బైబిల్ గ్రంధములో సందేహాలు

వికీపీడియా నుండి
(బైబిల్ పుస్తకంలో సందేహాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అందరు చాలా తప్పుగా ప్రశ్నిస్తున్నారు.అది కూడా జ్ఞానం లేకుండా

బైబిల్ వాయివరుస లేని శృంగారం ప్రోత్సహిస్తోందా?[మార్చు]

జ:- అవును

పూర్వం మానవ సమాజంలో అగమ్యాగమనము అనే ఆచారం ప్రపంచ వ్యాప్తంగా ఉండేది. ఆగమ్యాగమనము (ఆంగ్లంలో Incest) అనగా దగ్గర రక్తసంబంధీకుల మధ్య శారీరక సంబంధం కలిగియుండుట. ఆదికాండము 4:17 ప్రకారం ఆదాము అవ్వల కుమారుడైన కయీను కూడా తన సోదరినే వివాహం చేసుకున్నాడు. ఆదికాండము 19:35 ప్రకారం అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతుకు తన కుమార్తెలు ద్రాక్షారసము త్రాగించి, అతనితో సంభోగించి గర్భవతులైయ్యారు. దేవునికి హేయమైన ఈ చర్య వల్ల వారు దేవుని ప్రజకు శత్రువులైన మోయాబీయులను, అమ్మోనీయులను సంతానంగా పొందారు. వారు చివరికి దావీదు చేతిలో హతమైయ్యారు. (2 సమూయేలు 8:2; 1 దినవృత్తాంతాలు 19). లోతు కుమార్తెలు చేసిన పాప ఫలిత శాపం వారి సంతానంపై పడింది. లోతు కుమార్తెలు దేవుని ఆశ్రయించియుంటే వారు దేవునికి ఇష్టమైన జనాంగాన్ని సంతానంగా పొందియుండేవారు, ఆశీర్వదించబడియుండేవారు. లోకంతో రాజీపడటం మూలంగా ఎంత నష్టం కలుగుతుందో లోతు జీవితం, అతని కుటుంబమే ఉదాహరణ. ఈ ఆచారం కొనసాగించమని బైబిల్ ఎక్కడా బోధించలేదు, కేవలం ఆనాటి సమాజంలో చోటుచేసుకున్న పరిస్తితులు బైబిల్ మనకు తెలియజెప్పింది. అయితే ఈ ఆచారం ప్రవక్త అయిన మోషే జీవించిన కాలములో నిషేధించబడింది. లేవీయకండము 18 వ అధ్యాయములో లైంగిక అవినీతి ఖండించబడింది.

ఆదాము ఆవ్వలు ఏ మానవ జాతికి చెందినవారు?[మార్చు]

భూమిపై లక్షల సంవత్సరాల నుండి ఎన్నో మానవ జాతులు విరాజిల్లాయి. కాని పూర్తి పరిపక్వత చెందిన మానవ జాతి ఆధునిక మానవుడు (Homo Sapiens) మాత్రమే. బైబిలు వ్రాసింది ఆధునిక మానవులే కనుక ఆదాము అవ్వలు ఆధునిక మానవజాతికి చెందినవారవుతారు. అంతకు ముందున్న హోమో హేబిలిస్ (Homo Habilis), హోమో ఎర్గాస్టర్ (Homo Ergaster), హోమో ఎరక్టస్ (Homo Erectus), హోమో హైడల్బర్జెన్సిస్ (Homo Heidelbergensis), హోమో ఎంటిసిసర్ (Homo Antecessor), హోమో నియాండతాలెన్సిస్ (Homo Neanderthalensis) వంటి మానవ జాతులు అంతరించిపోయాయి. ఆ తర్వాత ఆధునిక మానవ జాతి ఆవిర్భవించింది. అంతరించిపోయిన మానవజాతులు బైబిలులో పేర్కొనబడలేదు. ఆధునిక మానవుల్లోని మొట్టమొదటి భార్యా భర్తలను బైబిలులో ఆదాము (Adam) ఆవ్వ (Eve) లుగా నామకరణం చేశారు. బైబిలు కొలమానం ప్రకారం ఆధునిక మానవుల ఆవిర్భావంతోనే సృష్టి ఆరంభం జరిగింది.

విగ్రహారాధన చేసే అన్యప్రజలను యెహోవా నాశనం చేయమనడం,వారి విగ్రహాలను పగులగొట్టమనడం సమంజసమేనా?[మార్చు]

