బెల్లంపల్లి పురపాలకసంఘం
Jump to navigation
Jump to search
బెల్లంపల్లి పురపాలక సంఘం, మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణానికి చెందిన పాలకసంస్థ. ఇది 1987లో ఏర్పడీంది.
చరిత్ర
[మార్చు]ప్రారంభంలో బెల్లంపల్లి గ్రామపంచాయతీగా కూడా లేదు.1983 వరకు బెల్లంపల్లి పట్టణ వాసులకు పాలకసంస్థలో ఓటుహక్కు కూడాలేదు. 1984లో ఈ పట్టణాన్ని సమీపంలో ఉన్న చంద్రవెల్లి పంచాయతీలో విలీనం చేశారు. 1987లో ఇది ప్రత్యేకంగా 28 వార్డులతో రెండో శ్రేణి పురపాలక సంఘంగా అవతరించింది. ఇడిగిరాల చంద్రశేఖర్ ఈ పురపాలక సంఘం తొలి చైర్మెన్‌గా పనిచేశారు.
ఎన్నికలు
[మార్చు]2005 సెప్టెంబరులో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.సూర్యనారాయణ చైర్మెన్‌గా, తెరాసకు చెందిన బి.జి.శంకర్ సింగ్ వైస్-చైర్మెన్‌గా ఎన్నికయ్యారు.[1] సెప్టెంబరు 2010 నుంచి ప్రత్యేక అధికారి పాలనలో ఉండగా 2014 మార్చి 30న మళ్ళీ ఎన్నికలు జరగనున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, తేది 01-10-2005