బెర్లిన్ గోడ
బెర్లిన్ గోడ (Berlin Wall) జర్మనీ రాజధాని బెర్లిన్లో ప్రసిద్ధిగాంచిన గోడ. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు, పశ్చిమ జర్మనీలను వేరుచేస్తూ నిర్మించబడింది. దీనిని ఐరన్ కర్టన్ అని కూడా పిలుస్తారు. యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత అమెరికా, రష్యాలు దాన్ని రెండు భాగాలు చేశాయి. రష్యా ఆధిపత్యంలో తూర్పు జర్మనీ, అమెరికా ఆధిపత్యంలో పశ్చిమ జర్మనీ ఉండేవి. రెండింటికీ అడ్డుగా ఈ గోడ నిర్మాణం ఆగష్టు 13, 1961 ప్రారంభమైనది. జర్మనీలు రెండు విలీనం కావడం వలన 1989లో దీనిని కూల్చారు.[1]
ఈ మధ్యకాలంలో ఇంచుమించు 136 మంది గోడను దాటడానికి ప్రయత్నించి మరణించారు.[2] వీరిలో ఎక్కువమంది తూర్పు జర్మనీ ప్రభుత్వ రక్షకులచే కాల్చిచంపబడ్డారు.
జర్మనీ దేశాలు రెండూ ఏకమైతున్నాయని తీర్మానించిన రోజు 1989 నవంబరు 9, ఒక పండుగ రోజులాగా జరుపుకున్నారు. తరువాతి కాలంలో ఈ గోడను నెమ్మదిగా చిన్న చిన్న భాగాలు ప్రజలే తొలగించడం మొదలుపెట్టారు. మిగిలిన భాగాన్ని ప్రభుత్వ యంత్రాంగం తొలగించింది.
బెర్లిన్ గోడ తొలగింపుతో జర్ననీ విలీనం 1990 అక్టోబరు 3 లో పూర్తయింది.