కాదు

ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో సుమారు 400 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికారు. ఎన్నో భయంకరమైన శిక్షలు అనుభవించారు. తమను దేవుడు విడిపిస్తాడని, తమ దేశమైన కనానుకి తరలిస్తాడని ఎదురు చూచారు. అందుకు కండిషన్ దేవుడు చెప్పిన మాటకు లోబడియుండటం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ప్రవక్త అయిన మోషేను ఎన్నుకున్నాడు. అందుకు మోషే ప్రవక్తకు పది ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్లో విగ్రహారాధన చేయకూడదు అనేది ఒక్కటి (నిర్గమకాండము 20:4). అయితే దారి మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులై విగ్రహారధన చేసి దేవుడిని అవమానపరచారు ఆజ్ఞాతిక్రమం మహా పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం. ఫలితం ఇశ్రాయేలు ప్రజల్లో మొదటితరంవారు నాశనం అయ్యారు (నిర్గమకాండము 32:28). ఇది కళ్ళారా చూచిన మోషే రెండవతరంవారు కూడా అంతరించిపోకూడదు అని భావించాడు. అందుకే విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించినవారిని రాళ్ళతో కొట్టి చంపమని ఇశ్రాయేలు ప్రజల్లో రెండవతరంవారికి ఆదేశించాడు మోషే (ద్వితీయోపదేశకాండము 13:6-10). ఆలా ఆదేశం ఇయ్యకపోతే రెండవతరం వారుకూడా నాశనమైపోతారు. 2 పేతురు 2:12 ప్రకారం ప్రజలు దేవుడిని విసర్జించినప్పుడు దైవమార్గం దూషించబడుతుంది. ద్వితీయోపదేశకాండం 13:11, 1 తిమోతీ 5:21 ప్రకారం ఒక వ్యక్తి తప్పు చేయకుండా కట్టడిచేయడానికి హెచ్చరికలు అవసరం. విగ్రహాలను పగులగొట్టమనడం అనే దేవుని ఆజ్ఞ కేవలం ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని సొంతం చేసుకొనేవరకే వర్తిస్తుంది.

క్రీస్తుకు వివాహమైనదా?[మార్చు]

ఈజిప్టు సమీపంలో ఉన్న నాగ్ హమ్మడి (Nag Hammadi) అనే పట్టణ పరిధిలో ఉన్న గుహల్లో కొన్ని ప్రతులు బయల్పడినాయి. వీటిని నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. ఇవి క్రీస్తు శరీరధారి కాదని, ఆత్మస్వరూపి గనుక శిలువ వేయబడలేదని చెబుతాయి. క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న వీటిని చర్చివారు నిషేధించారు. అందులో క్రీస్తు మరణించిన సుమారు 300 - 400 సంవత్సరాల తర్వాత ఫిలిప్పు అనే వ్యక్తి వ్రాసిన పత్రిక ఒకటి. ఈ పత్రికలో క్రీస్తు మగ్ధలేని మరియను ముద్దు పెట్టుకొన్నట్లుగా వ్రాయబడి ఉంది. కాల క్రమేణా ఈ విషయాన్ని క్రైస్తవేతరులు ప్రక్కత్రోవ పట్టించి క్రీస్తు వివాహం చేసుకున్నాడని అన్నారు. 'ముద్దు పెట్టుకున్నంత మాత్రమున క్రీస్తు మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నట్లు కాదని, ఒకవేళ వివాహం చేసుకొని ఉంటే 'వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది' (హెబ్రీయులు 13:4) అని చెప్పిన యేసుక్రీస్తు మగ్ధలేని మరియను భార్యగా ఒక్కసారైనా సమాజానికి పరిచయం చేసి ఉండేవాడని, మగ్ధలేని మరియ నిజంగా క్రీస్తు భార్య అయి ఉంటే ఫిలిప్పు వ్రాసిన పత్రికలో క్రీస్తును తన శిష్యులు "ఆమెను మాకంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా?" అని అడుగరని, యోకోబు రెండవ ప్రకటనలో ఏసుక్రీస్తు యోకోబును ముద్దు పెట్టుకొన్నట్లుగా ఉందని కనుక మగ్ధలేని మరియను ఏసుక్రీస్తు వివాహమాడినట్లు సాక్ష్యం లేదని గ్రంథ పండితుల వాదన.

ఏసుక్రీస్తు జన్మించిన మేరీ కన్యకయేనా?[మార్చు]

శరీర సంబంధముగా ఆలోచించినప్పుడు పురుషుడి ప్రమేయం లేకుండా కన్యక సహజముగా గర్భం దాల్చడం అసాధ్యం. అందువల్ల యేసుక్రీస్తు తల్లి అయిన మరియ కన్యక కాదు, రహస్యంగా ఎవరితొనో సంభోగించిన కారణంగా గర్భం దాల్చినది అని అవహేళన చేసే మతోన్మాదులు లేకపోలేదు. లూకా సువార్త 1:34,35 ప్రకారం మరియ తనకు వచ్చిన స్వప్నములో "పురుషుని ఎరుగని నేను గర్భము ఎలా ధరింతును ? " అని దేవదూతను ప్రశ్నిస్తే అప్పుడు దేవదూత " పరిశుద్ధాత్మ వలన ధరిస్తావు " అని అనడం చూస్తాం. దీనిని బట్టి మరియ కన్యక అని నమ్మవచ్చు.

క్రీస్తుయేసు తల్లిదండ్రులను ద్వేషించమన్నాడా? వారిని నిర్లక్ష్యం చేశాడా?[మార్చు]

