బేగం అక్తర్

వికీపీడియా నుండి
(బేగం అఖ్తర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బేగం అక్తర్
దస్త్రం:Begum Akhtar (1942).jpg
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఅక్తరీబాయి ఫైజాబాది
మూలంఫైజాబాద్, ఉత్తర ప్రదేశ్, భారత్
సంగీత శైలిగజల్, ఠుమ్రి, దాద్రా [1]
వృత్తిసంగీతకారుడు
క్రియాశీల కాలం1929 - 1974

బేగం అఖ్తర్ (1914 - 1974). అఖ్తరీబాయి ఫైజాబాదీ జననం అక్టోబర్ 7, 1914, ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ లో. ఆమె తొలి గురువులు ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్, మొహమ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ ఖాన్, ఉస్తాద్ ఝండే ఖాన్. ఆమె తన పదిహేనవ ఏటనే కచేరీలు ఇవ్వడం ప్రారంభించింది. ఆమె గజల్లు, దాద్రాలు, ఠుమ్రీలు ఎన్నో రికార్డుల రూపంలో విడుదలయ్యాయి. 1930లో ఆమె కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించింది. 1945లో బారిష్టర్ ఇస్తెయాఖ్‌ అహ్మద్ అబ్బాసీతో ఆమెకు వివాహం జరిగిన తరువాత బేగం అఖ్తర్‌గా మారింది ."దీవానా బనానా హైతో బనాదే’’ అనే గజల్‌ తో చాలా పేరు గాంచింది. పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్‌ అతా అహ్మద్‌ ఖాన్‌ దగ్గర, మరి కొన్నాళ్ళు ఉస్తాద్‌ అబ్దల్‌ వహీద్‌ ఖాన్‌ దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది.పెళ్ళి తరువాత మన రావు బాలసరస్వతిదేవి లాగానే ఆమె గానం ఆగిపోయింది. లక్నో రేడియో స్టేషన్‌కు ప్రొగ్రాం ప్రొడ్యూసర్‌ సునీల్‌ బోస్‌ జస్టిస్‌ మల్హోర్‌ తో కలసి బారిష్టర్‌ అబ్బాసీని ఒప్పించి బేగం సాహెబాతో పాడించాడు.బేగం అఖ్తర్ "గజల్ గాయని"గా పాడిన పాటలు దాదాపు 400 వరకు ఉంటాయి. 30 అక్టోబర్ 1974, ఆమె మరణించారు.

బేగం అక్తర్ కు ఆమె పూర్వీకుల ద్వారా అందిన ఇల్లు

ఆమె చివరి గజల్

పద్మశ్రీపురస్కారం
"సునాకరో మేరీ జాఁ ఉన్ సె ఉన్ కె అఫ్సానే, సబ్ అజ్ నబీ హైఁ యహాఁ కౌన్ కిస్కే పహచానే.

పురస్కారాలు

[మార్చు]

సూచికలు

[మార్చు]
  1. Dadra Thumri in Historical and Stylistic Perspectives, by Peter Lamarche Manuel, Peter Manuel. Published by Motilal Banarsidass Publ., 1989. ISBN 8120806735. Page 157.

బయటి లింకులు

[మార్చు]
Video links