బెల్లంకొండ నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెల్లంకొండ నాగేశ్వరరావు తెలుగు కథా రచయిత.

జీవిత విషయాలు[మార్చు]

1954 జూన్ 12 న గుంటూరులోని వెంకట సుబ్బమ్మ, రాఘవయ్య దంపతులకు జన్మించిన నాగేశ్వరరావు, ప్రాథమిక స్థాయి పూర్తి కాకుండానే బడి వదిలేశారు. తర్వాత ఓ సైకిల్ షాపులో పనికి కుదిరారు. ఆ తర్వాత పెద్దబాల శిక్ష చదువుతూ భాష పై పట్టు సంపాదించుకున్నారు. తెన్నేటి సూరి చంఘిజ్ ఖాన్, రాహుల్‌ సాంకృత్యాయన్‌ ‘ఓల్గా నుంచి గంగకు’ నవలలు చదివాక ఆయనకు కూడా రాయాలనే కోరిక కలిగింది. ఈ క్రమంలో 1976 లో ‘మన్ను తిన్న పాము’ పేరుతో తొలి అపరాధ పరిశోధక కథ రాశారు. తర్వాత ఎలక్ట్రీషియన్‌ వృత్తి నేర్చుకుని 28 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నారు. బెల్లంకొండ నాగేశ్వరరావు 16 ఏళ్ల కాలంలో 1930 దాకా రచనలు చేశారు.[1]

బాలసాహిత్యం వైపు అడుగులు[మార్చు]

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ ప్రోత్సాహంతో 2004లో బాల సాహిత్యంలోకి అడుగుపెట్టారు బెల్లంకొండ నాగేశ్వరరావు. ఆయన తొలి బాలల కథ ‘దోమల సంగీతం’ బుజ్జాయి మాసపత్రికలో ప్రచురితమైంది. బాలభారతం, బాలమిత్ర, శ్రీవాణి పలుకు, బాలబాట, బాలల బొమ్మరిల్లు, బాలల చంద్రప్రభ, విశాఖ సంస్కృతి, సాహిత్య కిరణం ఇలా అన్ని బాల సాహిత్య పత్రికల్లో ఆయన రచనలు వచ్చాయి. తెలుగు పలుకు (ఆస్ట్రేలియా), తెలుగు తల్లి (కెనడా), మొలక దిన పత్రిక (న్యూజిలాండ్‌) లాంటి విదేశీ పత్రికల్లో కూడా ఆయన రచనలు ప్రచురితమయ్యాయి. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బెల్లంకొండ వారి బాలసాహిత్యం మీద ఎంఫిల్‌ పరిశోధన జరిగింది. మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో ఆయన సాహిత్యం మీద ఓ విద్యార్థి పీహెచ్‌డీ చేస్తున్నారు.[2]

రచనలు[మార్చు]

  • వికటకవి కల్పిత కథలు
  • మనకీర్తి శిఖరాలు
  • కాకమ్మకథలు
  • చిట్టి చిలకమ్మ-అమ్మకొట్టిందా
  • బెల్లంకొండ చెప్పిన బాలల కథలు
  • గయ్యాళి గంగమ్మ - కోపిష్ఠి కోటయ్య
  • వందేమాతరం - దేశభక్తి బాలల నవల
  • మాతాత చెప్పిన మామంచి కథలు
  • భోజరాజు కథలు
  • భేతాళ కథలు
  • బామ్మ చెప్పిన బాలల కథలు

మూలాలు[మార్చు]

  1. "బెల్లంకొండ సాహిత్యంపై తెలుగు వెలుగు మాస పత్రికలో వ్యాసం". Archived from the original on 2021-05-09. Retrieved 2021-05-09.
  2. "గో తెలుగు వెబ్ పత్రికలో బెల్లంకొండ వారి భోజరాజు కథలు".

ఇతర లింకులు[మార్చు]