క్రీస్తు మానవాళికి బోధించింది రెండు విషయాలు - ప్రేమ, విశ్వాసం. ప్రేమ విషయానికి వస్తే క్రీస్తు అత్యంత గొప్ప ఉదాహరణ, సాక్షి. ఆయన ప్రేమ ఈ భూలోకంలో అందరికంటే గొప్పది. అందుకే అంటున్నాడు క్రీస్తు - "నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించుడి" ఒక వ్యక్తి వచ్చి "అయ్యా నిత్యజీవం పొందడానికి నేను ఎం చెయ్యాలి? " అని అడిగితే అప్పుడు యేసు - “నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అభద్ద సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము " అని చెప్పినట్ట్లు చూస్తాం. (మత్తయి 19:18) యేసు ఒక సందర్భంలో మతోన్మాదులైన శాస్త్రులతోను, పరిశయ్యులతోను "తల్లిదండ్రులను ఘనపరచండి, తల్లిదండ్రులను దూషించువాడు తప్పక మరణము పొందుతాడు" అని చెప్పినట్లు చూస్తాం (మత్తయి 15:4) తల్లిదండ్రులను సన్మానించాలి అని బోధించిన యేసుకు తన తల్లిదండ్రులపట్ల గౌరవం లేదు అని అనడం సరి కాదు. శిలువ మరణానికి ముందు యేసు తన తల్లిని చూచుకొనే బాధ్యత తాను ప్రేమించిన శిష్యుడికి (బహుశా యోహానుకి) అప్పగించాడు (యోహాను 19:27). మానవులంతా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను (ఆశీర్వాదమును) పొందలేకపోవుచున్నారు (రోమా 3:23). బైబిల్ ప్రకారం మానవులందరూ తమ పాపమునకు బానిసలు (యోహాను 8:34). ఏ మనిషీ తనంతట తానుగా నీతిమంతునిగా మారలేడు. కేవలం దేవుని కృపవలన, ఆయన వాక్యము అనుసరించుట వలన నీతిమంతుడు కాగలడు. క్రైస్తవుని గమ్యం పరలోకములో దేవుడు అనుగ్రహించు నిత్యజీవం పొందడం. అందుకు క్రీస్తు ప్రభువే మార్గమును, జీవమును, సత్యము. ఎవ్వడూ ఆయన ద్వారా తప్ప ఇంకెవ్వరిద్వారాను తండ్రియొద్దకు (పరలోకానికి/స్వర్గానికి) చేరలేడు (యోహాను 14:6). నిత్యజీవానికి వారసుడు కావాలి అంటే సత్యాన్ని విశ్వసించాలి. సత్యం (దేవుని వాక్యం) ప్రతి మనిషినీ సమస్త దుర్నీతినుండి విడుదల చేస్తుంది (యోహాను 8:32). క్రీస్తు ఈలోకానికి వచ్చిన ఉద్దేశ్యం వేరు. ఆయన పాపులను (పాపమునుండి) రక్షించడానికి ఈలోకానికి వచ్చాడు (1 తిమోతీ 1:15). కుటుంబ బంధాలు కేవలం లోకసంబంధమైనవి. కనుక ఆయన ప్రకారం కుటుంబ బంధాలకంటే సత్యం మరింత ప్రాముఖ్యమైనది (లూకా 14:26, మత్తయి 10:37). యేసుక్రీస్తు ఉద్దేశ్యంలో తల్లిదండ్రులను ద్వేషించమని కాదు. మనం మన హృదయాల్లో తనకు ప్రధమ స్థానం ఇవ్వాలని కోరుచున్నాడు. తరువాత స్థానం ఇతరులకు ఇమ్మంటున్నాడు. అక్షరాలా ఎవరినీ ద్వేషించకూడదు (మత్తయి 5:43).

బ్రిటీషువారు క్రైస్తవమత ప్రేరేపణతో ఈ దేశాన్ని ఆక్రమించుకొని దోచుకున్నారా?[మార్చు]

దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తమ సొంతదేశమైన కనానుకు చేరుస్తానని వాగ్ధానం చేశాడు. అప్పటికే కనాను దేశంలో అన్యతెగలు నివసిస్తున్నారు. వారు భయంకరమైన విగ్రహారాధన, పసిపిల్లలబలి (లేవీ.కాం 18:21, ద్వితీ.కా 12:31, 1 రాజులు 11:7, ), విచ్చలవిడి లైంగిక దుష్కార్యాలు, మూడనమ్మకాలు కలిగియున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారితో సహవాసం చేస్తే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి చెడిపోయే ప్రమాదముంది.అందుకే అన్యతెగలను తరిమి లేదా సంహరించి తమ దేశాన్ని సొంతం చేసుకోమని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పడం జరిగింది. దేవుని ఆదేశం కేవలం ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడం వరకే, ఇతర దేశస్తులకు మాత్రం వర్తించదు. ఇతరదేశస్తులు పొరుగు దేశాలను ఆక్రమించుకున్నారు అంటే అది వారి తప్పే, దేవుని నడిపింపు కాదు. తప్పు చేయడం మానవ నైజం. మనిషి చేసే తప్పులకు దేవుడు బాధ్యుడు కాదు. ఒక రాజు మరో రాజ్యంపై దండెత్తాడంటే అది కేవలం బైబిల్ ప్రేరణ కానక్కర్లేదు. ఈ దేశంలో రాజులందరూ బైబిల్ ప్రేరణతోనే ఇతర రాజ్యాలపై దండెత్తారా? బ్రిటీషువారు సంపూర్ణ క్రైస్తవులు కాదు. వారు భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు అంటే కారణం వారి మతం కాదు, వారికి కలిగిన దురాశ.

దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు ఎన్నుకున్నాడు?[మార్చు]

దావీదు తన తల్లిగర్భములో పిండముగా ఉండగానే దేవుడు చూచాడు అని కీర్తన 139:16 చెబుచున్నది. అలాగే యిర్మియా 1:4,5 లో దేవుడు “ నీవు నీ తల్లిగర్భమునుండి బయటపడకమునుపే నిన్ను ప్రతిష్టించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని” అని యిర్మియాతో అంటున్నాడు. కనుక దేవుడు అనంత జ్ఞాని కనుక ఇంకా పుట్టని ప్రతిమనిషిని దేవుడు ఎరుగునని అని చెప్పవచ్చు. ఆ క్రమంలో అబ్రహాము గురించి దేవునికి తెలుసు అని చెప్పవచ్చు. ఆదికాండము 12:1-4 లో దేవుడు " నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు” అని అబ్రహాముతో అన్నాడు, అతనిని ఇశ్రాయేలీయులకు గొప్ప పితరుడు అగునట్లుగా ఎన్నుకున్నాడు. ద్వితీయోపదేశకాండము 7:6-8 లో ప్రవక్త అయిన మోషే " నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్టిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనముకంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయముగా ఏర్పరచుకొనెను | మీరు సర్వ జనములకంటే విస్తారమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముకంటే మీరు లెక్కకు తక్కువే కదా | అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గ్రుహములో నుండియూ ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియూ మిమ్మును విడిపించెను " అని ఇశ్రాయేలు జనముతో అన్నాడు. (ఈ భాగాన్ని ఇంకా సవరణ చేయాల్సివుంది)

చివరికి కనాను దేశం ఎవరు చేరారు?[మార్చు]

నేను మిమ్మును ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి కనాను దేశం చేరుస్తాను అని దేవుడు ఒక కండిషన్ మీద ఇశ్రాయేలు ప్రజలకు మాట ఇచ్చాడు (నిర్గమకాండం 6: 6,7). ఆ కండిషన్ - దేవుని మాటకు లోబడటం(నిర్గమకాండం 20:3-17). కాని మార్గ మధ్యంలో దేవునికి విరుద్దంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు ప్రజల్లో మొదటితరం వారు (మోషే, యెహోషువా, కాలేబు తప్ప) అందరూ నాశనమైపోయారు. మోషే కూడా మరణించడంతో యెహోషువా, కాలేబు - ఇద్దరూ మిగిలిన రెండవతరం ఇశ్రాయేలు ప్రజలను మాత్రం కనాను దేశంలోకి నడిపించారు. చూడండి - ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం, యెహోషువా గ్రంధం.

బైబిలు ఎంతవరకూ వాస్తవం ?[మార్చు]

పాత నిబంధనలో జరిగిన సంఘటనలకు సరైన చారిత్రాత్మక ఆధారాల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. పాత నిబంధనలో కొన్ని భాగాలను యూదులు గాథలుగా చెప్పుకొనేవారు. ఆదికాండంలోని చెప్పబడిన జలప్రళయం (Great Flood) నిజమనడానికి అరారాతు పర్వతం మీద నోవాహు చేసిన ఓడ ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి..

స్త్రీ పురుషుల శారీరక సంబంధం పాపమా ?[మార్చు]

ఆదికాండములో యెహోవా దేవుడు ఆదాము హవ్వలను జ్ఞానాన్నిచే ఫలాన్ని తినొద్దన్నాడు. అప్పటివరకూ వారిద్దరి మధ్య శారీరక సంబంధం లేదు. సైతాను ప్రభావంతో ఆ ఫలాలను తిన్నారు. ఇదే ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమం వలన ఆదాము హవ్వలు ఏధేను వనం (Garden of Eden ) నుండి వెలివేయబడ్డారు. తరువాత ఆదాము హవ్వల మధ్య శారీరక సంబంధంతో కూడిన భార్యా భర్తల సంబంధం ఏర్పడింది. ఇదే స్త్రీ పురుషుల మధ్య ఏర్పడ్డ మొదటి బంధం. దాంపత్య జీవితం బయట ఉండే శారీరక సంబంధం (అనగా వ్యభిచారం) పాపపు కార్యం అని బైబిలు చెప్పింది. హెబ్రీయులు 13:4 లో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగానూ, పానుపు (Marriage bed) నిష్కళంకమైనదిగాను ఉండవలెను అని వ్రాయబడియున్నది. మరియూ ఆదికాండము 1:28 లో - మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి అని దేవుడు ఆదాము అవ్వలతో చెప్పినట్లు చూస్తాం.

తెలుగు బైబిలు భాష ఎందుకు వైవిధ్యంగా ఉంటుంది?[మార్చు]

ప్రపంచములో ఏ మత గ్రంథమైనా ఆయా భాషలో గ్రాంధికముంటేనే అవి పవిత్ర గ్రంథాలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు వైదిక ధర్మం చెందిన రామాయణ, మహాభారత కావ్యాలు గ్రాంధికంలోనే ఉంటాయి. అవి మామూలు వాడుక భాషలో ఉంటే చందమామ కథల పుస్తకాలవలే కనిపిస్తాయి. అలాగే గ్రంథమైన బైబిలు కూడా. బైబిలులో చాలా పదాలు హీబ్రూ, గ్రీకు పదాల్లోంచి ఆవిర్బవించాయి.

