భైంసా రెవెన్యూ డివిజను
భైంసా రెవెన్యూ డివిజను | |
|---|---|
గడ్డన్నవాగు ప్రాజెక్టు | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | నిర్మల్ |
భైంసా రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. నిర్మల్ జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం భైంసాలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, ముధోల్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
పరిపాలన
[మార్చు]బైంసా డివిజనులోని మండలాలు:[4]
| క్ర.సం | బైంసా రెవెన్యూ డివిజను | రెవెన్యూ
గ్రామాలు |
నిర్జన
గ్రామలు |
|---|---|---|---|
| 1 | కుబీర్ మండలం | 38 | – |
| 2 | కుంటాల మండలం | 16 | – |
| 3 | బైంసా మండలం | 34 | 1 |
| 4 | ముధోల్ మండలం | 24 | 6 |
| 5 | బాసర మండలం | 17 | 2 |
| 6 | లోకేశ్వరం మండలం | 31 | 5 |
| 7 | తానూర్ మండలం | 33 | 2 |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-03-02.
- ↑ "REVENUE DIVISIONS | Nirmal District | India". www.nirmal.telangana.gov.in. Archived from the original on 2022-01-31. Retrieved 2022-03-02.
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-03-02.