బేతపూడి (మంగళగిరి)
బేతపూడి గుంటూరు జిల్లా, మంగళగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| బేతపూడి | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
|---|---|
| జిల్లా | గుంటూరు |
| మండలం | మంగళగిరి |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 522503 |
| ఎస్.టి.డి కోడ్ | 08645 |
గ్రామ పంచాయితీ
[మార్చు]- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బత్తుల నాగసాయి, సర్పంచిగా ఎన్నికైనాడు.
గ్రామ చరిత్ర
[మార్చు]సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి మండలం లోని కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, కృష్ణాయపాలెం. నవులూరు (గ్రామీణ) దాని పరిధిలోని హామ్లెట్స్, నిడమర్రు, యర్రబాలెం, బేతపూడి గ్రామాలు ఉన్నాయి.
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
[మార్చు]తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
మూలాలు
[మార్చు]