యెహోవాకు కుష్టురోగులంటే ద్వేషమా?[మార్చు]

పూర్వపు రోజుల్లో కుష్టురోగం (లెప్రసీ) అనేది చేసిన పాపానికి గుర్తుగా ఉన్నది. కుష్టురోగం సోకిన వ్యక్తికి దేవుని మందిరలోకి ప్రవేశం, సంఘములో నివశించడం నిషేధం. కుష్టురోగం వచ్చిన వ్యక్తికి సామాజిక దూరం (Social Distance)ముఖ్యము అని లేవీయకాండము 13వ అధ్యాయం చెబుచున్నది. ఆ వ్యాధిగ్రస్తునికి క్వారంటైన్ (అబ్జర్వేషన్) చేసే విధానం కూడా చెబుచున్నది. ఆ రోగం తగ్గిన వ్యక్తి దేవుని మందిరములోనికి ప్రవేశించవచ్చని లేవీయకాండము 16:28 చెబుచున్నది. పాపం చేసిన వ్యక్తులకు దేవుడు కుష్టురోగాన్ని ప్రసాదించడం (2 రాజులు 5:27), తప్పు తెలుసుకున్న వానికి కుష్టురోగం నుండి స్వస్తపరచడం (సంఖ్యాకాండము 12:15) పాతనిబంధనలో చూస్తాం. అలాగే ఒక కుష్టురోగిని యేసు స్వస్తపరచుట క్రొత్త నిబంధనలో చూస్తాం (మత్తయి సువార్త 8:1-4). దీనిని బట్టి కుష్టురోగులంటే దేవునికి అసహ్యం కాదు అని చెప్పవచ్చు.

క్రైస్తవులు ఇతర మతస్తుల ప్రసాదాలు ఎందుకు స్వీకరించరు[మార్చు]

అనునది జీవితకాలపు దీక్ష. దానికీ ఆహార నియమాలు ఉన్నవి. సర్వసాధారణంగా క్రైస్తవులు ఇతర మతస్తులు ఇచ్చే ప్రసాదాలు స్వీకరించరు. దీనికి కారణం 1 కొరింథీయులకు 10:28 లో " కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ప్రసాదం” అని అంటే, ఈ విషయం మీతో చెప్పినవాని కోసం, వాని మనస్సుకోసం దాన్ని తినకండి" అని వ్రాయబడియున్నది. బైబిలు ప్రకారం ఆజ్ఞాతిక్రమం మాహాపాపం అని క్రైస్తవులు భయపడతారు కనుక విగ్రహాల ప్రసాదాలు స్వీకరించరు.

ఏసు క్రీస్తు డిసెంబర్ 25 న జన్మించారా?[మార్చు]

యేసు జన్మదినం బైబిలులో ఎక్కడా ప్రస్తావించబడలేదు. యేసు జన్మించినది బెత్లహేము అనే గ్రామంలో. యూదుల నెల అయిన క్లిసేపు (నవంబరు - డిసెంబరు మధ్య వచ్చే నెల) వాతావరణం చలి, వర్షాలతో ఉంటుంది. గొర్రెల కాపరులు తాము గానీ తమ గొర్రెలు గానీ రాత్రిపూట ఆరుబయట ఉండకుండా జాగ్రత్త వహిస్తారనడంలో సందేహం లేదని ఎజ్రా 10:9,13, యిర్మియా 36:22 చెబుతున్నవి. కాని యేసు జన్మించిన రాత్రి గొర్రెల కాపరులు పొలాల్లో తమ మందలకు కాపాలా కాస్తూ ఉన్నారని తెలుస్తోంది. వాస్తవాని బైబిలు రచయిత లూకా[ఆధారం చూపాలి] ఆ సమయంలో బెత్లహేము సమీపంలో గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచున్నారు అని వివరించాడు. లూకా 2:2-12 ప్రకారము పగటిపూట బయట తిరగడం మాత్రమే కాదు కాని గొర్రెల కాపరులు పొలములోనే ఉండటం గమనిస్తాము. అలా బయట ఉన్నారు అనే వర్ణన డిసెంబరు నెలలో బెత్లహేములో చలి, వర్షాలతో కూడే వాతావరణానికి పొందికగా ఉండదు. కాబట్టి యేసు జన్మించిన కాలంనాటి చుట్టుప్రక్కల పరిస్థితులు ఆయన డిసెంబరు నెలలో జన్మించలేదని సూచిస్తున్నాయి.[1] అన్ని దేశాలకు చలికాలం డిసెంబరు నెలలో ఉండదు. కొన్ని దేశాలకు అక్టోబరులో ఉంటే మరికొన్ని దేశాలకు డిసెంబరు - జనవరి నెలల్లో ఉంటుంది. కాబట్టి చలికాలం ఎప్పుడొస్తే అప్పుడు క్రిస్మస్ జరుపుకుంటాము. అమెరికా, ఐరోపా దేశాలు డిసెంబరు 25 ను క్రిస్మస్ గా నిర్ణయించాయి.

