బెలగాం భీమేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెలగాం భీమేశ్వరరావు తెలుగులో బాల సాహిత్య రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు. భీమేశ్వరరావు రచించిన తాత మాట వరాల మూట కథల సంపుటికి 2019 లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాల సాహిత్య పురస్కారం లభించింది.[1]

జీవిత విశేషాలు[మార్చు]

భీమేశ్వరరావు 1952లో విజయనగరం జిల్లా, పార్వతీపురంలో బెలగాం గంగారామ్‌, రాజేశ్వరి దంపతులకు జన్మించాడు. [2] తెలుగు సాహిత్యంలో పోస్టు గ్రాడ్యుయేషను చేసాడు. పురపాలక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేసి రిటైరయ్యాడు. 2002 ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్నాడు.[3]

ఆయన రచనల్లో కొన్ని[మార్చు]

 • అజేయుడు[4]
 • అదే సమస్య
 • అన్యాయమేనా
 • అన్యాయమేనా
 • అవసరం
 • అసలు నకిలీ
 • ఆదరణ
 • ఎర
 • ఎర్రజీరలు
 • ఒక అసమర్థుని కథ
 • తాత మాట వరాల మూట - బాలల కథల సంపుటి
 • పనసపళ్ళు - బాల గేయాల సంపుటి

పురస్కారాలు[మార్చు]

సాహితీ రంగంలో చేసిన కృషికి గాను భీమేశ్వరరావు అనేక పురస్కారలు పొందాడు. వాటిలో కొన్ని:

 • 1992లో బొబ్బిలికి చెందిన విజ్ఞాన వివర్థిని సంస్థ బాల సాహిత్యానికి పురస్కారం.
 • 2002లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.
 • 2004లో ఎమ్మెస్కో - ఆంధ్రజ్యోతి సంయుక్త పురస్కారం.
 • 2015లో 'శ్రీమతి మంచిపల్లి సత్యవతి' స్మారక ఉగాది బాలసాహితీ పురస్కారం.
 • 2015లో తెలుగు రక్షణ వేదిక 'బాలసాహిత్య భూషణ' బిరుదు
 • 2015లో డా|| ఎన్‌.మంగాదేవి బాలసాహిత్య పురస్కారం
 • 2017లో రావూరి భరద్వాజ కళాపీఠం ద్వారా 'గంగిశెట్టి చిరంజీవి' బాలసాహిత్య పురస్కారం
 • 2017లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం
 • 2019 లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాల సాహిత్య పురస్కారం

మూలాలు[మార్చు]

 1. "Sahitya Akademi announces Bal Sahitya Puraskar and Yuva Puraskar 2019". pib.gov.in. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.
 2. "'తాతమాట' బాలసాహిత్యానికి 'వరాల మూట' | ప్రజాశక్తి::తెలుగు దినపత్రిక". www.prajasakti.com. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.
 3. Eenadu. "బడిపిల్లలే స్ఫూర్తిదాతలు - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.
 4. "కథానిలయం - View Writer". kathanilayam.com. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.