బెల్లంపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం
| శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం-బెల్లంపల్లి | |
|---|---|
| భౌగోళికాంశాలు : | 19°06′N 78°21′E / 19.10°N 78.35°E |
| పేరు | |
| ఇతర పేర్లు: | శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు |
| ప్రధాన పేరు : | శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా |
| దేవనాగరి : | श्री वासवि कन्याक परमेश्वरी देवी देवस्थान बेल्लमपल्लि तहसील, मच्चिरीयाल जिला, तेलंगाना। |
| ప్రదేశం | |
| దేశం: | భారతదేశం |
| రాష్ట్రం: | తెలంగాణ |
| జిల్లా: | మంచిర్యాల జిల్లా |
| ప్రదేశం: | బెల్లంపల్లి,మండల కేంద్రములో |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దేవత: | కన్యకా పరమేశ్వరి దేవి |
| ముఖ్య_ఉత్సవాలు: | దసరా, దీపావళి |
| నిర్మాణ శైలి, సంస్కృతి | |
| వాస్తు శిల్ప శైలి : | దక్షిణ భారతదేశం హిందూదేవాలయం |
| దేవాలయాలు మొత్తం సంఖ్య: | 03 |
| ఇతిహాసం | |
| నిర్మాణ తేదీ: | ప్రాచీన దేవాలయం |
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా ,బెల్లంపల్లి మండలంలోని బెల్లంపల్లి గ్రామంలో కొలువైన కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రతి సంవత్సరం దసరా, దీపావళి పండుగ సందర్భంగా ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుపుతారు[1].
చరిత్ర
[మార్చు]బెల్లంపల్లి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని 1998 లో భూమి పూజ చేశారు. నిర్మాణం పూర్తి అయిన తర్వాత 21 ఫిబ్రవరి 2000 లో ఆలయం యందు విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆలయాన్ని ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్మించారు.గత 24 సంవత్సరాల నుండి ఆలయంలో ధూపదీప నైవేద్యాలతో అమ్మవారు పూజలు అందుకుంటోంది.శ్రీ గరిమెళ్ళ వెంకట రమణ సిద్ధాంతిచే ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ఆలయంలో జిల్లాలోనే మహిమాన్విత గల ఆలయం కావడంతో మహిళ భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవం, తులసి కళ్యాణం,శివ పార్వతుల కల్యాణోత్సవం,మాతా జయంతి,వాసవి మాత ఆత్మార్పణ దీనం మొదలగు నిర్వహిస్తారు.
విశేషం
[మార్చు]ఈ బెల్లంపల్లి కన్యకా పరమేశ్వరి దేవి ఆర్యవైశ్య కుల దేవత కాబట్టి ఆర్యవైశ్య సిద్ధాంతం ప్రకారం పూజలు జరగడం విశేషం.
ఉత్సవాలు
[మార్చు]ఈ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం బెల్లంపల్లి, వాసవి మహిళా సంఘాల ఆధ్వర్యంలో దసరా , దీపావళి, కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు భక్తులు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు.అమ్మవారిని మొదటి మూడు రోజులు పార్వతిగా, తర్వాత మూడు రోజులు లక్ష్మిగా, చివరి మూడు రోజులు సరస్వతి గా పూజిస్తారు. అమ్మవారిని నవరాత్రులలో పూజిస్తే పది జన్మల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.ఐతే ఈ ఆలయంలో భక్తులు, పెద్దసంఖ్యలో హాజరై అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేయడం ఆనవాయితీ[2]. అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో మహిళలు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని కుంకుమ పూజ చేస్తారు. ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలు, దీపారాధన అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహిళలు కోలాటం, నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.పండితుల ఆధ్వర్యంలో చండీ యాగం, విశేష పూజలు, భక్తులచే భజన కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఉపాలయాలు
[మార్చు]ఈ కన్యాకా పరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో మూడు ఉపాలయాలు ఉన్నాయి. 1.శివాలయం,2. ఆంజనేయస్వామి ఆలయం, 3.లక్ష్మినారాయణ స్వామి ఆలయం ఉన్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో శివ పార్వతి దేవిల కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చాలా విశిష్టంగా జరుగుతాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Famous Temples List In Adilabad District | Telangana State". Hindu Temples Guide (in ఇంగ్లీష్). 2020-02-28. Retrieved 2025-01-22.
- ↑ Bharat, E. T. V. (2024-10-10). "ధనలక్ష్మీ అలంకరణలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు". ETV Bharat News. Retrieved 2025-01-22.