క్రైస్తవులు సువార్తను ఎందుకు ప్రకటిస్తారు?[మార్చు]

ప్రపంచంలోని క్రైస్తవులు మాత్రమె కాకుండా ఇతర మతస్తులూ తమ మత విశ్వాసాలను వ్యాప్తి చేస్తారు,యూదా ఇస్కాన్,ఇస్లాం. దీనికి ముఖ్య కారణం ఉంది. క్రైస్తవులు క్రీస్తు రెండవరాకడ, తీర్పు దినాన్ని నమ్ముతారు. మారుమనస్సు లేనివాళ్ళు, దేవుడికి విరుద్ధంగా జీవించేవాళ్ళు తీర్పుదినాన్న శిక్షలు పొందుతారని, కనుక వారు క్రీస్తును అంగీకరించి రక్షణ పొందితే మనుష్యులు ఆ తీర్పు దినాన్ని తప్పుకోవచ్చని క్రైస్తవులు విశ్వసిస్తారు. అందుకే క్రైస్తవులు సువార్తను ప్రకటిస్తారు. యేసు తన శిష్యులతో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి (మార్కు 16:15 ) అని ఆజ్ఞాపించాడు. మీరు వెళ్ళి అన్ని దేశములనుండి శిష్యులను చేయుడి (మత్తయి 28:19 ) అని కూడా వారికి ఆజ్ఞాపించాడు. ఈ వాక్యాల కారణంగా పాస్టర్లు, బిషప్పులు ఎల్లవేళలా సువార్త సభలు ప్రతి చోటా నిర్వహిస్తూవుంటారు.

ధర్మశాస్త్రము (పాత నిబంధన) కొట్టివేయబడిందా?[మార్చు]

పాత నిబంధనలో మొదటి ఐదు పుస్తకాలు మోషే ధర్మశాస్త్రం. దాన్ని దేవుని ప్రేరణతో మోషే ప్రవక్త రచించాడు. మత్తయి 5:17 లో "ధర్మశాస్త్రమునైననూ, ప్రవక్తల వచనములనైననూ కొట్టివేయవచ్చితిని అని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు" అని ఏసు చెప్పినట్లు కనిపిస్తుంది. “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [యెహోవాను] ప్రేమి౦పవలెను.” అని మత్తయి 22:37 చెబుతున్నది. దీనిని ఆచరిస్తే దేవుని పది ఆజ్ఞలు అనుసరించినట్లే అని అర్ధమగుచున్నది. మనిషి నెరవేర్చలేకపోయిన ధర్మశాస్త్రాన్ని క్రీస్తు నెరవేర్చినట్లు అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 2:14 చెబుచున్నది.

క్రైస్తవ స్త్రీలు అలంకరించుకోకూడదా?[మార్చు]

సర్వ సాధారణంగా క్రైస్తవుల్లో బాగా నిష్టగా ఉండే స్త్రీలు, ముఖ్యంగా పెంతికోస్తు సంఘములలో స్త్రీలు ఎటువంటి నగలు ధరించడానికి ఇష్టపడరు. అయితే శరీర అలంకరణ గురించి పలు బైబిలు గ్రంథాల్లో చెప్పబడింది.

  • 1 తిమోతి 2:9 -, స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారైయుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకోవలెను.
  • 1 పేతురు 3:3,4 - జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపలి అలంకారము మీకు అలంకారముగ ఉండక, |సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను.

చక్కగా అలంకరించుకున్న స్త్రీని చూచిన ఏ పురుషుడైనా మోహించి పాపం చేసే అవకాశముంటుంది. శారీరక అందానికి ప్రాముఖ్యత ఇవ్వని స్త్రీని పురుషుడు మోహించే అవకాశం వుండదని కొన్ని సంఘములలో క్రైస్తవుల భావన. మరికొన్ని సంఘములలో అలంకరణ ధరించవచ్చు గాని దానికంటే ఆత్మీయ అలంకరణ ముఖ్యమని, అలంకరణ అసలు ధరించకూడదని బైబిలు ఎక్కడా చెప్పలేదని భావిస్తారు. నిర్గమకాండము 33:5 లో దేవుడైన యెహోవా ప్రవక్త మోషేతో చెడుతనముగా ఉన్న ఇశ్రాయేలు ప్రజను తమ ఆభరణములు తీసివేయాలని చెప్పమని అన్నాడు. ఈ వాక్యమును బట్టి ఇశ్రాయేలు ప్రజ (దేవుని దృష్టిలో) మంచిగా ఉన్నప్పుడు అలంకరించుకోవచ్చని దేవుడు ఇష్టపడ్డాడని తెలుస్తున్నది. కనుక క్రైస్తవులు కూడా క్రీస్తు పట్ల విశ్వాసముగా ఉన్నప్పుడు అలంకరించుకోవచ్చని చెప్పవచ్చును.

దేవుడు ఆదాము అవ్వలను ఫలాన్ని ఎందుకు తినొద్దన్నాడు?[మార్చు]

అధ్యాత్మిక పరిభాషలో లోక జ్ఞానము దైవ జ్ఞానానికి విరుద్ధం. లోక జ్ఞానాన్ని ఇచ్చే ఫలాన్ని తింటే మానవుడు నిత్యజీవానికి దూరమై నాశనమవుతాడని దేవుడు తెలుసుకొని ఆదాము అవ్వలను జ్ఞానఫలాన్ని తినొద్దన్నాడు.

క్రిస్మస్ తాతయ్య ఎవరు?[మార్చు]

క్రిస్మస్ తాతయ్య బైబిల్ లో వున్న పాత్ర కాదు. అతను మూడవ శతాబ్దానికి చెందిన ఒక దైవ సేవకుడు (Bishop).[2]

శిలువ ధ్యానాలు అంటే ఏమిటి?[మార్చు]

క్రొత్తనిబంధనలోని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మానవాళి పాప పరిహార్ధ నిమిత్తం ఏసు ప్రభువు ఒక అరణ్యంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయడం జరిగింది. దానికి కృతజ్ణతగా కేథలిక్కులు, లూధరన్, బైబిలు మిషను వంటి కొన్ని క్రైస్తవ సంఘాలు శిలువ ధ్యానాలు (Lent Days) అనే పేరుతో ప్రత్యేక ప్రార్థనలు ఆచరిస్తాయి.

