February 2015.
- ↑ "Final, ICC World Cricket League Division Two at Windhoek, Apr 27 2019". ESPN Cricinfo. Retrieved 27 April 2019.
- ↑ "Boland v Namibia 2014-15". Cricinfo. Retrieved 22 February 2015.
- ↑ "Boland v Namibia 2014-15". Cricinfo. Retrieved 22 February 2015.
- ↑ "Boland v Namibia 2014-15". Cricinfo. Retrieved 22 February 2015.
- ↑ "Boland v Namibia 2014-15". Cricinfo. Retrieved 22 February 2015.
- ↑ "Boland v Namibia 2014-15". Cricinfo. Retrieved 22 February 2015.
- ↑ "Boland v Namibia 2014-15". Cricinfo. Retrieved 22 February 2015.
- ↑ "Boland v Namibia 2014-15". Cricinfo. Retrieved 22 February 2015.
- ↑ "Boland v Namibia 2014-15". Cricinfo. Retrieved 22 February 2015.
- ↑ "Boland v Namibia 2014-15". Cricinfo. Retrieved 22 February 2015.