యేసు క్రీస్తు ఉనికి నిజమేనా?[మార్చు]

Cornelius Tacitus (A.D. 55-120) was considered the greatest historian of ancient Rome. He wrote of Nero who "punished with the most exquisite tortures, the persons commonly called Christians, who were hated for their enormities. Christus [Christ], the founder of the name, was put to death by Pontius Pilate, procurator of Judea in the reign of Tiberius: but the pernicious superstition, repressed for a time, broke out again, not only through Judea, where the mischief originiated, but through the city of Rome also."1

Also, Flavius Josephus, a Jewish historian, (A.D. 38-100+) wrote about Jesus in his Jewish Antiquities, saying that Jesus was a wise man who did surprising feats, taught many, won over followers from among Jews and Greeks, that Jesus was believed to be the Messiah, was accused by the Jewish leaders, was condemned to be crucified by Pilate, and was considered to be resurrected.2

The existence of Jesus Christ is recorded not only by Josephus and Tacitus, but also by ancient writers such as Suetonius, Thallus, Pliny the Younger, and Lucian. And from the Jewish Talmud, "we learn that Jesus was conceived out of wedlock, gathered disciples, made blasphemous claims about himself, and worked miracles, but these miracles are attributed to sorcery and not to God."3

Thus, historians both favorable and unfavorable regarding Jesus did write about him. Also there were many historical writings about the early Christians.కార్నెలియస్ టాసిటస్ (A.D. 55-120) పురాతన రోమ్ యొక్క గొప్ప చరిత్రకారుడిగా పరిగణించబడింది. నీరో గురించి అతను "అత్యంత సున్నితమైన హింసలు, వారి మూర్ఖుల పట్ల అసహ్యించుకున్న క్రైస్తవులు అని పిలవబడే వ్యక్తులచే శిక్షింపబడ్డారు." అనే పేరును స్థాపించిన క్రిస్టస్ [క్రీస్తు], అతడు జుడాయొక్క ప్రార్ధకురాలు పొంటియస్ పిలేట్ తిబెరి యొక్క పాలన: కానీ అన్యాయపు మూఢనమ్మకం, కొంతకాలం అణచివేయబడినది, మళ్ళీ మొదలయ్యింది, జుడాయి ద్వారా మాత్రమే కాకుండా, అల్లర్లు ఆరంభమయ్యాయి, కానీ రోమ్ నగరం కూడా. "

అలాగే, ఒక యూదు చరిత్రకారుడైన ఫ్లేవియస్ జోసీఫస్ (క్రీస్తుశకం 38-100 +), తన యూదుల పురాణాలలో యేసు గురించి రాశాడు, యేసు ఆశ్చర్యకరమైన పనులు చేసాడు, అనేకమందికి బోధించాడు, యూదులకు, గ్రీకులకు అనుచరులను గెలిచాడు, యేసు మెస్సీయా అని నమ్మేవారు, యూదుల నాయకులు ఆరోపించారు, పిలేట్ సిలువ వేయబడాలని ఖండించారు, పునరుత్థానం చేయబడ్డారు.

జీసస్ క్రీస్తు ఉనికిని జోసెఫస్, టాసిటస్ మాత్రమే కాక, సుతోనియస్, థాలస్, ప్లినీ ది యంగర్, లూసియాన్ వంటి పురాతన రచయితలు కూడా రికార్డ్ చేశారు. యూదు టాల్ముడ్ నుండి, "యేసు వివాహం నుండి ఉద్భవించాడని, శిష్యులను సేకరించి, తన గురించి దైవభక్తిగల వాదనలు చేసాడు, అద్భుతాలు చేశారని మేము తెలుసుకున్నాము, కానీ ఈ అద్భుతాలు దేవుడికి వ్యంగ్యానికి కారణము కాదు."

ఆ విధంగా, యేసు తన గురించి వ్రాసినట్లు చరిత్రకారులు రెండూ అనుకూలమైనవి, తొలి క్రైస్తవుల గురించి అనేక చారిత్రక రచనలు ఉన్నాయి.

మత్తయి సువార్త, లూకా సువార్త భాగాల్లో ఏసు వంశావళి ఎందుకు పరస్పరం భిన్నంగా వున్నాయి?[మార్చు]

ఏసు వంశావళి మత్తయి సువార్త 1 వ అధ్యాయంలోను, లూకా సువార్త 3 వ అధ్యాయంలోను ఇవ్వబడింది. అయితే ఈ రెండు సుమారు ఒకే విధంగా ఇవ్వబడలేదు. మత్తయి, లూకా ఇద్దరూ తమదైన శైలిలో ఏసు వంశావళిని పేర్కొన్నారు. మత్తయి యేసు వంశావళిని అబ్రహాము నుండి మొదలుపెట్టి దావీదు వరకూ వెళ్ళాడు, లూకా - ఆదాము నుండి మొదలుపెట్టి దావీదు వరకూ వెళ్ళాడు. ఇక్కడి నుండి రెండుగా, నాతాను (మరియ వైపు?) మరియూ సలోమాను గ్రూపులుగా వేరైయ్యాయి. దీనికి వేర్వేరు అభిప్రాయాలున్నాయి. లూకా ఏసును మరియ యొక్క వంశావళి ద్వారా గుర్తుపట్టాడని, మత్తయి ఏసును యెసేపు వంశావళి ద్వారా గుర్తుపట్టాడని బైబిలు పండితుల నమ్మకం. బైబిలు ప్రకారం యేసేపు ప్రమేయం లేకుండా మరియ యేసుకు జన్మనిచ్చింది. కనుక చట్టబద్దంగా మాత్రమే యేసేపు యేసుకు తండ్రి, ప్రకృతి సిద్ధంగా కాదు.

మత్తయి (Matthew) సువార్త ప్రకారం యోసేపు (Joseph) తండ్రి యాకోబు (Jacob). కాని లూకా సువార్తలో యేసేపు తండ్రి హెలీ (Heli) గా పేర్కొనబడింది. దీనికి కారణం బైబిలు పండితులు ఈ విధంగా చెబుతారు. పూర్వపు రోజుల్లో పుత్రుడులేని మామగారు తమ అల్లుళ్ళను కొడుకులుగా భావించి దత్తత తీసుకొనేవారని, ఆ ప్రకారం లూకా సువార్తలో యోసేపు మరియ తండ్రి అయిన హెలీ (అలియాస్ యోకిము / Joachim) తండ్రి అయ్యాడని బైబిలు పండితుల వివరణ. కాని వంశావళి మధ్యలో ఇచ్చిన మిగిలిన పేర్లు భిన్నంగా ఉన్నాయి. Levirate marriage system (మత్తయి 22:25) ప్రకారం ఒక సోదరుడు సంతానం లేక చనిపోతే అతని భార్యను మరో సోదరుడు వివాహమాడి సంతానాన్ని కనొచ్చు.

క్రైస్తవ మతము బ్రిటీషువారి మతమా?[మార్చు]

క్రైస్తవం ఇంగ్లీషువాళ్ళ మతం. బ్రిటీషువారు భారత భూమిలోకి అడుగుపెట్టకముందే అపోస్తలుడైన తోమా (Saint Thomas) సుమారు క్రీస్తు శకం 50లో భారతదేశంలోని రాష్ట్రాల్లో సువార్థ ప్రకటించినట్లుగా చరిత్ర చెబుతున్నది. అతడిది ఇస్రాయేలు దేశం. క్రీస్తు శకం 72, జూలై 3 న తమిళనాడులో నిర్యాణం చెందాడు. బ్రిటీషువారు భారత దేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చారు. బ్రిటీష్ వారికి క్రైస్తవులకి సంబంధం ఇండియాలో క్రైస్తవ్యం అభివృద్ధి చెందింది. క్రిస్టియన్ మిషానిరీల వల్ల వీరికి బ్రిటిష్ వారికి అసలు పడదు బ్రిటిష్ వాళ్ళ ఎక్కువ హిందువులకు సపోర్ట్ చేసేవాళ్లు హిందువుల గుడులకి వాళ్ళు ఇచ్చిన విరాళాలు కి కూడా సాక్షాలు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం అప్పటిలో క్రిస్టియన్ మిషానిరీ లను వెతిరేకిస్తూ ఇండియాలో క్రిస్టియన్ మిషనరీలను బెన్ చేసింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కానీ వాళ్ళు డచ్ షిప్లలో వచ్చి ఇక్కడ మిషనరీలు నడిపేవాళ్ళు.

ఒక మొరాకి నవిగేటర్ అతనిపెరు ఇబ్నుబెట్యూటా ఇతను ముస్లిం నావికుడు ప్రపంచ సంచారకుడు ఈయన క్రీస్తుశకం52 లో గోవకి వచ్చినప్పుడు జువారి(zuari) నది వద్ద క్రిస్టియన్ అప్పటికే సెటిల్ ఐ ఉన్నారు అని రాసుకున్నాడు ఈ నది ఇంకా ఉంది.

తరువాత సైన్జెవియర్ అనే కేతిలిక్ విశ్వసి 05/06/1542 లో గోవకి వచ్చి అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు సాక్షాలు ఉన్నాయి. కాబట్టి బ్రిటిష్ వారికి క్రైస్తవులకి ఎలాంటి సంబంధం లేదు. బ్రిటిష్ వారికి బ్రిటిష్ మిషనరీలకి ఎలాంటి సంబంధం లేదు.

క్రైస్తవులు క్రీస్తు విగ్రహాలను ఆరాధిస్తారా?[మార్చు]

క్రైస్తవం విగ్రహారాధన ఖండిస్తుంది. బైబిలు పాత నిబంధనలో విగ్రహారాధన చేయకూడని చెప్పబదియున్నది. క్రీస్తు విగ్రహానికి ప్రార్థన చేయడంకూడా విగ్రహారాధనే.

క్రైస్తవులు అక్రమాలు, పాపాలు చేస్తారా?[మార్చు]

1యోహాను 5: 17 దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? - Watch Tower Bible and Tract Society of India, 2005, Page 221
  2. How St. Nick Became Santa Claus By Craig von Buseck - CBN.com Contributing Writer, cbn.com

లంకెలు[మార్చు]